
టాలీవుడ్ హీరో రానా ఇటీవలే కొత్త మూవీని ప్రకటించారు. దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటిస్తోన్న చిత్రంలో కనిపించనున్నారు. ఈ మూవీకి సంబంధించిన పూజా కార్యక్రమానికి రానా కూడా హాజరయ్యారు. అయితే తాజాగా ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డ్స్-2024 ప్రెస్ మీట్‌లో రానా పాల్గొన్నారు.
ముంబయిలో జరిగిన ఈవెంట్‌లో పాల్గొన్న రానా వేదికపై సందడి చేశారు. అక్కడే ఉన్న బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్, షారూఖ్ ఖాన్ పాదాలకు నమస్కరించారు. నేను పూర్తిగా సౌత్ ఇండియన్.. అందుకే ఇలా అంటూ రానా మాట్లాడారు. దీంతో కరణ్, షారూఖ్ ఖాన్ దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా.. ఈ కార్యక్రమంలో సిద్ధాంత్ చతుర్వేది, అభిషేక్ బెనర్జీ తదితరులు పాల్గొన్నారు.
(ఇది చదవండి: క్రేజీ ఛాన్స్ కొట్టేసిన మిస్టర్ బచ్చన్ భామ.. ఆ హీరోతో మూవీ!)
దుబాయ్‌లోని షారూఖ్ ఇంటికి వెళ్లనప్పుడు తమను అప్యాయంగా చూసుకున్నారని ఈ సందర్భంగా రానా గుర్తు చేసుకున్నారు. దుబాయ్‌లో జరిగిన ఓ ఈవెంట్‌కు సౌత్‌కు చెందిన సెలబ్రీటీలంతా వచ్చాం.. ఆ సమయంలో షారూఖ్ ఇంటికి వెళ్లగా.. అందరినీ బాగా చూసుకున్నారని తెలిపారు. షారూఖ్ కేవలం నటుడు మాత్రమే.. మానవతావాది కూడా అని రానా కొనియాడారు. కాగా.. ఐఐఎఫ్‌ఏ అవార్డ్స్ 2024 ఈవెంట్ సెప్టెంబర్ 27,28, 29 తేదీల్లో అబుదాబిలోని ఓ ఐలాండ్‌లో జరుగనుంది. ఇందులో షాహిద్ కపూర్, విక్కీ కౌశల్, జాన్వీ కపూర్, కృతి సనన్ లాంటి స్టార్స్ ప్రత్యేక ప్రదర్శనలు ఉంటాయని షారూక్ వెల్లడించారు.
We're fully South Indian so.. this is how we do.. 🥺🥹 Rana pic.twitter.com/NumYzPpCEc
— . (@charanvicky_) September 11, 2024