నటి శోభితా ధూళిపాళ (Sobhita Dhulipala) తన ష్యాషన్ స్టైల్‌తో అందర్నీ మరోసారి మెస్మరైజ్ చేసింది. ఇటీవల అక్కినేని నాగచైతన్యతో వివాహ వేడుకలలో సంప్రదాయ చీరలు, నగలతో అందంగా మురిపించిన శోభిత తాజాగా ఒక జ్యువెల్లరీ యాడ్‌లో మెరిసింది. ఈ సందర్భంగా ఫ్యాషన్ పట్ల తనకున్న అభిరుచిని చెప్పకనే చెప్పింది.
డీప్ గ్రీన్ ఫ్రాక్, డైమండ్ ఆభరణాలతో ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంది. ఫ్యాషన్ అండ్ స్టైల్‌కు పర్యాయపదంగా తన లుక్‌తో అభిమానులను ఫిదా చేసింది. రోహిత్ గాంధీ. రాహుల్ ఖన్నా కలెక్షన్‌లో డీప్ గ్రీన్ డ్రెస్‌ను ఎంచుకుంది. దీనికి సంబంధించిన ఫోటోషూట్ నెట్టింట వైరల్‌గా మారింది. స్క్వేర్ నెక్‌లైన్, షోల్టర్ స్ట్రాప్స్, అలాగే ముందు భాగంలో, వీ ఆకారంలో డీప్ నెక్‌లైన్‌కట్ డ్రెస్‌ను ఎంచుకుంది.
ఇక నగల విషయానికి వస్తే మల్టీ-స్ట్రాండ్ చోకర్ నెక్లెస్ , వేలాడే చెవిపోగులు, గాజులు, రింగ్ ధరించింది. డైమండ్ ఆభరణాలు హైలైట్ అయ్యేలా, జుట్టును అందంగా ముడి వేసుకుంది. మరీ ముఖ్యంగా క్యాట్ ఐలైనర్ ఆమె ముఖానికి మరింత అందాన్నిచ్చింది.
కాగా శోభితా ధూళిపాళ టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్య(Naga Chaitanya)ను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. గత ఏడాది డిసెంబర్ 4వ తేదీన వీరిద్దరి వివాహం సాంప్రదాయ పద్దతిలో ఘనంగా జరిగింది. అంతకుముందు సీక్రెట్‌గా ఎంగేజ్‌మెంట్ చేసుకుని అందర్నీఆశ్చర్యపరిచింది. తెలుగు సాంప్రదాయాలు, కట్టుబట్టు ఇష్టం అని చెప్పే శోభిత పసుపు కొట్టింది మొదలు, మూడు ముళ్ల వేడుక దాకా ప్రతి సందర్భంలోనూ తనదైన శైలితో శోభితా ఆకట్టుకుంది.
అంతేకాదు వీరికి పెళ్లి తరువాత వచ్చిన తొలి సంక్రాంతి పండుగను కూడా ఈ జంట ఎంతో ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. దంపతులిద్దరూ ఇద్దరు పట్టు వస్త్రాలు ధరించారు. దీనికి సంబంధించిన ఫోటోలను ఇన్ స్టా స్టోరీలో పోస్టు చేసింది శోభితా . ఈ ఫోటోల్లో రెడ్ కలర్ గోల్డెన్ అంచు శారీలో అందంగా ముస్తాబైంది. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment