సల్మాన్ ఖాన్.. బాలీవుడ్ స్టార్ హీరోల జాబితాలో ముందు వరుసలో ఉంటాడీ భాయ్‌జాన్. ఎన్నో హిట్ సినిమాలతో ప్రేక్షకులను అలరించిన ఆయనకు ఒకానొక సమయంలో చేతిలో ఒక్క ప్రాజెక్ట్ కూడా లేకుండా పోయిందట. అబుదాబిలో జరిగిన ఐఫా (ఇండియన్ ఫిలిం అకాడమీ అవార్డ్స్) వేడుకలో ఈ విషయాన్ని గుర్తు చేసుకుని కంటతడి పెట్టుకున్నాడు సల్మాన్.
'1989లో మైనే ప్యార్ కియా(సల్మాన్ నటించిన తొలి చిత్రం) రిలీజైంది. ఈ సినిమా తర్వాత భాగ్యశ్రీ ఇండస్ట్రీకి గుడ్‌బై చెప్పి పెళ్లి చేసుకుని సెటిలైపోదామని ఫిక్సైంది. దీంతో ఆ సినిమా క్రెడిట్ అంతా భాగ్యశ్రీ ఖాతాలో పడింది. ఈ మూవీ రిలీజయ్యాక ఆరు నెలలపాటు నాకు ఒక్క ప్రాజెక్ట్ కూడా రాలేదు. అప్పుడే రమేశ్ తౌరానీ ఒక దేవుడిలా నా జీవితంలో అడుగుపెట్టాడు. మా నాన్న రెండు వేల రూపాయలిచ్చి అతడితో సినిమా తీస్తున్నట్లు నిర్మాత జీపీ సిప్పీతో పత్రికలో ఒక ఫేక్ ప్రకటన వేయించాడు.
నిజంగా సినిమా తీశామా? అంటే లేదు. ఆ తర్వాత రమేశ్ ఒకసారి సిప్పీ ఆఫీస్‌కు వెళ్లి కొత్త సినిమా మ్యూజిక్ కోసం రూ.5 లక్షలిచ్చాడు. అలా నాకు పత్తర్ కె ఫూల్(1991) సినిమా ఛాన్స్ వచ్చింది. వాంటెడ్ వంటి బ్లాక్‌బస్టర్ సినిమాలిచ్చి బోనీకపూర్ కూడా నాకెంతో సాయం చేశాడు. ఇదిలా ఉంటే ఓసారి షాప్‌లో నేను కొత్త చొక్కాలవైపు అలానే చూస్తున్నాను. వాటిని కొనేందుకు నాదగ్గర పెద్దగా డబ్బుల్లేవు. అప్పుడు సునీల్ శెట్టి నన్ను చూసి నాకు షర్ట్, వాలెట్ బహుమతిగా ఇచ్చాడు' అని చెప్తూ ఎమోషనలయ్యాడు సల్మాన్.
చదవండి: నిజంగానే ఆరోజు తమన్నాతో గొడవపడ్డా.. ఎఫ్ 3 డైరెక్టర్
రికార్డులు బద్ధలు కొడుతున్న విక్రమ్, ఇప్పటిదాకా ఎంత వచ్చిందంటే?
Comments
Please login to add a commentAdd a comment