ranbir
-
గ్రాండ్ షో మేన్
► రాజ్‌కపూర్ మరణించినప్పుడు రణ్‌బీర్‌కు ఆరు సంవత్సరాలు. తాతగారి గొప్పతనం విని పులకించిపోతుంటాడు. ► నేను ఈ దేశంలోని ప్రతి ఒక్కరికీ తెలిసినప్పుడే నన్ను నేను స్టార్ అనుకుంటాను... అంటాడు రణ్‌బీర్. ► దీపికా పదుకొనె, రణ్‌బీర్... కెరీర్లో అడుగుపెట్టినప్పటి నుంచి ఫ్రెండ్స్. దీపికా అతడిని బాగా ఇష్టపడింది. ‘ఇతర ప్రలోభాల వల్ల ఆమె స్నేహాన్ని వదలుకున్నాను’ అని రణ్‌బీర్ చెప్పాడు. ► కత్రీనా కైఫ్‌తో రణ్‌బీర్ స్నేహం నడిచింది. కాని ఆ ముక్కు ఒక్క తుమ్ముకే ఊడిపోయింది. రణ్‌బీర్ కపూర్ టాప్ 10 సినిమాలు 1. ఏ దిల్ హై ముష్కిల్ 2. బర్ఫీ 3. రాక్‌స్టార్ 4. వేకప్ సిద్ 5. రాజ్‌నీతి 6. ఏ జవానీ హై దివానీ 7. అన్జానీ అన్జానా 8. అజబ్ ప్రేమ్‌కీ గజబ్ కహానీ 9. సావరియా 10. బే షరమ్ ► రాజ్ కపూర్‌కు షో మేన్ అనే బిరుదు ఉంది. ►ఆయన గ్రాండ్ సన్ని ‘గ్రాండ్ షో మేన్’ అనక తప్పదు. ► ఏ సినిమాలో నటించినా దృష్టి తన మీద పడేలా చేసుకునే నటుడు రణ్‌బీర్. ► తాతకు దగ్గులు నేర్పించే స్థాయిలో ‘బర్ఫీ’, ‘రాక్‌స్టార్’, ► ‘ఏ దిల్ హై ముష్కిల్’ వంటి సినిమాలలో నటించాడు. ► తండ్రి రిషి కపూర్, తల్లి నీతూ సింగ్‌ల కంటే కచ్చితంగా మెరుగైన నటుడు. ► ఇటీవల ఫ్లాపుల తర్వాత ‘ఏ దిల్ హై ముష్కిల్’తో లేచి నిలబడిన మొనగాడు రణ్‌బీర్ కపూర్. సినిమా వాళ్ల జీవితం పైకి కనిపించేటటువంటిది కాదు. ముళ్లుంటాయి – అని అంటూ ఉంటారు. రణ్‌బీర్ కపూర్ దారిలో కూడా ముళ్లున్నాయి. కాకపోతే ఆ ముళ్ల పేర్లు– రిషి కపూర్, నీతూ సింగ్. రణ్‌బీర్ కపూర్ బంగ్లాలో అతడికి ఇష్టమైన భాగం ఏదైనా ఉందంటే అది మెట్ల వరుసే. చాలాసార్లు రణ్‌బీర్ తన బాల్యంలో ఆ మెట్ల మీద కూచుని ఉండేవాడు. ఒక్కోసారి రాత్రి 12 నుంచి ఉదయం 5 వరకూ ఆ మెట్ల మీదే ఉండిపోయేవాడు. కారణం– లోపల తల్లిదండ్రుల తగాదా నడుస్తూ ఉండేది. వస్తువులు పగులుతూ ఉండేవి. అరుపులు వినిపిస్తూ ఉండేవి. చివరికి వాళ్లు రాజీ పడేవారు. ఈ లోపు రణ్‌బీర్ కపూర్ నిముషాలు లెక్కపెట్టుకుంటూ ఉండేవాడు. సెలబ్రిటీల మధ్య పొరపొచ్చాలు సహజం. ఇక వాళ్లిద్దరూ భార్యాభర్తలు అయినప్పుడు మరీ సహజం. రిషీ బిజీ స్టార్. నీతు పెళ్లయ్యాక కుటుంబానికి కట్టుబడింది. అతడు బయటా ఆమె ఇంట్లో... తెలియని అభద్రత... దూరం ఇవి సమస్యకు కారణాలు. ఆ కొట్లాటలు రణ్‌బీర్ మీద వయసులో అతడి కంటే రెండేళ్లు పెద్దదయిన అతడి సోదరి రిద్ధిమా మీద ప్రభావం చూపాయి. ‘తర్వాత తర్వాత ఆ గొడవలు ఎంత పెద్ద ఎమోషన్ని అయినా లోపలికి తీసుకునే స్థాయికి నా మానసిక లోతులను పెంచాయి’ అని రణ్‌బీర్ చెప్పుకున్నాడు. రణ్‌బీర్ రానురాను ఇంట్రావర్ట్‌గా మారిపోయాడు. తల్లితోనే అనుబంధం పెంచుకున్నాడు. తండ్రితో దాదాపు దూరమే. ఆ తర్వాత చాలా రోజులకు తండ్రితో కలిసి పని చేసేటప్పుడే తండ్రి హృదయం కూడా మంచిదే అని గ్రహించాడు. చదువు రాదు. తల్లిదండ్రులు ముంబైలో ప్రసిద్ధ స్కూల్ – బాంబే స్కాటిష్ స్కూల్లో చేర్పిస్తే చివరి నుంచి మూడో ర్యాంకులో ఉండేవాడు. అల్లరి ఎక్కువ. ఒకసారి ప్రిన్సిపాల్ అతడి జుట్టు పట్టుకుని వరండాలో ఈ చివరి నుంచి ఆ చివరి వరకు కొట్టుకుంటూ వెళ్లాడు. అయినా దారికి రాలేదు. ఆ రోజుల్లో కరాటేలో చేరి పెద్దయ్యాక కరాటే ఇన్స్ట్రక్టర్ కావాలని అనుకున్నాడు. కాని ఆ తర్వాత తెలిసింది– సినిమాల్లో పని చేయడానికి చదువు పెద్దగా అక్కర్లేదని. చదువు అక్కర్లేదా? ఇంతకు మించిన మంచి మాట లేదని 7–8 తరగతులు చదువుతుండగా తాను కాబోయే సినిమా హీరో అని నిశ్చయించుకున్నాడు. అయితే పది గండం దాటాలి కదా. పరీక్షలు రాశాడు. చివరకు రిజల్ట్స్ వచ్చాయి. అతడి కష్టం మీద 53.4 పర్సెంటేజీ మార్కులు వచ్చాయి. ఆ సమయంలో రణ్‌బీర్ తన తండ్రి రిషితో కలిసి న్యూయార్క్‌లో ఉన్నాడు. మార్కులు తెలుసుకున్న నీతూ సింగ్ అమెరికాకు ఫోన్ చేసి ఒకటే ఏడవడం– నా బంగారు తండ్రి పాసయ్యాడు... పదో తరగతి పాస్ అయ్యాడు... అని. న్యూయార్క్‌లో తండ్రి పెద్ద పార్టీ ఇచ్చాడు. కపూర్ ఫ్యామిలీలో పదో క్లాసు ఇబ్బంది పడకుండా పాసైన మొదటి కుర్రాడు మరి రణ్‌బీర్. పెద్దింటి కుటుంబాలు తమ పిల్లలను అమెరికాలోని బిజినెస్ స్కూళ్లలో చదివించడం ఫ్యాషన్. రిషి కపూర్, నీతూ సింగ్ కూడా రణ్‌బీర్ దగ్గర అలాంటి ప్రతిపాదన తెస్తే నేనెలాగూ యాక్టర్‌ని కావాలనుకుంటున్నాను కదా మధ్యలో ఈ డూప్లికేట్ చదువు ఎందుకు నేరుగా యాక్టింగ్‌కు సంబంధించిన చదువే చదువుతాను అని న్యూయార్క్ మెథడ్ యాక్టింగ్ నేర్చుకోవడానికి వెళ్లాడు. అక్కడ కొన్నాళ్లు చదువుకున్నాడు. కాని ఒంటరితనం... బోరింగ్ క్లాసులు... ఈ గొడవ ఎందుకు చలో ఇండియా అనుకొని వచ్చేశాడు. అప్పట్లో సంజయ్‌లీలా బన్సాలీ ఉమ్ము కూడా పెట్రోల్లా మండుతోంది. బన్సాలీ హీరోగా లాంచ్ చేస్తే ఆ హీరోకి తిరుగుండదు. రణ్‌బీర్ కూడా సంజయ్ తనను హీరోగా లాంచ్ చేయాలని కోరుకున్నాడు. అతణ్ణి ఇంప్రెస్ చేయడానికి అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేరాడు. అప్పుడు బన్సాలీ ‘బ్లాక్’ సినిమా తీస్తున్నాడు. ఒకసారి టీమ్‌లో చేరాక ఎవరి కొడుకైనా ఒకటే. రణ్‌బీర్ కపూర్‌కి సెట్లో ఇతరులకు ఎదురయ్యే అన్ని రకాల అవమానాలు ఎదురయ్యాయి. మరుసటి రోజు ఉదయం షూటింగ్ అంటే ఈ ముందు రోజు రాత్రి 2 గంటల నుంచి 4 గంటల వరకు లైట్లు బిగించడం సెట్లో సహాయకుడిగా పని చేయడం.. ఫ్లోర్లు తుడవడం... అంతా చాకిరి. అదంతా చేశాడు. చివరకు బన్సాలీ కరుణించాడు. సినిమా దొరికింది. భారీ సినిమాయే దొరికింది. రిషికపూర్ నీతూ సింగ్‌ల కుమారుడు రణ్‌బీర్ కపూర్– అనిల్ కపూర్ కుమార్తె సోనమ్ కపూర్లు జంటగా బన్సాలీ సినిమా అనౌన్స్ చేశాడు. పేరు– సావరియా. ‘సావరియా’ ఫ్లాప్ అయ్యింది. భయంకరంగా ఫ్లాప్. రణ్‌బీర్ కపూర్ అందులో టవల్ కట్టుకుని పాట పాడితే దానిని చూసి అందరూ ఆటపట్టించారు. ఏదో అనుకుంటే ఏదో అయ్యింది. కొందరు మాత్రం రణ్‌బీర్ యాక్టింగ్ బాగుందని అన్నారు. వచ్చిన ప్రచారం ఎంతో కొంత వచ్చింది దీనిని వాడుకుందాం అని భావించిన యశ్‌రాజ్ ఫిల్మ్స్ వెంటనే రణ్‌బీర్‌తో ‘బచ్ నా ఏ హసీనో’ సినిమాను ప్రకటించింది. ‘బచ్ నా ఏ హసీనో’ మకుటంతో మొదలయ్యే ‘హమ్ కిసీసే కమ్ నహీ’ పాట రిషి కపూర్ జీవితాన్ని వెలిగించింది కనుక ఆ పేరుతో వచ్చే సినిమా రణ్‌బీర్‌ను ఫీల్డ్‌లో స్థిరపరుస్తుందని భావించారు. అంచనా తప్పలేదు. ఆ సినిమా కమర్షియల్ సక్సెస్ అయ్యింది. 2009 వచ్చేసరికి రణ్‌బీర్ అకౌంట్లో మూడు సినిమాలు పడ్డాయి. 1. వేకప్ సిద్, 2. అజబ్ ప్రేమ్‌కీ గజబ్ కహానీ 3. రాకెట్ సింగ్. మూడూ బాక్సాఫిస్ దగ్గర మంచి ఫలితాలు రాబట్టాయి. మూడింటికీ కలిపి రణ్‌బీర్ ఫిల్మ్‌ఫేర్ నుంచి క్రిటిక్స్ అవార్డు కూడా గెలుచుకున్నాడు. అయితే రణ్‌బీర్‌లోని నటుడి సత్తాను చాటిన రెండు సినిమాలు మాత్రం ఆ తర్వాత వచ్చాయి. అవి ‘రాక్‌స్టార్’, ‘బర్ఫీ’. ఇంతియాజ్ అలీ దర్శకత్వంలో వచ్చిన ’రాక్‌స్టార్’ గాఢమైన అనుభూతులను ప్రదర్శించగల శక్తిని వెలికి తెచ్చింది. అనురాగ్ బసు దర్శకత్వంలో వచ్చిన ‘బర్ఫీ’ మూగ చెవిటి పాత్రను ఇచ్చి కేవలం హావభావాలతో ఒక పెద్ద సినిమాను భుజం పై మోయగల సత్తా రణ్‌బీర్‌కు ఉందని నిరూపించింది. ఆ తర్వాత అతడికి ఆర్థికంగా మంచి ఫలితాలు ఇచ్చిన సినిమా – ‘ఏ జవానీ హై దివానీ’. ఫ్లాపులు రావడం చాలా బాధగా ఉంటుంది. ముఖ్యంగా ఒకదాని తర్వాత ఒకటి. పైగా బాగా ఆడుతాయనుకున్న సినిమాలు పోతే తట్టుకోవడం కష్టంగా ఉంటుంది. బే షరమ్ (2013), రాయ్ (2015), బాంబే వెల్వెట్ (2015) రణ్‌బీర్ కపూర్‌ని దాదాపు చావు దెబ్బ తీశాయి. మూడు పెద్ద ఫ్లాపులు. మాజీ గర్ల్ ఫ్రెండ్ దీపికా పదుకొనెతో యాక్ట్ చేసిన సినిమా ‘తమాషా’ (2015) కూడా సోసోగా వెళ్లింది. ఒక హీరోకు ఇన్ని ఫ్లాపులు కష్టమే. అప్పటికే రణ్‌బీర్ భారతదేశంలో భారీ పారితోషికం డిమాండ్ చేసే నటుడి స్థాయిలో నిలబడి ఉన్నాడు. గ్రాఫ్ పడటానికి లేదు. మరేం చేయాలి. జవాబు కనిపించింది. అది– కరణ్ జొహర్. టాలెంట్ ఉన్న నటుడికి టాలెంట్‌తో పాటు పోరాటం చేయగల నటుడికి సరైన అవకాశం ఇస్తే నిలబడతాడు అనటానికి మొన్న వచ్చిన ‘ఏ దిల్ హై ముష్కిల్’ సినిమా ఒక ఉదాహరణ. కరణ్ జొహర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అనేక వొడిదుడుకులను దాటుకుని (పాకిస్తాన్ నటీనటులు ఉన్నారని గొడవైంది) విడుదలయ్యి విజయం సాధించింది. భారీ విజయమే సాధించింది. శుద్ధమైన ప్రేమను కనుగొనే ప్రయాణం చేసిన ఒక ప్రేమికుడి కథ అయిన ఈ సినిమాలో రణ్‌బీర్, అనుష్కల నటనతో పాటు పాటలు కూడా సినిమా విజయంలో కీలకపాత్ర పోషించాయి. అయిపోయిందనుకున్న రణ్‌బీర్ మళ్లీ తన ట్రాక్‌లో సగర్వంగా నిలబడ్డాడు. రణ్‌బీర్ నటుడుగా తన తోటి నటులైన షాహిద్ కపూర్, రణ్వీర్ సింగ్ వంటి వారితో పోటీ పడటం ఎలాగూ ఉంటుంది... కాని కపూర్ల వారసుడిగా వారి కంటే ముందు ఉండాల్సిన బరువు కూడా ఉంటుంది. ఆ సంగతి రణ్‌బీర్‌కు తెలుసు. అందుకే అతడు మరింత కష్టపడుతుంటాడు. తనను తాను నిలబెట్టుకోవడానికి కష్టపడుతుంటాడు. ఏ కష్టమైనా ముష్కిల్గానే ఉంటుంది. కాని హిట్ సినిమా కోసం ఆ ముష్కిల్కు ఎస్ అంటుంటాడు రణ్‌బీర్. రణ్‌బీర్ కపూర్ టాప్ 10 పాటలు 1. జబ్ సే తేరే నైనా – సావరియా 2. బచ్ నా ఏ హసీనో – బచ్ నా ఏ హసీనో 3. గూంజ్సా హై కోయి ఇక్తారా – వేకప్ సిద్ 4. ఎత్తిసీ హసీ ఎత్తిసీ ఖుషీ – బర్ఫీ 5. తూ జానే నా – అజబ్ ప్రేమ్ కీ గజబ్ కహానీ 6. జో భి మై – రాక్‌స్టార్ 7. బద్ తమీజ్ దిల్ – ఏ జవానీ హై దివానీ 8. తూ హై కి నహీ – రాయ్ 9. తూ సఫర్ మేరా – ఏ దిల్ హై ముష్కిల్ 10. మేరి రూహ్కా పరిందా (బులయా)– ఏ దిల్ హై ముష్కిల్ – సాక్షి ఫ్యామిలీ ప్రతినిధి -
మేకింగ్ ఆఫ్ మూవీ - ఏ దిల్ హై ముష్కిల్
-
మా అమ్మాయి రణ్‌బీర్‌ని తన తండ్రి అనుకుంది!
‘ఏ దిల్ హై ముష్కిల్’... అంటే ఈ మనసు చాలా క్లిష్టమైనది అని అర్థం. ఇప్పుడీ చిత్ర దర్శక-నిర్మాత కరణ్ జోహార్ పరిస్థితి కూడా క్లిష్టంగానే ఉంది. భారత్-పాక్ మధ్య ఏర్పడిన తాజా సమస్యల కారణంగా పాకిస్తాన్ నటీనటులు నటించిన చిత్రాలను విడుదల చేయకూడదనీ, అసలు వాళ్లను ఎంకరేజ్ చేయకూడదనీ వివాదం మొదలైంది. ఈ నేపథ్యంలో ‘ఏ దిల్ హై ముష్కిల్’లో పాక్ నటుడు ఫవాద్ ఖాన్ ప్రత్యేక పాత్ర చేయడం ఈ చిత్రానికి తలనొప్పిగా మారింది. సినిమా విడుదలైతే థియేటర్లు బద్దలు కొడతామని ‘మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన’ పేర్కొంది. దాంతో 28న ఈ చిత్రం విడులవుతుందా? లేదా అనే చర్చ జరుగుతోంది. మరోవైపు ఈ చిత్రంలో రణ్‌బీర్ కపూర్, ఐశ్వర్యా రాయ్ చేసిన రొమాంటిక్ సన్నివేశాలు హాట్ టాపిక్ అయ్యాయి. ఆ సన్నివేశాలకు సంబంధించిన ఫొటోలు చూసి, కోడలుపిల్ల అలా నటించినందుకు అమితాబ్ బచ్చన్ ఆగ్రహం వ్యక్తం చేశారనే వార్త ప్రచారమైంది. ‘టూ మచ్’గా ఉన్న సీన్స్‌ని తీసేయాలని కరణ్ జోహార్‌ని అమితాబ్ కోరారని మరో వార్త వచ్చింది. ఆ వార్తల సంగతెలా ఉన్నా.. ఈ సీన్స్ గురించి ఐశ్వర్యా రాయ్ ఏమంటున్నారో చూద్దాం. ‘‘ఇందులో నా పాత్ర పేరు సబా తలియర్ ఖాన్, రణ్‌బీర్ కపూర్ పాత్ర పేరు అయాన్. సబాయే అయాన్ జీవితం. ఆమె కవితలను అతను పాడతాడు. సబా ప్రభావం అతని మీద ఎంత ఉంటుందంటే.. అతని జీవితంలో ఓ భాగమైపోతుంది. విడిపోవడంలో కూడా ఓ కొనసాగింపు ఉంటుంది. అంత గాఢమైన బంధం వాళ్లది. ఆ బంధం తాలూకు ప్రేమ చాలా గాఢంగా ఉంటుంది. అందుకే సబా, అయాన్ల మధ్య వచ్చే రొమాంటిక్ సీన్స్‌లో ఆ గాఢత కనిపించాలని కరణ్ జోహార్ అన్నారు. రొమాన్స్ డోస్ ఇంకా ఉండాలన్నారు. కానీ, నా కంఫర్ట్ స్పేస్ దాటి నేనేదీ చేయలేదు’’ అని ఐష్ స్పష్టం చేశారు. ఇంకా ‘ఏ దిల్ హై ముష్కిల్’ గురించి ఆమె మాట్లాడుతూ - ‘‘సినిమా చూసి, బయటికొచ్చేవాళ్లు ‘ఎంత అందమైన కెమిస్ట్రీ’ అనుకోకుండా ఉండలేరు. సినిమాలో ఉన్న ప్రేమ గురించి, పాటల గురించి, విజువల్స్ గురించి గొప్పగా మాట్లాడుకుంటారు. నేను సబాలాంటి పాత్రను ఇంతవరకూ చేయలేదు. ఆ మాటకొస్తే... రీల్‌పై సబా ఎదుర్కొన్న అనుభవాలు రియల్ లైఫ్‌లో నేను ఎదుర్కోలేదు. ఒప్పుకున్న పాత్రకు న్యాయం చేయడం నటిగా నా ధర్మం. ‘జజ్బా’లో దల్బీర్ కౌర్‌గా సాదాసీదా లుక్‌లో కనిపించాను. ఈ సినిమాలో అందంగా కనిపించాలి, కనిపించాను. క్యారెక్టర్ ఎలా డిమాండ్ చేస్తే అలా కనిపిస్తాను. ఆ విషయంలో నాకెలాంటి అభద్రతాభావం లేదు’’ అన్నారు. ఇదిలా ఉంటే.. ఐష్-అభిషేక్ బచ్చన్ల ముద్దుల కూతురు ఆరాధ్యా బచ్చన్ ఓసారి రణ్‌బీర్ కపూర్‌ని చూసి, తన తండ్రి అనుకుందట. ఈ విషయం గురించి ఐష్ మాట్లాడుతూ - ‘‘ఒక రోజు అభిషేక్ లాంటి టోపీ, జాకెట్ వేసుకున్నాడు రణ్‌బీర్. అతన్ని వెనక నుంచి చూసిన ఆరాధ్య తన డాడీ అనుకుంది. వెనకాల నుంచి వెళ్లి గట్టిగా హగ్ చేసుకుంది. ఆ తర్వాత కంగారు పడింది’’ అన్నారు. -
దేవదాసు... నాకొద్దు బాసూ!
‘‘మాది అంతులేని కథ. ఫుల్స్టాప్ పెట్టకుండా మీడియా డిస్కస్ చేస్తూనే ఉంటే.. మా కథ ఎప్పటికీ ఆగదు. రణ్‌బీర్ ఓ మాట అన్నాడు. బదులుగా నేనేదో అన్నాననుకోండి.. మూడో వ్యక్తి ఇంకేదో అంటాడు. ప్లీజ్.. బ్రేకప్‌కి కారణం ఏంటి? వంటి ప్రశ్నలు అడగొద్దు. ఆ డిస్కషన్ మా ఇద్దరి మధ్యే ఉండాలి’’ అని కత్రినా కైఫ్ రిక్వెస్ట్ చేస్తున్నారు. అందాల సుందరి ఇంతలా విజ్ఞప్తి చేసుకున్నా బీ-టౌన్ మీడియా మాత్రం వదలడంలేదు. కూపీలు లాగే పనిలో పడింది. రణ్‌బీర్, కత్రినాల బ్రేకప్ గురించి ఇప్పటికే బాలీవుడ్ జనాలు కథలు కథలుగా చెప్పుకున్నారు. ఇటీవల ఓ కార్యక్రమంలో ‘‘కత్రినా నాకు చాలా స్పెషల్. అమ్మానాన్నల తర్వాత నా జీవితంలో అంత ముఖ్యమైన వ్యక్తి. బ్రేకప్ తనను అప్సెట్ చేసింది. నేను బాగా తాగుతాను. నా ప్రేయసి కోసం తాగుడు మానేయాలనుకుంటున్నాను’’ అని రణ్‌బీర్ వ్యాఖ్యానించడంతో కొత్త చర్చ మొదలైంది. రణ్‌బీర్ వాలకం చూస్తుంటే.. కత్రినాకు దగ్గరయ్యేలా అతని మాటలు ఉన్నాయి. కత్రినా మాత్రం ఆసక్తి చూపిస్తున్నట్లు కనిపించడం లేదట. ఎందుకంటే... షూటింగ్ లేకపోతే రణ్‌బీర్ నోట్లో చుక్క పడాల్సిందేనట. మామూలుగా ప్రేమలో విఫలమైనవాళ్లు దేవదాసులా మద్యానికి బానిసలవుతారు. కానీ, రణ్‌బీర్ మాత్రం ప్రేమలో ఉన్నప్పటికీ సీసా పట్టుకోకుండా ఉండలేడట. ఇది కత్రినాకు నచ్చలేదట. అందుకే రణ్‌బీర్ నుంచి విడిపోవాలనుకుందని బీ-టౌన్ మీడియా ఇన్వెస్టిగేషన్ తేల్చింది. ఇదిలా ఉంటే హీరో సిద్ధార్థ్ మల్హోత్రాకు కత్రినా దగ్గరైందని కొందరు అంటున్నారు. అందుకే రణ్‌బీర్‌కు దూరం కావాలనుకుందని చెప్పుకుంటారు. మరి.. బ్రేకప్‌కి అదే కారణమా? లేక నిజంగానే రణ్‌బీర్ మద్యానికి బానిస కావడంవల్లే కత్రినా అతనికి దూరమైందా? నిజమేంటో రణ్‌బీర్, కత్రినాలకే ఎరుక. -
విజయం ఒంటరితనాన్ని ఇస్తుంది
దీపికా పడుకొనె ప్రస్తుతం బాలీవుడ్లో నం.1 స్థానంలో ఉందనే చెప్పుకోవాలి. ప్రియాంకా చోప్రా, అనుష్కా శర్మ, సోనాక్షి సిన్హా తదితరులు గట్టి పోటీ ఇస్తున్నా దీపికాకు దొరికినన్ని అవకాశాలు మరొకరికి దొరకడం లేదు. తాజాగా రణ్‌బీర్‌తో చేసిన ‘తమాషా’కు మంచి స్పందనే లభిస్తుండటంతో ఆమె మరింత సంతోషంగా ఉంది. కాని విజయం వెంట ఒంటరితనం వస్తుందని కూడా చెబుతోంది. ‘నం.1 స్థానం మీద నాకు నమ్మకం లేదు. ఎందుకంటే ఆ స్థానం తర్వాత పైకి చేరడానికి మరో అంకె లేదు. నేను ఇంకా చాలా నేర్చుకోవాలి. సాధించాలి. కాని ఇలాంటి స్థితిలో చాలామంది మన చుట్టూ మూగుతుంటారు. ఎవర్ని నమ్మాలో అర్థం కాదు. అంతా క్లోజ్‌గా ఉన్నట్టు కనిపించినా ఒంటరిగా ఉన్నట్టుంటుంది. ఈర్ష్య, అసూయలతో చాలామంది దూరం అయిపోతారు. నా అదృష్టం ఏమిటంటే చిన్నప్పటి ఫ్రెండ్స్ కొంతమంది విడవకుండా కొనసాగుతున్నారు. వాళ్ల వల్లే నేను విజయాల తాలూకు ఒంటరితనాన్ని దాటేస్తున్నాను అంటుందామె. బాలీవుడ్ బాత్ -
'తమాషా' కోసం... మాజీ ప్రియుడి కోసం
ముంబై: బాలీవుడ్ భామ, సొట్టబుగ్గల సుందరి దీపికా పదుకోన్ ముంబై లోని సిద్ధి వినాయకగుడిని దర్శించింది. తల్లి ఉజాలాతో కలిసి వచ్చిన ఈ భామ గుడిలో పూజా కార్యక్రమాలు నిర్వహించింది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే రణబీర్ కోసం కూడా ప్రార్థించానన్న పొడుగు కాళ్ల సుందరి మాటలు, పూజలు బీటౌన్ లో హాట్ టాపిక్ గా మారాయి. గతంలో రణబీర్ తో దీపిక ప్రేమాయణం సాగించినట్టు పుకార్లు షికార్లు చేశాయి. అయితే తన ప్రతి సినిమా విడుదలకు ముందు ఈ గుడికి రావడం తనకు ఆనవాయితీ అని దీపికా చెబుతోంది. అందులో భాగంగానే ఈ రోజు (శుక్రవారం) విడుదలైన తమాషా సినిమా విజయం సాధించాలని గణనాధుణ్ని దర్శించుకున్నానంది. అంతేగాక మరో ఆసక్తికర విషయాన్ని కూడా మీడియాకు వివరించింది. మీ ఫ్రెండ్ రణబీర్ కోసం కూడా ప్రార్థించారా అని మీడియా ప్రతినిధులు అడిగినపుడు... 'అవును... రణబీర్ చాలా టాలెంటెడ్ యాక్టర్... జీవితంలో గెలుపు ఓటములు ఎవరికైనా రావడం సహజం.. అలాగే రణబీర్ కు కూడా.. ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుంది. మూవీ చూశాను.. అతని నటన అద్భుతంగా ఉంది' అని కితాబిచ్చింది. దీంతో తన మాజీ ప్రియుడి కోసం పూజలు చే సిందనే వార్త బాలీవుడ్ లో చక్కర్లు కొడుతోంది. కాగా రణబీర్ కపూర్ తో మూడవసారి జతకట్టింది ఈ తమాషా సినిమాలో. లవర్ బోయ్ ఇమేజ్ సొంతం చేసుకున్న రణబీర్ కపూర్, దీపికా పదుకోన్ జంటగా డైరెక్టర్ ఇంతియాజ్ అలీ 'తమాషా' అనే సినిమాను సాజిద్ నడియాడ్ వాలా నిర్మించారు. యే జవానీ హై దీవానీ సినిమాలాగానే తమాషా మూవీ కూడా బంపర్ హిట్ కావాలని కోరుకుంటోందీ ఈ జంట. బాలీవుడ్ తెర మీద బాలీవుడ్ సొట్ట బుగ్గల సుందరి దీపికా పదుకొనే, రణబీర్ కపూర్ మరోసారి జతకట్టడం హాట్ టాపిక్ గా మారింది. మళ్లీ ఈ మాజీ లవర్స్ కలవబోతున్నారంటూ బాలీవుడ్ గుసగుసలాడింది. ఈ నేపథ్యంలో తాజాగా దీపిక వ్యాఖ్యలు మరింత ఆసక్తికరంగా మారాయి. అటు ఈ మూవీలో ఈ జంట ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ఇప్పటికే టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. -
నటనకి కత్రినా పుల్‌స్టాప్ పెట్టబోతుందా?
-
నస పెట్టే ప్రేమ ఇది!
ఎన్ని రకాల కథనాలు వచ్చినా... ప్రేమకథలకు ఉన్న ఆదరణే వేరు. సున్నితమైన ప్రేమకథలకు ప్రేక్షకులు ఎప్పుడూ పట్టం కడుతూనే ఉంటారు. అందుకే సినిమాలతో పాటు సీరియళ్లలో కూడా ప్రేమ వెల్లువలా పొంగుతూ ఉంటుంది. ప్రియసఖి, మధుబాల, ఏక్ బూంద్ ఇష్క్, ఇస్ ప్యార్‌కో క్యా నామ్దూ, చక్రవాకం... ఇలా ఎన్నో సీరియళ్లు ప్రేమ చుట్టూ తిరిగాయి. ఆ కోవకు చెందినదే... కలర్స్ చానెల్లో ప్రసారమవుతోన్న ‘మేరీ ఆషికీ తుమ్సే’. ఓ అమ్మాయి, ఆమెను ప్రేమించే అబ్బాయి. ఆమె కోటీశ్వరుడి కూతురు. అతడు వాళ్లింట్లో పనివాడు. మూగగా ఆరాధిస్తాడు. ఆమెకి చెప్పలేడు. అంతలో మరో అబ్బాయి ఆమెకు దగ్గరవుతాడు. దాంతో ఇతగాడు కుమిలిపోతుంటాడు. ఈ సీరియల్ చూస్తే బోలెడు పాత సినిమాలు పోటీపడి మరీ కళ్లముందు కదలాడతాయి. పాత కథకి కొత్త కలర్ ఇద్దామని చేసిన ప్రయత్నం బెడిసి కొట్టింది. బెస్ట్ సీరియల్స్‌ని ఇచ్చే కలర్స్వారు ఈ కథను ఎంపిక చేయడం శోచనీయమే. కాకపోతే ‘రణవీర్’గా శక్తి అరోరా నటన, ‘ఇషానీ’గా రాధికామదన్ల గ్లామర్‌కి మార్కులు వేయవచ్చు. అంతేతప్ప ఆ నసపెట్టే ప్రేమను భరించడం అంత తేలిక కాదు! -
గీసుకొండ సీఐ రణబీర్ కన్నుమూత
వరంగల్: అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నగీసుకొండ సీఐ రణబీర్ శుక్రవారం రాత్రి కన్నుమూశారు. సీఐ రణబీర్ 1991 బ్యాచ్‌కు చెందిన పోలీస్ అధికారి. రణబీర్ స్వగ్రామం వరంగల్ జిల్లా పలివేంట్ల. రణబీర్ మాజీ జాతీయ కబడ్డి క్రీడాకారుడుగా పలు పతకాలు అందుకున్నారు. రణబీర్ మృతికి జిల్లా ప్రముఖులు ప్రగాఢ సంతాపం తెలిపారు. గత కొద్దికాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నట్టు పోలీసులు తెలిపారు. -
ప్లీజ్... ఆ ఫొటోలు మాత్రం వద్దు!
తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయమైనా సరే... ఒకప్పుడు ధైర్యంగా బయటకు చెప్పేసేవారు దీపిక. అప్పుడెప్పుడో ఓ సారి ఆమె పాల్గొన్న ఓ టీవీషోలో దీపిక మెడపై ఉన్న గాట్లను సదరు కార్యక్రమ వ్యాఖ్యాత గమనించి, మెడపై ఆ గాట్లేంటి? అనడిగితే -‘‘రణబీర్ ప్రేమగాట్లు’’ అని ధైర్యంగా చెప్పి అక్కడున్నవాళ్లందరూ ఆశ్చర్యపోయేలా చేసింది దీపిక. అలాంటి దీపిక మైండ్‌సెట్‌లో ఇప్పుడు అనూహ్యమైన మార్పు. ఇటీవల ఐఫా అవార్డుల్లో పాల్గొని వెళుతున్న దీపిక ఎయిర్‌పోర్ట్‌లో కనిపించడంతో... ఓ స్టిల్ ఫొటోగ్రాఫర్ ఆమెను క్లిక్ మనిపించాడు. అంతే... ‘నా ఫొటోలు డిలీట్ చేయ్..’ అంటూ అతని వెంట పడింది దీపిక. ‘నీకు కావాల్సినంత డబ్బు ఇస్తాన’ని ఆఫర్ కూడా చేసిందట. ‘మీ ఫొటోలు ఇప్పటివరకూ నేను చాలా తీశాను. ప్రత్యేకించి ఈ ఫొటోలను ఎందుకు డెలిట్ చేయమంటున్నారో అర్థం కావడం లేదు’ అని వాపోయాడట సదరు ఫొటోగ్రాఫర్. తర్వాత కెమెరాలో స్టిల్స్ ఓపెన్ చేసి చూస్తే... దీపిక మెడపై గోటి గీతలు, పంటిగాట్లు ఉన్నాయట. అవి బయటకు పొక్కుతాయనే దీపిక ఆ ఫొటోలు డిలీట్ చేయమని బతిమాలింది. ఇటీవల ఓ ప్రముఖ పత్రికకు ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూలో... ‘ప్రేమకు దూరంగా ఉండాలనుకుంటున్నాను. ఎవరితోనైనా సరే... ఇక నుంచి స్నేహం వరకే’ అని భారీ స్టేట్మెంట్ ఇచ్చిన దీపిక, ఇలా గోటి గాట్లతో ఓ స్టిల్ ఫొటోగ్రాఫర్‌కి చిక్కడం బాలీవుడ్లో పెద్ద చర్చకే దారితీసింది. -
రీప్ లైఫ్ లోనూ వీడిపోని ప్రేమబంధం
-
నాకన్నా రణబీరే ఫేమస్!
బిగ్ బి అమితాబ్ బచ్చన్‌కి ఉన్న పాపులార్టీ తెలియనిది కాదు. కానీ, తనకన్నా రణబీర్ కపూరే పాపులర్ అని అమితాబ్ బచ్చన్ అనడం విశేషం. ఆయన నటించిన ‘భూత్నాథ్ రిటర్న్స్’ చిత్రం ఏప్రిల్ 11న విడుదల కానుంది. ఈ చిత్రంలో రణబీర్ అతిథి పాత్ర చేశారు. ఇందులో సినిమా హీరోగానే చేశారాయన. దీని గురించి అమితాబ్ బచ్చన్ చెబుతూ - ‘‘ఈ సినిమాలో రణబీర్, నా కాంబినేషన్లో సీన్స్ ఉండవు. కానీ, నేను తనతో సినిమా చేయాలనుకుంటున్నా. ఒకవేళ తను హీరోగా నటించే సినిమాలో చిన్న పాత్ర అయినా సరే చేయాలని ఉంది. ఎందుకంటే, నాకన్నా రణబీర్ పాపులర్. తనలాంటి యువకులతో కలిసి పని చేయడం ద్వారా ఓ కొత్త ఎనర్జీ వస్తుంది. వాళ్ల నుంచి నేర్చుకోవడానికి బోల్డన్ని విషయాలు ఉంటాయి’’ అని చెప్పారు. నాలుగు దశాబ్దాల కెరీర్లో దాదాపు రెండు వందల సినిమాల్లో నటించిన అమితాబ్... రణబీర్లాంటి యువకుల నుంచి నేర్చుకున్నారు.