
ట్విట్టర్‌లో సాయానికి ముందుకొచ్చిన కేటీఆర్
హైదరాబాద్: ట్విట్టర్‌లో చురుగ్గా ఉండి.. ఎప్పటికప్పుడు నెటిజన్ల విజ్ఞపులపై స్పందిస్తున్న తెలంగాణ ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు మరోసారి తన పెద్ద మనస్సు చాటుకున్నారు. రెండు కిడ్నీలు చెడిపోయి సాయం కోసం ఎదురుచూస్తున్న ఓ మహిళకు ఆపన్నహస్తం అందించేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు.
హైదరాబాద్ ఉప్పల్‌లో ఓ అనాథ ఆశ్రమాన్ని నిర్వహిస్తున్న 55 ఏళ్ల కరుణ ఇటీవల ఆరోగ్యం విషమించింది. రెండు మూత్రపిండాలు చెడిపోవడంతో నగరంలోని ఓ నర్సింగ్‌హోమ్‌లో చికిత్స పొందుతున్నారు. ఉప్పల్‌లో ‘కారుణ్య ఆర్ఫా అండ్ ఒల్డేజ్ హోమ్’ నిర్వహిస్తున్న కరుణ 70 మంది అనాథా చిన్నారులకు, నలుగురు వృద్ధ వితంతువులకు సేవలు అందిస్తున్నారు. కిడ్నీలు చెడిపోవడంతో ఆమె ఆస్పత్రి పాలైందని, ఆమెకు నిమ్స్‌లో చికిత్స అందించాల్సిన అవసరముందని, ఆమె వైద్యఖర్చులకు రూ. 3 లక్షలు ఖర్చు అవుతుందని కోరుతూ హృదయ స్పందన అనే స్వచ్ఛంద సంస్థ ట్విట్టర్‌లో కేటీఆర్‌ను, తెలంగాణ సీఎంవోను విజ్ఞప్తి చేసింది. ఈ విజ్ఞప్తిపై స్పందించిన మంత్రి కేటీఆర్ మరిన్ని వివరాలు తెలుపాలని, ఆమెకు సాయం అందిస్తామని హామీ ఇచ్చారు.
Send me the details. Will make sure she is helped https://t.co/mmHMFd07Za
— KTR (@KTRTRS) 26 November 2016