
నట్టి క్రాంతి
నిర్మాత నట్టి కుమార్ తనయుడు నట్టి క్రాంతి హీరోగా పరిచయమవుతోన్న చిత్రం ‘సూర్య’. ఈ చిత్రం ద్వారా ఉమామహేశ్వరరావు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. నట్టీస్ ఎంటర్‌టైన్‌మెంట్స్, క్విట్టీ ఎంటర్‌టైన్మెంట్స్ పతాకాలపై నట్టికుమార్ కుమార్తె నట్టి కరుణ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలోని ‘నిజమేనా...’ అంటూ సాగే పాటను దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ, నటీనటులు కస్తూరి, శివబాలాజీ, మధుమిత విడుదల చేశారు. నట్టి క్రాంతి మాట్లాడుతూ –‘‘చిన్నప్పటి నుంచి సినిమా రంగం అంటే ఇష్టం. ఓ వైపు చదువుకుంటూనే అసోసియేట్ డైరెక్టర్‌గా పని చేశాను.
న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో నటన, దర్శకత్వంలో శిక్షణ పొందాను. వైజాగ్ సత్యానంద్‌గారి దగ్గర కూడా నటనలో శిక్షణ తీసుకున్నాను’’ అన్నారు. ‘‘సైకాలజీ కోర్సు పూర్తి చేసిన నేను ‘ముద్ర’ సినిమాతో నిర్మాతగా మారి, వరుసగా సినిమాలు తీస్తున్నాను. చక్కటి ప్రేమకథా చిత్రం ‘సూర్య’. అల్లరి చిల్లరగా తిరిగే ఓ గల్లీ కుర్రాడు ప్రేమలో పడిన నేపథ్యంలో ఎలాంటి ఆటుపోట్లు ఎదురయ్యాయి? అనేదే ఈ చిత్రకథ. లాక్ డౌన్ ముగిసిన తర్వాత మిగతా చిత్రీకరణను పూర్తి చేస్తాం’’ అన్నారు నట్టి కరుణ. ఈ చిత్రానికి కెమెరా: వల్లీ ఎస్.కె., సంగీతం: సుకుమార్ పి, సమర్పణ: నట్టి కుమార్.
Comments
Please login to add a commentAdd a comment