స్టైలిష్‌ లుక్‌లో తెలుసు కదా! | siddhu jonnalagadda stylish look for telusu kada | Sakshi
Sakshi News home page

స్టైలిష్‌ లుక్‌లో తెలుసు కదా!

Published Sun, Sep 15 2024 12:41 AM | Last Updated on Sun, Sep 15 2024 12:41 AM

siddhu jonnalagadda stylish look for telusu kada

‘డీజే టిల్లు, ‘టిల్లు స్క్వేర్‌’ వంటి హిట్‌ సినిమాల తర్వాత సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘తెలుసు కదా’. ప్రముఖ స్టైలిస్ట్‌ నీరజ కోన ఈ మూవీతో డైరెక్టర్‌గా పరిచయమవుతున్నారు. రాశీ ఖన్నా, శ్రీనిధీ శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో వైవా హర్ష కీలక పాత్ర పోషిస్తున్నారు. టీజీ విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం ఫస్ట్‌ షెడ్యూల్‌ పూర్తయింది. ‘‘తెలుసు కదా’ చిత్రంలో సరికొత్త స్టైలిష్‌ లుక్‌లో కనిపించనున్నారు సిద్ధు జొన్నలగడ్డ . 

హైదరాబాద్‌లో నెల పాటు జరిగిన మొదటి షెడ్యూల్‌ పూర్తయింది. ఈ షెడ్యూల్‌లో సిద్ధు, రాశీ ఖన్నా, శ్రీనిధి, వైవా హర్షలపై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించాం. అలాగే సిద్ధు, రాశీ ఖన్నాపై ఓ పాట కూడా తెరకెక్కించాం. ఇప్పటికే 50 శాతం షూటింగ్‌ పూర్తయింది. ఈ అవుట్‌పుట్‌తో సంతోషంగా ఉన్నాం’’ అని చిత్రయూనిట్‌ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: తమన్, కెమెరా: జ్ఞానశేఖర్‌ బాబా.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement