'ఫెయిల్యూర్ అంటే చాలా భయం'
అపజయాలంటే (ఫెయిల్యూర్) తనకు చెప్పలేనంత భయమని బాలీవుడ్ తార ప్రియాంక చోప్రా అన్నారు. ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ(ఐఐఎఫ్ఏ) అవార్టుల కార్యక్రమంలో భాగంగా హాలీవుడ్ నటుడు కెవిన్ స్పేసీతో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్నారు.
ఫెయిల్యూర్స్ అంటే భయం. ఫెయిల్యూర్స్ నన్ను నడిపిస్తాయి. ఒకవేళ తాను నటించిన సినిమా పరాజయం పొందితే బాధపడటమే కాకుండా రెండు వారాలపాటు ఇంట్లోనుంచి బయటకు రాను అని ప్రియాంక వెల్లడించారు.
బర్ఫీ చిత్రంలో నటించేముందు హీరోయిన్ ఇమేజ్ సరిపడని క్యారెక్టర్ అని తనను చాలా మంది బెదిరించారని.. అయితే ఎంతమంది హెచ్చరించినా.. బర్ఫీలో నటించానని.. బర్శీ తనకు సంతృప్తిని ఇచ్చిందన్నారు.