అమితాబ్ '102 నాట్ అవుట్'!
బాలీవుడ్ మెగాస్తార్ అమితాబ్ బచ్చన్ కు '102 నాట్ అవుట్' సంబంధమేమిటనుకుంటున్నారా?. అక్టోబర్ 11న 71 జన్మదినం జరుపుకున్న అమితాబ్ ఓ తాజా చిత్రంలో నటించనున్నారు. ఆ చిత్రం పేరే '102 నాట్ అవుట్'!. ఈ చిత్రంలో ప్రపంచ రికార్డును సాధించే వృద్ధుడిగా అమితాబ్ నటించనున్నారని నిర్మాత భూషణ్ కుమార్ తెలిపారు.
గతంలో అమితాబ్ తో భూత్ నాథ్ రిటర్న్ అనే చిత్రాన్ని భూషణ్ కుమార్ నిర్మించారు. అమితాబ్ జన్మదినోత్సవం రోజున 102 నాటౌట్ అనే చిత్రాన్ని నిర్మిస్తున్నామని ప్రకటించడం సరైన సమయం అని భావిస్తున్నానని భూషణ్ తెలిపారు. ఈ చిత్రంలో అమితాబ్ తోపాటు పరేశ్ రావల్ కూడా నటిస్తున్నారు. విమర్శకుల ప్రశంసలందుకున్న 'ఓ మై గాడ్' చిత్రానికి దర్శకత్వం వహించిన ఉమేశ్ శుక్లా ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు.
For the latest stories, you can like Sakshi News on Facebook and also follow us on Twitter. Get the Sakshi News app for Android or iOS