పాన్ ఇండియ స్టార్, డార్లింగ్ ప్రభాస్ ట్రోలర్స్‌కు షాకిచ్చాడు. ‘సాహో’ మూవీ తర్వాత నుంచి ఆయన లుక్‌పై విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ప్రభాస్ లుక్ ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారింది. ఆయన ఫిట్‌నెస్‌పై ఎప్పుడు దృష్టి పెడతాడా? మళ్లీ ఎప్పుడు సన్నబడతాడా? అని ఆయన ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఆయన కొత్త లుక్ ఒకటి బయటకు వచ్చింది. ఇందులో ప్రభాస్ సన్నగా.. మిర్చి లుక్‌లో దర్శనం ఇచ్చాడు.
మునుపటి వరకు బోద్దుగా ఉన్న ప్రభాస్ ఒక్కసారిగా స్టైలిష్‌గా కనిపించి అందరిని ఆశ్చర్యపరిచాడు. దీంతో ప్రభాస్‌ను ట్రోల్ చేసిన వారిని టార్గెట్ చేస్తూ నెటిజన్లు, ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కింగ్ ట్రాన్స్‌ఫర్మేషన్ అంటూ తమ అభిమాన హీరోని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. కాగా ప్రభాస్ తాజాగా ఆది పురుష్ డైరెక్టర్ ఓం రౌత్‌ను ముంబైలోని ఆయన నివాసంలో కలిశాడు. ప్రభాస్‌తో పాటు ఆది పురుష్ ‘రావణుడు’ సైఫ్ అలీఖాన్ సైతం కనిపించాడు. ఓం రౌత్‌తో ముచ్చటించిన అనంతరం ఇంటి నుంచి బయటకు వచ్చిన ప్రభాస్ లుక్‌ను చూసి అందరూ షాకయ్యారు.
ఇక ఆయనను చూడగానే మీడియా వ్యక్తుల ప్రభాస్‌ను తమ కెమెరాల్లో బంధించారు. దీంతో ప్రభాస్ నయా లుక్ నెట్టింట వైరల్‌గా మారింది. చాలా కాలం తర్వాత తమ ‘డార్లింగ్’ను ఇలా చూసి ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. అంతేకాదు ప్రభాస్ కొత్త లుక్‌కు సంబంధించిన ఫొటోలను వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలో షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. కాగా ప్రస్తుతం ప్రభాస్ ‘సలార్’, ‘ప్రాజెక్ట్ కె’ చిత్రాల షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే ఆది పురుష్ షూటింగ్‌ను పూర్తి చేసుకోగా ప్రస్తుతం పొస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. వచ్చే ఏడాది ఈ మూవీ సంక్రాంతికి విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment