నస పెట్టే ప్రేమ ఇది! | love stories make noise to involve in every human life | Sakshi
Sakshi News home page

నస పెట్టే ప్రేమ ఇది!

Published Sun, Aug 17 2014 1:00 AM | Last Updated on Sat, Sep 2 2017 11:58 AM

నస పెట్టే ప్రేమ ఇది!

నస పెట్టే ప్రేమ ఇది!

ఎన్ని రకాల కథనాలు వచ్చినా... ప్రేమకథలకు ఉన్న ఆదరణే వేరు. సున్నితమైన ప్రేమకథలకు ప్రేక్షకులు ఎప్పుడూ పట్టం కడుతూనే ఉంటారు. అందుకే సినిమాలతో పాటు సీరియళ్లలో కూడా ప్రేమ వెల్లువలా పొంగుతూ ఉంటుంది. ప్రియసఖి, మధుబాల, ఏక్ బూంద్ ఇష్క్, ఇస్ ప్యార్‌కో క్యా నామ్‌దూ, చక్రవాకం... ఇలా ఎన్నో సీరియళ్లు ప్రేమ చుట్టూ తిరిగాయి. ఆ కోవకు చెందినదే... కలర్స్ చానెల్లో ప్రసారమవుతోన్న ‘మేరీ ఆషికీ తుమ్‌సే’.
 
 ఓ అమ్మాయి, ఆమెను ప్రేమించే అబ్బాయి. ఆమె కోటీశ్వరుడి కూతురు. అతడు వాళ్లింట్లో పనివాడు. మూగగా ఆరాధిస్తాడు. ఆమెకి చెప్పలేడు. అంతలో మరో అబ్బాయి ఆమెకు దగ్గరవుతాడు. దాంతో ఇతగాడు కుమిలిపోతుంటాడు. ఈ సీరియల్ చూస్తే బోలెడు పాత సినిమాలు పోటీపడి మరీ కళ్లముందు కదలాడతాయి. పాత కథకి కొత్త కలర్ ఇద్దామని చేసిన ప్రయత్నం బెడిసి కొట్టింది. బెస్ట్ సీరియల్స్‌ని ఇచ్చే కలర్స్‌వారు ఈ కథను ఎంపిక చేయడం శోచనీయమే.  కాకపోతే ‘రణవీర్’గా శక్తి అరోరా నటన, ‘ఇషానీ’గా రాధికామదన్‌ల గ్లామర్‌కి మార్కులు వేయవచ్చు. అంతేతప్ప ఆ నసపెట్టే ప్రేమను భరించడం అంత తేలిక కాదు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement