ప్లీజ్... ఆ ఫొటోలు మాత్రం వద్దు!
తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయమైనా సరే... ఒకప్పుడు ధైర్యంగా బయటకు చెప్పేసేవారు దీపిక. అప్పుడెప్పుడో ఓ సారి ఆమె పాల్గొన్న ఓ టీవీషోలో దీపిక మెడపై ఉన్న గాట్లను సదరు కార్యక్రమ వ్యాఖ్యాత గమనించి, మెడపై ఆ గాట్లేంటి? అనడిగితే -‘‘రణబీర్ ప్రేమగాట్లు’’ అని ధైర్యంగా చెప్పి అక్కడున్నవాళ్లందరూ ఆశ్చర్యపోయేలా చేసింది దీపిక. అలాంటి దీపిక మైండ్‌సెట్‌లో ఇప్పుడు అనూహ్యమైన మార్పు. ఇటీవల ఐఫా అవార్డుల్లో పాల్గొని వెళుతున్న దీపిక ఎయిర్‌పోర్ట్‌లో కనిపించడంతో... ఓ స్టిల్ ఫొటోగ్రాఫర్ ఆమెను క్లిక్ మనిపించాడు. అంతే... ‘నా ఫొటోలు డిలీట్ చేయ్..’ అంటూ అతని వెంట పడింది దీపిక. ‘నీకు కావాల్సినంత డబ్బు ఇస్తాన’ని ఆఫర్ కూడా చేసిందట. ‘మీ ఫొటోలు ఇప్పటివరకూ నేను చాలా తీశాను.
ప్రత్యేకించి ఈ ఫొటోలను ఎందుకు డెలిట్ చేయమంటున్నారో అర్థం కావడం లేదు’ అని వాపోయాడట సదరు ఫొటోగ్రాఫర్. తర్వాత కెమెరాలో స్టిల్స్ ఓపెన్ చేసి చూస్తే... దీపిక మెడపై గోటి గీతలు, పంటిగాట్లు ఉన్నాయట. అవి బయటకు పొక్కుతాయనే దీపిక ఆ ఫొటోలు డిలీట్ చేయమని బతిమాలింది. ఇటీవల ఓ ప్రముఖ పత్రికకు ఆమె ఇచ్చిన ఇంటర్‌వ్యూలో... ‘ప్రేమకు దూరంగా ఉండాలనుకుంటున్నాను. ఎవరితోనైనా సరే... ఇక నుంచి స్నేహం వరకే’ అని భారీ స్టేట్‌మెంట్ ఇచ్చిన దీపిక, ఇలా గోటి గాట్లతో ఓ స్టిల్ ఫొటోగ్రాఫర్‌కి చిక్కడం బాలీవుడ్లో పెద్ద చర్చకే దారితీసింది.