
నాకన్నా రణబీరే ఫేమస్!
బిగ్ బి అమితాబ్ బచ్చన్‌కి ఉన్న పాపులార్టీ తెలియనిది కాదు. కానీ, తనకన్నా రణబీర్ కపూరే పాపులర్ అని అమితాబ్ బచ్చన్ అనడం విశేషం. ఆయన నటించిన ‘భూత్‌నాథ్ రిటర్న్స్’ చిత్రం ఏప్రిల్ 11న విడుదల కానుంది.
ఈ చిత్రంలో రణబీర్ అతిథి పాత్ర చేశారు. ఇందులో సినిమా హీరోగానే చేశారాయన. దీని గురించి అమితాబ్ బచ్చన్ చెబుతూ - ‘‘ఈ సినిమాలో రణబీర్, నా కాంబినేషన్‌లో సీన్స్ ఉండవు. కానీ, నేను తనతో సినిమా చేయాలనుకుంటున్నా. ఒకవేళ తను హీరోగా నటించే సినిమాలో చిన్న పాత్ర అయినా సరే చేయాలని ఉంది. ఎందుకంటే, నాకన్నా రణబీర్ పాపులర్.
తనలాంటి యువకులతో కలిసి పని చేయడం ద్వారా ఓ కొత్త ఎనర్జీ వస్తుంది. వాళ్ల నుంచి నేర్చుకోవడానికి బోల్డన్ని విషయాలు ఉంటాయి’’ అని చెప్పారు. నాలుగు దశాబ్దాల కెరీర్‌లో దాదాపు రెండు వందల సినిమాల్లో నటించిన అమితాబ్... రణబీర్‌లాంటి యువకుల నుంచి నేర్చుకున్నారు.