రాష్ట్రపతి భవన్ లో భూతం!
న్యూఢిల్లీ: రాష్ట్రపతి భవనంలో భూతం వార్త నిజమే అనుకుంటే పొరపాటే.. ఇటీవల అమితాబ్ బచ్చన్ నటించిన భూత్ నాథ్ రిటర్న్స్ అనే చిత్రాన్ని రాష్ట్రపతి భవన్ లో ప్రణబ్ ముఖర్జీకి చూపించారు. ఓటు ప్రాముఖ్యతను చెప్పే చిత్రంగా భూత్ నాథ్ రిటర్న్ చిత్రం రూపొందింది. ఈ చిత్ర పదర్శన ముగిసిన తర్వాత అమితాబ్, దర్శకుడు నితీష్ తివారీ, నిర్మాతలను ప్రణబ్ సత్కరించారు.
భూత్ నాథ్ రిటర్న్ చిత్రంపై ప్రణబ్ ప్రశంసల వర్షం కురిపించారు. ఈ చిత్రాన్ని ప్రణబ్ ముఖర్జీ చూస్తారని తాము అనుకోలేరని అమితాబ్ అన్నారు. ప్రస్తుత వ్యవస్థలో ఓటు ప్రాధాన్యత గురించి వివరించిన తీరు ప్రణబ్ అకట్టుకుందని అమితాబ్ తెలిపారు. ఏప్రిల్ 11 తేదిన విడుదలైన భూత్ నాథ్ రిటర్న్స్ చిత్రంలో అమితాబ్ భూతంగా నటించారు.