Best serials
-
సాక్షి ఎక్స్‌లెన్స్ అవార్డ్స్ 2016 పార్ట్ 2
-
మీ ఓటు.. మీ తీర్పు...
సాక్షి ఎక్స్‌లెన్స్ అవార్డ్స్ 2014 మీరు నచ్చిన సినిమా, మెచ్చిన నటీనటులు, డెరైక్టర్, సింగర్స్‌ను మీరే ఎంపిక చేసే అవకాశం వచ్చేసింది. సాక్షి ఎక్స్‌లెన్స్ అవార్డ్స్-2014కు మీరే న్యాయ నిర్ణేతలుగా మారండి. ఓటు వేయండి.. విజేతను ఎంపిక చే యండి. సినీమాల సంబంధించినవే కాదు.. బుల్లితెరపై మీ మనసు దోచుకున్న ఉత్తమ సీరియల్ ఏంటో కూడా మీరు ఓటేసి పట్టం కట్టే అవకాశం ఇస్తోంది సాక్షి. మోస్ట్‌పాపులర్ స్పోర్ట్స్ పర్సనాలిటీ ఎవరనేది కూడా డిసైడ్ చేయండి. లాట్ మొబైల్స్ సమర్పణలో, భారతి సిమెంట్ సౌజన్యంతో సాక్షి ఈ అవార్డుల వేడుకను నిర్వహిస్తోంది. యంగ్ అచీవర్స్ అవార్డ్స్ వీఐటీ యూనివర్సిటీ అందజేస్తోంది. ఎక్స్‌లెన్స్ అవార్డ్స్ ప్రకటనకు స్పందించి వచ్చిన నామినేషన్లంటినీ పరిశీలించిన అనంతరం.. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతో కూడిన జ్యూరీ ప్యానల్ ఎంపిక చేసిన వాటిని మీ ముందుంచుతున్నాం. మీ ఓటు.. మీ తీర్పుతో ఈ అవార్డుల పండుగను విజయవంతం చేయండి. ఏప్రిల్ 24 నుంచి ప్రారంభమైన ఓటింగ్ లైన్స్ మే 8వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయి. ఎంట్రీల వివరాలు.. మూవీ ఆఫ్ ద ఇయర్.. A మనం B దృశ్యం C రేసుగుర్రం D లెజెండ్ మీ ఎంపికను తెలియజేసేందుకుMOV (మీ ఎంపిక)SPOఅని టైప్ చేసి 5499966కి sms చేయండి మోస్ట్ పాపులర్ యాక్టర్ (మేల్) A మహేష్‌బాబు (1- నేనొక్కడినే) B వెంకటేష్ (దృశ్యం) C నాగార్జున (మనం) D అల్లు అర్జున్ (రేసు గుర్రం) మీ ఎంపికను తెలియజేసేందుకుMAL (మీ ఎంపిక)SPOఅని టైప్ చేసి 5499966కి sms చేయండి మోస్ట్ పాపులర్ యాక్టర్ (ఫిమేల్) A సమంత (మనం) B శృతి హాసన్ (రేసు గుర్రం) C కృతి సనన్ (1- నేనొక్కడినే) D నయనతార (అనామిక) మీ ఎంపికను తెలియజేసేందుకు FEM(మీ ఎంపిక)SPOఅని టైప్ చేసి 5499966కి sms చేయండి మోస్ట్ పాపులర్ డెరైక్టర్ A విక్రమ్ కుమార్ (మనం) B సురేందర్ రెడ్డి (రేసు గుర్రం) C అవసరాల శ్రీనివాస్ (ఊహలు గుసగుసలాడే) D సుకుమార్ (1-నేనొక్కడినే) మీ ఎంపికను తెలియజేసేందుకుDIR(మీ ఎంపిక)SPOఅని టైప్ చేసి 5499966కి smsచేయండి మోస్ట్‌పాపులర్ సింగర్ (మేల్) A మాస్టర్ భరత్- కని పెంచిన మా అమ్మకే (మనం) B హరిహరన్- నీలిరంగు చీరలోన (గోవిందుడు అందరివాడేలే) C కళ్యాణి కోడూరి-ఏం సందేహం లేదు (ఊహలు గుసగుసలాడే) D రవితేజ- నోటంకి నోటంకి (పవర్) మీ ఎంపికను తెలియజేసేందుకుSIM (మీ ఎంపిక)SPO అని టైప్ చేసి 5499966కి sms చేయండి మోస్ట్ పాపులర్ సింగర్ (ఫిమేల్) A {శేయా ఘోషల్- చిన్ని చిన్ని ఆశలు (మనం) B {శేయా ఘోషల్- నీ జతగా నేనుండాలి (ఎవడు) C సునీత ఉపద్రష్ట- ఏం సందేహం లేదు (ఊహలు గుసగుసలాడే) D రమ్య బెహర- సూడు సూడు (లౌక్యం) మీ ఎంపికను తెలియజేసేందుకు SIF (మీ ఎంపిక)SPO అని టైప్ చేసి 5499966కిsms చేయండి మోస్ట్ పాపులర్ సీరియల్ A రాములమ్మ - మా టీవీ B మంగమ్మగారి మనవరాలు- జీ తెలుగు C కొంచెం ఇష్టం కొంచెం కష్టం- జీ తెలుగు D {శావణ సమీరాలు- జెమిని టీవీ మీ ఎంపికను తెలియజేసేందుకు (మీ ఎంపిక)SPOఅని టైప్ చేసి 5499966కి sms చేయండి మోస్ట్ పాపులర్ స్పోర్ట్స్ పర్సనాలిటి A సానియా మిర్జా - టెన్నిస్ B కిడంబి శ్రీకాంత్ - బ్యాడ్మింటన్ C సైనా నెహ్వాల్ - బ్యాడ్మింటన్ D సాకేత్ మైనేని - టెన్నిస్ మీ ఎంపికను తెలియజేసేందుకు (మీ ఎంపిక)SPOఅని టైప్ చేసి 5499966కి sms చేయండి. ఆన్లైన్ ఓటింగ్ కోసం http://www.sakshiexcellenceawards. com/popularawards/ చూడండి. -
నస పెట్టే ప్రేమ ఇది!
ఎన్ని రకాల కథనాలు వచ్చినా... ప్రేమకథలకు ఉన్న ఆదరణే వేరు. సున్నితమైన ప్రేమకథలకు ప్రేక్షకులు ఎప్పుడూ పట్టం కడుతూనే ఉంటారు. అందుకే సినిమాలతో పాటు సీరియళ్లలో కూడా ప్రేమ వెల్లువలా పొంగుతూ ఉంటుంది. ప్రియసఖి, మధుబాల, ఏక్ బూంద్ ఇష్క్, ఇస్ ప్యార్‌కో క్యా నామ్దూ, చక్రవాకం... ఇలా ఎన్నో సీరియళ్లు ప్రేమ చుట్టూ తిరిగాయి. ఆ కోవకు చెందినదే... కలర్స్ చానెల్లో ప్రసారమవుతోన్న ‘మేరీ ఆషికీ తుమ్సే’. ఓ అమ్మాయి, ఆమెను ప్రేమించే అబ్బాయి. ఆమె కోటీశ్వరుడి కూతురు. అతడు వాళ్లింట్లో పనివాడు. మూగగా ఆరాధిస్తాడు. ఆమెకి చెప్పలేడు. అంతలో మరో అబ్బాయి ఆమెకు దగ్గరవుతాడు. దాంతో ఇతగాడు కుమిలిపోతుంటాడు. ఈ సీరియల్ చూస్తే బోలెడు పాత సినిమాలు పోటీపడి మరీ కళ్లముందు కదలాడతాయి. పాత కథకి కొత్త కలర్ ఇద్దామని చేసిన ప్రయత్నం బెడిసి కొట్టింది. బెస్ట్ సీరియల్స్‌ని ఇచ్చే కలర్స్వారు ఈ కథను ఎంపిక చేయడం శోచనీయమే. కాకపోతే ‘రణవీర్’గా శక్తి అరోరా నటన, ‘ఇషానీ’గా రాధికామదన్ల గ్లామర్‌కి మార్కులు వేయవచ్చు. అంతేతప్ప ఆ నసపెట్టే ప్రేమను భరించడం అంత తేలిక కాదు!