మళ్లీ స్టైలిష్ లుక్‌తో అజిత్ | Ajit stylish look again | Sakshi
Sakshi News home page

మళ్లీ స్టైలిష్ లుక్‌తో అజిత్

Published Sat, Apr 5 2014 12:03 AM | Last Updated on Sat, Sep 2 2017 5:35 AM

మళ్లీ స్టైలిష్ లుక్‌తో అజిత్

మళ్లీ స్టైలిష్ లుక్‌తో అజిత్

అజిత్ మంచి అందగాడు. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. ఇంతకుముందు ఈయన నటించిన కాదల్ మన్నన్, ఆశై, ముఖవరి చిత్రాలు యువతను అలరించాయి. ముఖ్యంగా మహిళాభిమానుల్ని పెంచాయి. ఆ తర్వాత అజిత్ యాంగ్రీయంగ్‌మెన్‌గా అవతారం ఎత్తారు. ఫైట్స్, పంచ్ డైలాగ్స్ అంటూ యాక్షన్‌లో దుమ్ము రేపారు. ఇటీవల సహజత్వానికి ప్రాధాన్యం ఇస్తూ వచ్చారు. తన వయసుకు తగ్గ పాత్రలు ఎంపిక చేసుకుని నటించారు. మంగాత్త, ఆరంభం, వీరం వంటి చిత్రాల్లో చాలా రఫ్‌గా కనిపించారు.

ఈ చిత్రాలు విశేష ప్రజాదరణను చూరగొన్నాయి. ఇలా కాలానుగుణంగా తనను మార్చుకుంటూ తనదైన శైలిలో నటిస్తున్న అజిత్ తాజాగా స్టైలిష్ లుక్‌తో తెరపైకి రానున్నారు. ఆరంభం వంటి ఘన విజయం సాధించిన చిత్రాన్ని నిర్మించిన ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం అజిత్‌తో మరో భారీ చిత్రాన్ని నిర్మించడానికి సిద్ధమయ్యారు. గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రంలో అజిత్ గత చిత్రాలకు భిన్నంగా స్టైలిష్ పాత్రలో నటించడానికి రెడీ అవుతున్నారు. ఇందులో ఆయన సరసన అందాల భామ అనుష్క హీరోయిన్‌గా నటించనున్నారు. ముఖ్య పాత్రలో అరవిందస్వామి నటించనున్నారు. ఈ చిత్రం ఈ నెల 9న ప్రారంభం కానుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement