రాజమౌళిపై సంచలన ఆరోపణలు.. ఆమె కోసం నా జీవితాన్ని నాశనం చేశాడు: శ్రీనివాస్‌ | Rajamouli friend Srinivasa Rao Allegations Its True Or not | Sakshi
Sakshi News home page

రాజమౌళిపై సంచలన ఆరోపణలు.. ఆమె కోసం నా జీవితాన్ని నాశనం చేశాడు: శ్రీనివాస్‌

Published Thu, Feb 27 2025 1:53 PM | Last Updated on Thu, Feb 27 2025 2:58 PM

Rajamouli friend Srinivasa Rao Allegations Its True Or not

టాలీవుడ్‌ స్టార్‌ డైరెక్టర్‌పై ఆయన స్నేహితుడు  ఉప్పలపాటి శ్రీనివాసరావు సంచలన ఆరోపణలు చేశారు. రాజమౌళి తనను భరించలేనంతగా టార్చర్‌ చేస్తున్నాడని ఒక సెల్ఫీ వీడియోను సోషల్‌మీడియాలో షేర్‌ చేశారు. తమ మధ్య 34 ఏళ్ల స్నేహ బంధం ఉందని ఆయన చెప్పారు. కానీ, రాజమౌళి చేస్తున్న టార్చర్‌ వల్ల తాను ఆత్మహత్య చేసుకోబోతున్నట్లు ఆయన తెలిపారు.

'భారతదేశంలోనే టాప్‌ డైరెక్టర్‌ రాజమౌళి, ఆయన సతీమణి రమా రాజమౌళి వల్ల నేను చనిపోతున్నాను. నేను పబ్లిసిటీ కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేయడం లేదు. ఎమ్‌ ఎమ్‌ కీరవాణి, గుణ్ణం గంగరాజు, చంద్ర శేఖర్ యేలేటి, హను రాఘవపూడి, మైత్రీ మూవీస్‌ చెర్రీ ఇలా చాలామందితో కలిసి నేను పనిచేశాను. వీళ్లందరికీ కూడా రాజమౌళితో నా స్నేహం గురించి తెలుసు. 1990 నుంచి మేమిద్దరం స్నేహితులం. రామాయణం, మహాభారతం ఒక మహిళ వల్ల జరిగాయంటే ఏమో అనుకున్నాం. కానీ, ఒక మహిళ వల్ల మా జీవితం ఇలా అవుతుందని కలలో కూడా ఊహించుకోలేదు. అందరి జీవితాల్లో మాదిరే మా లైఫ్‌లోకి  ఒక అమ్మాయి ప్రవేశించింది. ముందు రాజమౌళితోనే ఆమెకు పరిచయం.. ఆ తర్వాత నాతో కూడా స్నేహం. 

'ఆర్య2' సినిమా మాదిరే మా జీవితాల్లోకి ఒక మహిళ
ఆర్య2 సినిమా కథ మాదిరే మా స్టోరీ ఉంటుంది. మేము ముగ్గురం క్లోజ్‌ కాబట్టి ఏం చేద్దాం అంటూ నేనే రాజమౌళిని అడిగాను. ఆ అమ్మాయిని వదిలేయాలని రాజమౌళినే నన్ను కోరాడు. దానికి నేను ఒప్పుకోలేదు. ముగ్గురం కలిసే ఉందామని చెప్పాను.  అలా చేస్తే చాలా చండాలంగా ఉంటుందని రాజమౌళి అన్నాడు. అప్పుడు ఆమెను నేనే పెళ్లి చేసుకుంటానని చెప్పి.. నలుగురం కలిసే ఉందామని కోరాను. దానికి కూడా రాజమౌళి ఒప్పుకోలేదు. కాలం అన్నీ మార్చేస్తుందని చెప్పి ఆమెకు దూరంగా ఉండమని నాకు రాజమౌళి  చెప్పాడు. ఈ విషయం నుంచి తప్పుకోవాలని నన్ను కోరడంతో అందుకు ఓకే చెప్పాను.  ఇదంతా జరిగింది మా కెరీర్‌ ప్రారంభం శాంతినివాసం సీరియల్‌ సమయంలో జరిగింది.  

అప్పుడు మా  అందరి పరిస్థితి అంతంత మాత్రమే కాబట్టి నేను సైలెంట్‌గా ఉండిపోయాను. కొద్దిరోజుల పాటు నాతో రాజమోళి బాగానే ఉన్నాడు. అయితే, స్టార్‌ డైరెక్టర్‌గా రాజమౌళికి ఎప్పుడైతే స్టార్‌డమ్‌ వచ్చిందో గొడవలు మొదలుపెట్టాడు. వాడి కోసం నా 34 ఏళ్ల జీవితాన్ని వదులుకున్నాను. మన ట్రైయాంగిల్‌ స్టోరీని ఒక సినిమా తీస్తానని వాడితో ఒకరోజు అన్నందుకు నాకు నరకం అంటే ఏంటో చూపించాడు. వాడి పిల్లలను కూడా నేను దగ్గరుండే పెంచాను. నంబర్‌ వన్‌ డైరెక్టర్‌ కావడంతో నన్ను అడ్డుతొలిగించాలని ప్లాన్‌ చేస్తున్నాడు. ఇప్పుడు నాకు 54 ఏళ్లు .. పెళ్లి కూడా చేసుకోలేదు. సింగిల్‌గానే ఉంటున్నాను. వాడి వల్ల నా జీవితం నాశనం అయింది. 

ఒక ఫ్రెండ్‌ వల్ల నా జీవితం ఇలా అయిపోయింది.  వాడిని నేను ఏ విషయంలోను డిస్ట్రబ్‌  చేయలేదు. కానీ, ఈ రహస్యాలన్నీ అందరికీ చెప్పాననుకొని నన్ను టార్చర్‌ చేస్తున్నాడు. ఇదంతా మా ముగ్గురి మధ్య జరిగింది. నేను చనిపోతున్నాను. ఆ తర్వాత అయినా సరే రాజమౌళికి లై డిటెక్టర్‌ టెస్ట్‌ చేయండి. అసలు విషయం తెలుస్తుంది. ఇవన్నీ నా మరణ వాగ్మూలంగా తీసుకోవాలని కోరుతున్నాను.' అంటూ వీడియోలో శ్రీనివాసరావు చెప్పాడు. అయితే, ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలీదు. కేవలం అతను చెబుతున్న ప్రకారం మాత్రమే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ వీడియో గురించి దర్శకులు రాజమౌళి రెస్పాండ్‌  అవుతారేమో చూడాల్సి ఉంది. అయితే, యమదొంగ సినిమా టైటిల్‌ కార్డ్‌లో తన పేరు కూడా ఉంటుందని శ్రీనివాసరావు చెప్పడం గమనార్హం .
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement