
విజయం ఒంటరితనాన్ని ఇస్తుంది
దీపికా పడుకొనె ప్రస్తుతం బాలీవుడ్‌లో నం.1 స్థానంలో ఉందనే చెప్పుకోవాలి. ప్రియాంకా చోప్రా, అనుష్కా శర్మ, సోనాక్షి సిన్హా తదితరులు గట్టి పోటీ ఇస్తున్నా దీపికాకు దొరికినన్ని అవకాశాలు మరొకరికి దొరకడం లేదు. తాజాగా రణ్‌బీర్‌తో చేసిన ‘తమాషా’కు మంచి స్పందనే లభిస్తుండటంతో ఆమె మరింత సంతోషంగా ఉంది. కాని విజయం వెంట ఒంటరితనం వస్తుందని కూడా చెబుతోంది. ‘నం.1 స్థానం మీద నాకు నమ్మకం లేదు. ఎందుకంటే ఆ స్థానం తర్వాత పైకి చేరడానికి మరో అంకె లేదు.
నేను ఇంకా చాలా నేర్చుకోవాలి. సాధించాలి. కాని ఇలాంటి స్థితిలో చాలామంది మన చుట్టూ మూగుతుంటారు. ఎవర్ని నమ్మాలో అర్థం కాదు. అంతా క్లోజ్‌గా ఉన్నట్టు కనిపించినా ఒంటరిగా ఉన్నట్టుంటుంది. ఈర్ష్య, అసూయలతో చాలామంది దూరం అయిపోతారు. నా అదృష్టం ఏమిటంటే చిన్నప్పటి ఫ్రెండ్స్ కొంతమంది విడవకుండా కొనసాగుతున్నారు. వాళ్ల వల్లే నేను విజయాల తాలూకు ఒంటరితనాన్ని దాటేస్తున్నాను అంటుందామె.
బాలీవుడ్ బాత్