టాలీవుడ్ నిర్మాత నట్టికుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలుగు సినిమా ఇండస్ట్రీని అగ్ర హీరోలు, నిర్మాతలు రోడ్డున పడేశారని ఆవేదన వ్యక్తం చేశారు. రౌడీలకు, గూండాలకి అవార్డ్స్ ఇస్తున్నారని అశ్వనీదత్ మాట్లాడటాన్ని ఆయన తప్పుబట్టారు. రెండు రాష్ట్రాలు విడిపోయాక అవార్డ్స్‌కు విలువ పోయిందన్నారు. ప్రభుత్వం ముందు ఇండస్ట్రీని తాకట్టు పెట్టింది ఇండస్ట్రీ పెద్దలేనని ఆరోపించారు.
ఇండస్ట్రీ పెద్దలు అని చెప్పుకునే వాళ్లు అప్పుడు అమరావతిలో భూములు తీసుకుంది వాస్తవం కాదా? అని నట్టి కుమార్ ప్రశ్నించారు. చంద్రబాబు చేసిన తప్పును.. సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి? చేయడని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వాన్ని అవార్డ్స్ గురించి అడిగే దమ్ముందా? అని నిలదీశారు.
(ఇది చదవండి: అభిమానిని తోసేసిన షారూక్ ఖాన్.. మండిపడుతున్న నెటిజన్స్)
ప్రత్యేక విమానాల్లో వెళ్లి అమరావతిలో ఇండస్ట్రీని తాకట్టుపెట్టారని తీవ్ర ఆరోపణలు చేశారు. ఇండస్ట్రీ కోసం కాకుండా రాజకీయాల కోసం మాట్లాడడం సరైంది కాదని హితవు పలికారు. పార్టీలకతీతంగా ఇండస్ట్రీని అభివృద్ధి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎఫ్‌డీసీ ఛైర్మన్ ఇండస్ట్రీ పెద్దల్ని కలిసి మాట్లాడాలని సూచించారు.
నట్టి కుమార్ మాట్లాడుతూ.. ' ల్యాండ్స్ తీసుకున్న సినీ పెద్దలు స్టూడియోలు ఎందుకు నిర్మించట్లేదు.? స్టూడియోలు ఏర్పాటు చేస్తే ఉద్యోగావకాశాలు లభిస్తాయి కదా. తెలంగాణలో 2014లో రూ.20 వేలు రెంట్ ఉంటే... ఇప్పుడు లక్షన్నర ఉంది. తెలంగాణ ప్రభుత్వం సపోర్ట్ చేస్తా అని మాత్రమే అంటోంది. కానీ చిన్న సినిమాలకి చేస్తోంది ఏమి లేదు.' అని అన్నారు.
చిన్న సినిమాల గురించి మాట్లాడుతూ.. '2014 నుంచి చిన్న సినిమా చచ్చిపోయింది. రెండు రాష్ట్రాలలో 2014 నుంచి స్టూడియోల నిర్మాణానికి ఎవరికి అనుమతులు లేవు. చిన్న, పెద్ద అందరూ కలిస్తేనే ఇండస్ట్రీ. పెద్దల్ని కలవలేక పోతున్నాం. అందుకే మీడియా ముందుకు వచ్చాను. దాసరి నారాయణరావు ఇండస్ట్రీకి ఎంతో చేశారు. కానీ ఆయన చనిపోయాక ఎవరు పట్టించుకోవడం లేదు. రెండు ప్రభుత్వాలు దాసరి కోసం ఏదైనా చేస్తే బాగుంటుంది. దాసరి విజ్ఞాన పార్క్ పెట్టాలని కోరుతున్నా. ఆయనను గౌరవించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది.' అని అన్నారు.
(ఇది చదవండి: నరేశ్- పవిత్ర 'మళ్లీ పెళ్లి'.. ముహుర్తం పెట్టేశారుగా!)
Comments
Please login to add a commentAdd a comment