అనంతపురం: అనంతపురం జిల్లా గోరంట్ల మండలం బూడిదగడ్డపల్లి గ్రామం వద్ద ఆదివారం సాయంత్రం ఓ కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందగా, డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వివరాలు...ఒక కారు బెంగళూరు వైపు వెళుతుండగా బూడిదగడ్డపల్లి గ్రామం వద్ద మలుపు రావడంతో దాన్ని తప్పించే ప్రయత్నంలో అదుపు తప్పడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న దివాకర్ రెడ్డి(35) అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా దివాకర్ రెడ్డిని వైఎస్సార్ జిల్లాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు.
(గోరంట్ల)
కారు బోల్తా.. వ్యక్తి మృతి
Published Sun, Mar 1 2015 7:29 PM | Last Updated on Sat, Sep 2 2017 10:08 PM
Advertisement
Advertisement