Mahesh Babu Latest Pic Goes Viral: సూపర్‌స్టార్ మహేశ్ బాబు స్టైలిష్ లుక్‌లో అదిరిపోయాడు. వయసు పెరుగుతున్నా రోజురోజుకి మరింత యంగ్ లుక్‌లో సర్‌ప్రైజ్ చేస్తున్నారు మహేశ్. ఓ వైపు సినిమాలతో బిజీగా ఉంటూనే, మరోవైపు పలు బ్రాండ్స్‌కి ప్రచారకర్తగా వ్యవహరిస్తున్న మహేశ్ తాజాగా పాల్గొన్న ఓ ఫోటోషూట్ ఇప్పుడు నెట్టంట వైరల్ అవుతుంది. కంప్టీట్ బ్లాక్ డ్రెస్‌లో చేతిలో మొబైల్ పట్టుకొని ఫోటోలకు ఫోజులిచ్చాడు.
ప్రస్తుతం మహేశ్ సూపర్ స్టైలిస్ లుక్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఇది ఏదైనా కమర్షియల్ యాడ్ ఫిల్మ్ కోసమా లేదా సర్కారు వారి పాట సినిమాకు సంబంధించినదా అన్నది తెలియలేదు. కాగా మహేశ్, కీర్తి తొలిసారి జంటగా నటిస్తున్న సర్కారు వారి పాట సినిమా 2022, ఏప్రిల్ 1న రిలీజ్ కానుంది. జీఎంబీ ఎంటర్‌టైన్మెంట్స్, మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ సంయుక్తంగా ఈ చిత్రాన్నినిర్మిస్తున్నాయి.
Super ⭐ @urstrulyMahesh looks Ultra Stylish in this latest photoshoot 🖤🔥#MaheshBabu #SarkaruVaariPaata #TeluguFilmNagar pic.twitter.com/2j2QGPAhno
— Telugu FilmNagar (@telugufilmnagar) November 25, 2021
Comments
Please login to add a commentAdd a comment