క్రేజీ ఛాన్స్ కొట్టేసిన మిస్టర్‌ బచ్చన్ భామ.. ఆ హీరోతో మూవీ! | Mister Bachan Actress Bhagyashri Borse Get Crazy Chance | Sakshi
Sakshi News home page

Bhagyashri Borse: మిస్టర్ బచ్చన్‌తో ఎంట్రీ.. మరో ఛాన్స్‌ కొట్టేసిన భాగ్యశ్రీ..!

Sep 9 2024 4:06 PM | Updated on Sep 9 2024 4:19 PM

Mister Bachan Actress  Bhagyashri Borse Get Crazy Chance

రవితేజ సరసన మిస్టర్‌ బచ్చన్‌ చిత్రంలో మెప్పించిన ముంబయి భామ  భాగ్యశ్రీ బోర్సే. ఈ మూవీతో తన గ్లామర్‌తో తెలుగు అభిమానులను కట్టిపడేసింది. సితార్ సాంగ్‌లో తన అందచందాలతో ముగ్ధుల్ని చేసింది. మిస్టర్ బచ్చన్‌తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన భామ.. మరో లక్కీ ఛాన్స్ కొట్టేసింది.

సీతారామం హీరో దుల్కర్ సల్మాన్ సరసన భాగ్యశ్రీ బోర్సే నటించనుంది. సెల్వమణి సెల్వరాజ్‌ డైరెక్షన్‌లో వస్తోన్న కాంత మూవీలో ఛాన్స్ కొట్టేసింది ముద్దుగుమ్మ. ఇటీవలే దుల్కర్‌ పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. తాజాగా ఈ మూవీ పూజా కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియో జరిగిన ఈ మూవీకి టాలీవుడ్ హీరో వెంకటేశ్ క్లాప్ కొట్టారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

కాగా.. 1950లో మద్రాసు నేపథ్యంలో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో టాలీవుడ్ హీరో రానా, సముద్రఖని కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాను వేఫేరర్ ఫిల్మ్స్‌, స్పిరిట్ మీడియా బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement