
సూపర్ స్టార్ మహేశ్ బాబు వయసు పెరుగుతున్న కొద్దీ మరింత యంగ్‌గా మారిపోతున్నారు. స్టైలిష్ లుక్స్‌తో మెస్మరైజ్ చేస్తున్నారు. తాజాగా మరో కూల్‌లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు మహేశ్. ప్రస్తుతం సూపర్ స్టార్ త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్‌లో SSMB 28 మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం ఎన్నడూ కనిపించని విధంగా డిఫరెంట్ లుక్‌లో కనిపించనున్నారట.
ఇప్పటికే 6ప్యాక్ బాడీతో మేకోవర్‌పై ప్రత్యేక దృష్టి పెట్టిన మహేశ్ లేటెస్ట్‌గా ట్రెండీ లుక్‌లో కనిపించారు. దీనికి సంబంధించిన ఫోటోను తన ఇన్‌స్టా వేదికగా పంచుకోగా ప్రస్తుతం ఆ పిక్ నెట్టింట వైరల్‌గా మారింది. కాగా ఇప్పటికే SSMB28 రెండు షెడ్యూల్స్ పూర్తయ్యాయి. ఈ మూవీ ఫస్ట్ గ్లింప్స్‌ను ఈనెల 31న రిలీజ్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment