జీన్స్... లుక్ మార్చేద్దాం
న్యూలుక్
సౌకర్యంతో పాటు స్టైలిష్ లుక్ తెచ్చే జీన్స్, జెగ్గింగ్స్‌ని నేటి యువత బాగా ఇష్టపడుతుంది. వీటిలో షార్ట్స్, మోకాళ్ల కిందవరకు ఉండే త్రీ బై ఫోర్త్, మడమల దాకా ఉండే ప్యాంట్స్... రకరకాల మోడల్స్ లభిస్తున్నాయి. అయితే, రంగు మాత్రం ఒకే విధంగా ఉంటుంది. ఈ ప్లెయిన్ జీన్స్ లుక్ మార్చేయాలంటే...
►వివిధ రకాల డిజైన్లలో కాటన్ బార్డర్స్ మార్కెట్లో లభిస్తున్నాయి. లేదంటే వాడని చీరలు, దుపట్టాల అంచులను ఈ డిజైన్స్‌కి వాడచ్చు.
ఫొటోలో చూపిన విధంగా జీన్స్ ప్యాంట్ బాటమ్‌కి (రెండు కాళ్లకి) ఈ బార్డర్‌ని జత చేస్తే చాలు.
►ఇందుకు పూర్తి కాంట్రాస్ట్ కలర్ ఉన్న డిజైన్స్ ఎంచుకుంటే బాగుంటుంది.
►ప్యాంట్ కాలుకి ఒక వైపు మాత్రమే ఎంబ్రాయిడరీ వర్క్ చేసిన ప్యాచ్ జత చేసినా సరే లుక్ పూర్తిగా మారిపోతుంది.
►ప్యాంట్ కింది భాగంలో జత చేసిన అంచు భాగానికి దారాలతో అల్లిన కుచ్చులను కూడా కుట్టవచ్చు. ఇది మరో ప్రధాన ఆకర్షణగా మారిపోతుంది.
►అంచుభాగంలో మరో క్లాత్‌కు బదులుగా కాంట్రాస్ట్ రంగులతో ఇలా ఫ్యాబ్రిక్ పెయింట్ వేసినా చూడముచ్చటగానూ, స్టైలిష్‌గా ఉంటుంది.