Ram Gopal Varma Comments About KCR Biopic - Sakshi
Sakshi News home page

Ram Gopal Varma : కలిసిపోయిన ఆర్జీవీ-నిర్మాత నట్టికుమార్‌

Published Thu, Oct 13 2022 9:30 AM | Last Updated on Thu, Oct 13 2022 10:50 AM

Ram Gopal Varma And Producer Natti Kumar Compromised - Sakshi

పదేళ్లకు ఒకసారి యూత్‌ జనరేషన్‌ మారుతుంది. అందుకే రీ రిలీజ్‌ సినిమాలకు విశేషమైన స్పందన లభిస్తోంది’’ అని ప్రముఖ దర్శక, నిర్మాత రామ్‌గోపాల్‌ వర్మ అన్నారు. నితిన్, ప్రియాంక కొఠారి జంటగా రామ్‌గోపాల్‌ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అడవి’. విశాఖ టాకీస్‌పై నట్టి కువర్‌ నిర్మించిన ఈ సినిమా 2009లో విడుదలైంది. ఈ చిత్రాన్ని ఈ నెల 14న రీ రిలీజ్‌ చేస్తున్నారు.

ఈ సందర్భంగా రామ్‌గోపాల్‌ వర్మ మాట్లాడుతూ– ‘‘తరం మారుతున్న ప్రతీసారి గతంలో వచ్చిన కొన్ని సినిమాలు చూడాలని మారుతున్న యూత్‌ కోరుకుంటుంటారు. ‘అడవి’లో ఫారెస్ట్‌ ఫొటోగ్రఫీ, సాంగ్స్, సౌండ్‌ వంటివి హైలైట్‌గా ఉంటాయి. గతంలో నేను తీసిన పలు హిట్‌ సినిమాలను ఆయా నిర్మాతలతో మాట్లాడి రీ రిలీజ్‌ చేయాలని అనుకుంటున్నాను. కేసీఆర్‌గారి బÄñæపిక్‌ చేసే ఆలోచన ఉంది’’ అన్నారు.

నట్టి కుమార్‌ మాట్లాడుతూ– ‘‘అడవి’ సినిమాను దాదాపు వంద థియేటర్లలో మళ్లీ విడుదల చేస్తున్నాం. అలాగే ప్రభాస్‌ ‘రెబల్‌’ను ఈ నెల 15న, 22న ‘వర్షం’ సినిమాను రీ రిలీజ్‌ చేయబోతున్నాను. రామ్‌గోపాల్‌ వర్మగారు, నేను పాతికేళ్లుగా మంచి స్నేహితులం. కొద్దికాలం క్రితం మా మధ్య వచ్చిన అభిప్రాయభేదాలు సమసి పోయాయి. మా కాంబినేషన్‌లో మళ్లీ సినిమాలు చేస్తాం’’ అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement