
వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మకు పుట్టినరోజు నాడు ఊహించని షాక్ తగిలింది. గురువారం బర్త్‌డే సందర్భంగా అందరూ ఆయనకు విషెస్ చెబుతుంటే, నిర్మాత నట్టికుమార్ మాత్రం ఆర్జీవీపై కేసు వేసి ఆయనకే షాకిచ్చాడు. వివరాల్లోకి వెళ్లితే.. వర్మ నుంచి వస్తోన్న బోల్డ్ మూవీ `డేంజరస్ తెలుగులో `మా ఇష్టం` పేరుతో శుక్రవారం విడుదల కావాల్సి ఉంది.
అప్సర రాణి, నైనా గంగూలీ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాను ప్రదర్శించేందుకు ఇప్పటికే కొన్ని థియేటర్స్ నిరాకరించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆర్జీవీ తనకు రూ. 5 కోట్ల 29 లక్షలు ఇవ్వకుండా తప్పించుకొని తిరుగుతున్నారని నిర్మాత నట్టికుమార్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రతి సినిమాకు రూ. 50 లక్షలు ఇవ్వాలన్న నిబంధల్ని వర్మ తుంగలో తొక్కినట్లు ఆరోపించారు. పిటిషన్‌ను విచారించిన కోర్టు ఆర్జీవీ తెరకెక్కించిన మా ఇష్టం చిత్రాన్ని ఆపాలంటూ ఆదేశాలు జారీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment