![alia bhatt new fashion dress](/styles/webp/s3/article_images/2017/10/13/alia.jpg.webp?itok=ATatMqTe)
సిలాయీ అంటే హిందీలో.. ‘కుట్టు పని’. ఆలియా భట్‌కి ఏ బట్టలు తొడిగినా.. కుట్టినట్టు ఉంటాయి. అమె కోసమే పుట్టినట్టు ఉంటాయి. బట్టలు పుట్టడం ఏంటి?! పోనీ.. ప్రాణం పోసుకుంటాయి అందాం! ఆలియా వేసుకుంటే.. ఆలిండియా మురిసిపోదా? ఆమె బట్టలు మెరిసిపోవా?
►ఆరెంజ్ ప్లెయిన్ ఫ్యాబ్రిక్ లెహంగా మీద, నెటెడ్ దుపట్టా అంచులకు ఎంబ్రాయిడరీ చేశారు. లెహంగా హెవీగా ఉండటం వల్ల లాంగ్ స్లీవ్స్ ప్లెయిన్ బ్లౌజ్ వేసుకుంటే గ్రాండ్ లుక్
వస్తుంది.
►లోపల సింగిల్ పీస్ షార్ట్ గౌన్.. పైన ఓవర్ కోట్ ధరిస్తే చాలు స్టైలిష్ లుక్ వస్తుంది. ఇది పూర్తి వెస్ట్రన్ డ్రెస్సింగ్. అయితే మన ట్రెడిషనల్ లుక్ రావడం కోసం రాజస్థానీ పెయింటింగ్స్‌ని ప్రింట్‌గా ఉపయోగించారు. దీంతో ఇండో–వెస్ట్రన్ లుక్ వచ్చేసింది.
►చందేరీ ఫ్యాబ్రిక్ మీద బెనారస్ వీవ్ చేశారు. యంగ్, టీనేజ్‌లో ఉన్నవారు ఇలాంటి లేత రంగులు కట్టుకుంటే ఇంకా చిన్నపిల్లల్లా క్యూట్‌గా కనిపిస్తారు. ఆలియాభట్ పర్సనాలిటీ చిన్నగా ఉంటుంది. ఇలాంటి పర్సనాలిటీ ఉన్నవారికి ఈ తరహా చీరలు సరైన ఎంపిక.
►తెల్లని టాప్ అదే రంగు ధోతీ ప్యాంట్‌తో ఈ స్టైల్ తెప్పించవచ్చు. ఇది పూర్తిగా సిల్క్ ఫ్యాబ్రిక్. టాప్ ముందువైపు పొట్టిగా, వెనుక వైపు పొడవుగా ఉండేలా అన్ ఈవెన్ కట్‌తో డిజైన్ చేశారు. టాప్‌కి సిల్వర్ వర్క్ చేయడంతో క్లాస్ లుక్ వచ్చింది. నైట్ పార్టీలకు ఈ డ్రెస్ సరైన ఆప్షన్.
►పాత కాలంలోలా ప్లీటెడ్ స్కర్ట్.. దీని మీదకు వి నెక్ టీ షర్ట్ ధరిస్తే క్యాజువల్ లుక్ వచ్చేస్తుంది. డే టైమ్‌లో ఎక్కడికైనా వెళ్లాలనుకున్నప్పుడు ఇలాంటి డ్రెస్ బాగుంటుంది.
► సాధారణంగా మనం ఏ పార్టీకి వెళ్లాలన్నా, ఏ సందర్భానికైనా ఆభరణాలను ఎక్కువ వేసుకోవాలని చూస్తాం. దీంతో స్టైలిష్ లుక్ రాదు. సెలబ్రిటీలను, టాప్ హీరోయిన్స్‌ని గమనిస్తే డ్రెస్ ప్రత్యేకంగా ఉన్నప్పుడు ఆభరణాలను చాలా తక్కువగా ధరించడం చూస్తుంటాం. ఒక స్టైలిష్ లుక్ క్రియేట్ చేయాలంటే మాత్రం ఇలాంటి తారామణుల డ్రెస్సింగ్‌ని గమనించవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment