ornament
-
కంటె కనువిందు
నానమ్మ, అమ్మమ్మల మెడలలో అప్పట్లో కంటె ఆభరణం (దీని నుంచే కంఠాభరణం అనే పేరు వచ్చి ఉంటుంది) ఉండేది. వేడుకలకే కాకుండా ఎప్పుడూ ధరించి ఉండేవారు. ఆ తర్వాత గోల్డ్ షాపుల్లో ‘కంటె’ కరిగి ఆధునిక నగగా రూపాంతరం చెందింది. కానీ, ఇప్పుడు ‘కంటె’ ట్రెండ్ మళ్లీ వచ్చింది. వేడుకలలో కనువిందు చేసే కంఠాభరణమైంది.కంటె ట్యూబులా ఉంటుంది. దీంట్లో వేల డిజైన్స్ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. కంటెకు పెండెంట్ వేసుకోవచ్చు. పెండెంట్ లేకుండానూ కంటెను ధరించవచ్చు. 25 గ్రాముల నుంచి ఎంత మొత్తం బంగారంతోనైనా డిజైన్ని చేయించుకోవచ్చు. లైట్ వెయిట్లోనూ కంటె డిజైన్లు చేయించుకోవచ్చు. వివాహ వేడుకలలో ప్రత్యేకంగా కనిపించడానికి ఈ డిజైన్ బాగా అమరుతుంది. ఆభరణాల అలంకరణలో వయసుతో నిమిత్తం లేనప్పటికీ కంటె ఆభరణానాన్ని 50 ఏళ్ల లోపు వయసువారికి బాగా నప్పుతుంది. నవతరం అమ్మాయిలు ఆధునిక దుస్తుల మీదకు అలంకరించుకోవాలంటే స్టైల్‌గా ఉండే నెక్‌పీస్ కావాలి. ఇందుకు సన్నటి డిజైన్లలో ఉన్న కంటెను ఎంపిక చేసుకోవచ్చు. ఒకప్పుడు ప్లెయిన్‌గా ఉండే కంటెకు రాళ్లు, రత్నాలు పొదిగి, పెండెంట్లు జత చేయడం కంఠాభరణం కమనీయంగా మారిపోయింది. – శ్వేతారెడ్డి ఆభరణాల నిపుణురాలు -
అభరణాలు ఏమయ్యాయి అని ప్రశ్నస్తే కక్షసాధింపిలా?
-
స్టైలిష్ నెక్ పీస్
మీ దగ్గర ఉన్న పాత ఇమిటేషన్ జువెల్రీ రంగు పోయినా లేదంటే మరో కొత్త రూపం తీసుకురావాలన్నా ఓ చిన్న ఆలోచన చాలు. డ్రెస్ కలర్‌కు మ్యాచ్ అయ్యే ఆభరణం కొనుగోలు కోసం ప్రయాస పడకుండా ఇలా వినూత్న డిజైన్ నెక్‌పీస్‌ను రూపొందించుకోవచ్చు. ఇందుకు కావల్సినవి: ► రాళ్లు పొదిగి ఉన్న పాత నెక్లెస్ ►నెయిల్ పాలిష్ ► నూలు దారాలతో అల్లిన తాడు లేదంటే సన్నని వైర్లతో అల్లిన మందపాటి తాడు (అన్ని రంగుల్లోనూ ఈ తాళ్లు మార్కెట్లో లభ్యమవుతాయి) u సూది, దారం u కత్తెర u క్యాండిల్ లేదా లైటర్ స్టెప్ : 1 .. తాడుకు పూర్తి కాంట్రాస్ట్ నెయిల్ పాలిష్‌ను తీసుకోవాలి. అన్ని రాళ్ల మీద నెయిల్ పాలిష్ కోటింగ్ వేయాలి. ఒక్కో రాయి మీద ఒక్కో నెయిల్ పాలిష్ రంగు కూడా వేసుకోవచ్చు. అన్ని రాళ్ల మీద రెండవ సారి కూడా నెయిల్ పాలిష్ కోటింగ్ వేసి ఆరనివ్వాలి. స్టెప్ : 2 .. నెక్లెస్ ఎంత పొడవు ఉందో అంత పొడవు తాడు కత్తిరించుకోవాలి. స్టెప్ : 3 నూలు తాడు అయితే చివర్లు ముడివేయాల్సి ఉంటుంది. ప్లాస్టిక్ వైర్ తాడు కాబట్టి చివరన క్యాండిల్ లైట్‌తో గానీ లైటర్ మంటతో గానీ కాల్చాలి. వేడికి చివర్లు ముడుచుకుపోయి, విడిపోకుండా ఉంటాయి. స్టెప్ : 4 .. నెక్లెస్ రంగు దారం తీసుకొని సూదికి ఎక్కించాలి. ఆ సూదితో నెక్లెస్‌ను తాడుకు జత చేసి కుట్టాలి. ప్లెయిన్ డ్రెస్‌ల మీదకు ఇలాంటి నెక్లెస్ చూడగానే ఆకట్టుకుంటుంది. ఖర్చు కూడా నెక్లెస్ కొనుగోలు చేసేటంత కాదు. నెయిల్ పాలిష్ గోళ్లకు వేసుకోవ డానికి తీసుకుంటారు. సూది దారం ఇంట్లోనే ఉంటాయి. ప్లాస్టిక్ లేదా నూలు దారం తాడుకు రూ.5 నుంచి రూ.10 లోపు అవుతుంది. -
వేడుకలో ప్లాటినం జువెల్లరీ..
కస్టమర్లలో 85% యువతే - చిన్న నగరాలకూ పాకిన సంస్కృతి - 2020 నాటికి 4 రెట్ల అమ్మకాలు - సాక్షితో ప్లాటినం గిల్డ్ ఇండియా ఎండీ వైశాలి బెనర్జీ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్లాటినం.. అమూల్యమైన ఈ లోహం ఇప్పుడు భారత్‌లో ప్రత్యేకతను సంతరించుకుంటోంది. వేడుకల్లో ప్లాటినం ఆభరణం ఉండాల్సిందేనని యువత అంటోంది. 2014లో భారత్‌లో 5 టన్నుల ప్లాటినం ఆభరణాలు అమ్ముడయ్యాయి. అయిదారేలళ్ల క్రితం విక్రయాలతో పోలిస్తే ఇది 10 రెట్లు అధికమని ప్లాటినం గిల్డ్ ఇంటర్నేషనల్ (పీజీఐ) ఇండియా ఎండీ వైశాలి బెనర్జీ తెలియజేశారు. కస్టమర్లలో 85 శాతం మంది 18 నుంచి 35 ఏళ్ల మధ్య వయసున్నవారే. ఈ అంశమే ప్రస్తుత ట్రెండ్‌కు అద్దం పడుతోందని అన్నారు. 2020 నాటికి పరిశ్రమ నాలుగు రెట్లకు చేరుకోవడం ఖాయమని పేర్కొన్నారు. ప్లాటినం అమ్మకాలను పీజీఐ ప్రపంచవ్యాప్తంగా ప్రోత్సహిస్తోందని చెప్పారు. ఆభరణాల విపణి తీరుతెన్నులను ‘సాక్షి బిజినెస్ బ్యూరో’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. అవి ఆమె మాటల్లోనే.. ప్రత్యేక సందర్భంలో.. నిశ్చితార్థం, వివాహం, పెళ్లి రోజు వంటి ప్రత్యేక వేడుకల్లో ప్రాధాన్య బహుమతిగా ప్లాటినం నిలుస్తోంది. మొత్తం ప్లాటినం ఆభరణాల్లో ఉంగరాల వాటా అత్యధికంగా 60% కావడం గమనార్హం. రూ.30-35 వేల మధ్య లభించే ఉంగరాలకు భారత్‌లో అధిక డిమాండ్ ఉంది. కపుల్ రింగ్స్‌లో రూ.60-70 వేల ధరవి అధికంగా అమ్ముడవుతున్నాయి. ఇక ప్లాటినం విక్రయాల్లో 12-15% వాటా పురుషుల ఆభరణాలు కాగా మిగిలిన వాటాను మహిళల ఆభరణాలు కైవసం చేసుకున్నాయి. వధూవరుల కోసం ప్రత్యేకంగా ‘ఎవరా’ శ్రేణిలో ఆభరణాలను తీసుకొచ్చాం. ద్వితీయ శ్రేణి నగరాల్లోనూ.. ప్రత్యేకత కోరుకునేవారు ఈ లోహానికి మళ్లుతున్నారు. గతంలో వజ్రాలతో కూడిన ప్లాటినం ఆభరణాల వాటా 95% ఉండేది. ఇప్పుడు ఇది 65 శాతానికి వచ్చింది. సాదాగా ఉండే ప్లాటినం ఆభరణాలను కూడా కస్టమర్లు కొనుగోలు చేయడం పెరిగింది. ద్వితీయ శ్రేణి నగరాల కూ ఇది పాకింది. భారత్‌లో 77 నగరాల్లోని 920 స్టోర్లకు ప్లాటినం గిల్డ్ ఇంటర్నేషనల్ ధ్రువీకరణ ఉంది. సగం స్టోర్లు మెట్రోయేతర నగరాల్లో ఉన్నాయంటే డిమాండ్‌ను అర్థం చేసుకోవచ్చు. బంగారం, ప్లాటినం విభాగాలు రెండూ కూడా వేర్వేరుగా మార్కెట్లో వృద్ధి చెందుతాయి. నాల్గవ స్థానంలో భారత్.. ప్లాటినం ఆభరణాల విక్రయంలో చైనా, జపాన్, యూఎస్ తర్వాతి స్థానంలో భారత్ ఉంది. భారత్‌లో 2014లో 28 శాతం వృద్ధితో 5 టన్నుల ఆభరణాలు అమ్ముడయ్యాయి. విలువ సుమారు రూ.2,800 కోట్లు. ఈ ఏడాది 23 శాతం వృద్ధి అంచనా వేస్తున్నాం. 2020 నాటికి పరిశ్రమ నాలుగు రెట్లకు చేరుకుంటుందన్న అంచనాలు ఉన్నాయి. భారత్‌లో 14 కంపెనీలు ఆభరణాల తయారీలో నిమగ్నమయ్యాయి. మధ్యప్రాచ్య దేశాలు, ఆస్ట్రేలియాకు ఎగుమతి చేస్తున్నాయి కూడా. -
రచయితకైనా.. జర్నలిస్టుకైనా.. సంతృప్తే ముఖ్యం..
వండర్ బుక్ ఆఫ్ రికార్డు, అష్టాదశ సహస్రసభా కేసరి బిరుదు పొందిన ‘తుర్లపాటి’తో ప్రత్యేక ఇంటర్వ్యూ ఆ గళం సభా సరస్వతికి ఆభరణం.. ఆ కలం రాజకీయ దర్పణం.. సుదీర్ఘమైన పాత్రికేయ వృత్తి, అంతకుమించిన రాజకీయ పరిణితి, అణుబాంబు నుంచి ఆవకాయ దాకా, ప్రాచీన సాహిత్యం నుంచి వర్తమాన కవిత్వంలో వచ్చిన మార్పులను వివరించడంలో ఆయనకు ఆయనే సాటి. ఆయన వ్యాసాలు.. వర్తమాన రాజ కీయాలకు దర్పణాలు. ఆయనే సీనియర్ పాత్రికేయుడు తుర్లపాటి కుటుంబరావు. సుదీర్ఘమైన అనుభవం కలిగిన తుర్లపాటి పద్మశ్రీ బిరుదుతో పాటు అనేక అవార్డులు, రికార్డులు సొంతం చేసుకున్నారు. తాజాగా వండర్ బుక్ ఆఫ్ రికార్డుతోపాటు అష్టాదశ సహస్రసభా కేసరి బిరుదు పొందిన ఆయన ఆ ఆనందాన్ని‘సాక్షి’తో పంచుకున్నారు. - విజయవాడ కల్చరల్ సాక్షి : మీకు ఉపన్యాస కళ ఎలా అబ్బింది? తుర్లపాటి : చిన్నతనంలో పామర్రులో చదువుకున్నా. అక్కడ డిబేటింగ్ సొసైటీ ఉండేది. ప్రతివారం సభలు జరిగేవి. అక్కడే నా ఉపన్యాస కళ ప్రారంభమైంది. ఇచ్చిన అంశం కోసం విపరీతంగా చదివేవాడ్ని. సాక్షి : మీ తొలి ఉపన్యాసం.. తుర్లపాటి : 1947 ఆగస్టు 15వ తేదీన గన్నవరంలో ఇచ్చాను. 2014 ఆగస్టు 15న విజయవాడలో ఇచ్చిన ఉపన్యాసంతో కలిపి ఇప్పటికి 18వేలు పూర్తయ్యూరుు. ఈ సందర్భంగానే తెలుగు బుక్ ఆఫ్ రికార్డుతో పాటు అష్టాదశ సహస్రసభా కేసరి బిరుదు లభించింది. సాక్షి : మీకు అనేక అవార్డులు వచ్చాయి కదా..అందుకు మీకు నచ్చింది.. తుర్లపాటి : నిస్సందేహంగా భారత ప్రభుత్వం ప్రకటించిన పద్మశ్రీ. ఈ గౌరవం జర్నలిజంలో నాకు మాత్రమే లభించింది. సాక్షి : మహాత్మాగాంధీకి నోబుల్ శాంతి బహుమతి ఇవ్వాలని మీరు కోరారు కదా.. అరుునా ఇవ్వకపోవడం వెనుక ఏదైనా కారణం ఉందా.. తుర్లపాటి : ఈ విషయంపై నోబుల్ శాంతి బహుమతి కమిటీ-స్వీడన్ వారితో నేను మాట్లాడాను. మరణించిన వారికి ఇచ్చే సంప్రదాయం లేదన్నారు. నాకు తెలిసి స్వీడన్ దేశస్తుడైన డాక్ విమాన ప్రమాదంలో మరణించిన తరువాత ఆయనకు ఆ బహుమతి ఇచ్చారు. దీనిపై వారి వద్ద నుంచి ఎటువంటి సమాధానం రాలేదు. సాక్షి : ‘నా కలం - నా గళం’ అన్న మీ జీవిత చరిత్రలో మీకు సంబంధించిన విషయూల కంటే.. రాజకీయూలే ప్రస్తావించారు. కారణం.. తుర్లపాటి : చాలా సంవత్సరాలుగా జర్నలిస్టుగా ఉన్నా. చాలామంది రాజకీయ నాయకులతో మంచి సంబంధాలు ఉండేవి. ఆనాటి రాజకీయ చరిత్రను భావితరాలకోసం అలా రాయాల్సి వచ్చింది. సాక్షి : ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారికి మీరు కార్యదర్శిగా పనిచేశారు కదా, వారితో మీ సంబంధాలు ఎలా ఉండేవి? తుర్లపాటి : ప్రకాశం గారు అందరినీ ఏకవచనంతో సంబోధించేవారు. నన్ను మాత్రమే ‘తుర్లపాటి’ అని పిలిచేవారు. విలువలు కలిగిన రాజకీయ నేత ఆయన. జీవితంలో రాజీపడకపోవటం ఆయన నైజం. సాక్షి : అప్పటికీ, ఇప్పటికీ రాజకీయాల్లో తేడా ఏంటీ? తుర్లపాటి : అప్పటివి రాజకీయూలు.. ఇప్పటివి అరాజకీయూలు.. సాక్షి : రాష్ట్ర విభజన గురించి మీరేమంటారు? తుర్లపాటి : విభజన వల్ల రాష్ట్రం చాలా నష్టపోయింది. కొత్త రాష్ట్రంలో అన్నీ కొత్తగా ఏర్పాటుచేసుకోవాల్సి వచ్చింది. సాక్షి : రచయితగా, కాలమిస్టుగా మీ జీవితం సంతృప్తికరంగా సాగిందా..? తుర్లపాటి : రచయితకైనా,జర్నలిస్టుకైనా.. సంతృప్తి ముఖ్యం. అది ఉంటే అన్నీ ఉన్నట్టే. సాక్షి : భావి జర్నలిస్టులకు మీరిచ్చే సలహా ఏమిటీ? తుర్లపాటి : చదవటం బాగా అలవాటు చేసుకోవాలి. విషయ సేకరణ కోసం అందిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి. అన్నింటికన్నా ముఖ్యం కష్టపడి కాదు.. ఇష్టపడి వృత్తిలోకి ప్రవేశించాలి. స్వర్ణాంధ్ర కష్టమే... స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణం దాదాపు అసాధ్యమే. బంగ్లాదేశ్‌ను పాలించిన ముజబూర్ రెహమాన్ ఆ దేశాన్ని సోనార్ బంగ్లా చేస్తానన్నాడు. ఆయన తరువాత అది మూలనపడింది. చిత్తశుద్ధిలేని పనుల వల్ల ఏ పనీ పూర్తికాదు. -
ఆడపిల్ల అక్కడే పుట్టాలి..!
విదేశీయులు సైతం మెచ్చే సంస్కృతీ సంప్రదాయాలే కాదు... ప్రపంచంలో ఎక్కడా లేనన్ని మూఢాచారాలు కూడా ఉన్న దేశం మనది. వాటిని రూపుమాపడానికి ఏ మహానుభావుడో రావాలంటే కుదరదు. ఎవరికి వారే ముందడుగు వేయాలి. మంచిని పెంచాలి. చెడును తుంచాలి. అలా చేశారు కాబట్టే బీహార్ లోని ధర్హరా గ్రామస్థులు ఈరోజు అందరికీ ఆదర్శంగా నిలిచారు. తమ ఊరి స్వరూపాన్నే కాదు... తమ ఆడపిల్లల తలరాతనే మార్చేశారు. శతాబ్దాలుగా పాతుకుపోయిన ఓ మూఢాచారానికి ముగింపు పలుకుతున్నారు! ఆడపిల్లని మహాలక్ష్మి అంటారు. కానీ ఆ మహాలక్ష్మిని ఆనందంగా ఆహ్వానించేవాళ్లు ఎంతమంది ఉన్నారు! ఆడపిల్ల వద్దు అనుకునేవాళ్లు, కూతురు పుడితే మోయలేని భారం భుజాల మీద పడిందని బాధపడిపోయేవాళ్లు ఇప్పటికీ కోకొల్లలుగా ఉన్నారు. అలాంటివాళ్లందరినీ బీహార్‌లోని భాగల్పూర్ జిల్లాలో ఉన్న ధర్హరా గ్రామానికి తీసుకెళ్లాలి. ఆ గ్రామస్థులు ఆడపిల్ల పుడితే ఆనందంతో మురిసిపోతారు. మహాలక్ష్మి పుట్టిందంటూ సంబరాలు చేసుకుంటారు. అందరినీ పిలిచి విందులు ఇస్తారు. ఎందుకంటే వారికి ఆడపిల్ల భారం కాదు... ఆభరణం! ధర్హరాలో అడుగు పెడితే కన్నులు పచ్చరంగు పూసుకుంటాయి. ఎటుచూసినా పచ్చటి మొక్కలు, చల్లగా వీచే గాలి... ప్రకృతి రమణీయతతో, ప్రశాంతతతో అలరారుతూ ఉంటుంది ధర్హరా. నిజానికి ఒకప్పుడు ఆ ఊరు ఇలా ఉండేది కాదు. ఆ రాష్ట్రంలో ఉన్న అనేక వెనుకబడిన గ్రామాల్లాగే ఉండేది. బీడువారి మోడులా కనిపించేది. కానీ ఎప్పుడు మొదలైందో, ఎలా మొదలైందో తెలియదు కానీ... మెల్లమెల్లగా ధర్హరా తన స్వరూపాన్ని మార్చుకుంటూ వచ్చింది. ఎలా మొదలైందో తెలీదు కానీ... ఒకప్పుడు ధర్హరాలో ఆడపిల్లల పరిస్థితి ఎంతో దయ నీయంగా ఉండేది. వారికి పెళ్లి చేసి పంపలేక తల్లిదండ్రులు నానా అగచాట్లూ పడేవారు. కట్నపు బాకీలు సరిగ్గా చెల్లించలేకపోవడంతో అత్తమామలు ఆడపిల్లల ప్రాణాలు తీసేవారు. అలాంటి పరిస్థితి తమకు రాకూడదని కొందరు తల్లిదండ్రులు ఆడపిల్లల్ని పురిట్లోనే చంపేసేవారు. అలాంటి సమయంలో ఆ ఊరిలో ఒక సంప్రదాయం మొదలైంది. ఎవరు దానికి పునాది వేశారో తెలియదు కానీ... ఆడపిల్ల పుడితే ఆమె పేరు మీద ఒక పండ్ల మొక్క నాటాలి అనే నియమం ఏర్పడింది (అప్పట్లో ప్రధాన్‌గా ఉన్న వ్యక్తి దీన్ని అలవాటు చేశాడని అంటారు కానీ సరైన ఆధారాలైతే లభించడం లేదు. కొన్ని వందల యేళ్లుగా ఈ ఆచారం వస్తోందని చెబుతారు తప్ప ఎప్పుడు మొదలైందో గ్రామస్థులకు కూడా సరిగ్గా తెలియదు). పిల్ల పుట్టినప్పుడే మొక్క నాటితే అది తనతోపాటు పెరుగుతుంది, ఆ చెట్టు మీద వచ్చే ఆదాయంతో బిడ్డను పెంచవచ్చు, పెళ్లి చేయవచ్చు అన్న ఉద్దేశంతో ఈ పద్ధతిని మొదలు పెట్టారు. ఆ ఆలోచన నచ్చడంతో అందరూ దాన్ని పాటించడం మొదలు పెట్టారు. దాంతో ఆ ఊరు ఒక గ్రీన్ విలేజ్‌లా మారిపోయింది. తరతరాలుగా ఈ సంప్రదాయాన్ని పాటిస్తున్నారు ధర్హరా గ్రామస్తులు. మొదట్లో ఒక మొక్కను నాటేవారు కాస్తా ఇప్పుడు పది నుంచి ఇరవై మొక్కలను నాటుతున్నారు. దాంతో ఊరు ఊరంతా పండ్ల చెట్లతో పచ్చగా అలరారుతోంది. మామిడి, పనస, నేరేడు వంటి పది రకాల చెట్లు కొన్ని వందల ఎకరాల్లో విస్తరించాయి. ఆడపిల్లలు ఉన్నవారంతా వీటి మీద వచ్చే ఆదాయంతోనే బతుకుతున్నారు. ఆ సొమ్మును జాగ్రత్తగా దాచి పిల్లలకు పెళ్లిళ్లు చేస్తున్నారు. ‘‘పండ్లతో పాటు కలప కూడా బాగా ధర పలుకుతుంది కాబట్టి ఎలాగైనా పిల్లల జీవితాలను చక్కబెట్టేయవచ్చు అన్న భరోసా పెరిగింది అందరిలో’’ అంటారు సుభాష్‌సింగ్. మామిడి చెట్ల మీద వచ్చిన ఆదాయంతోనే తన కూతురికి మంచి సంబంధం చూసి చేశారాయన. ఇలాంటి తండ్రులు ధర్హరాలో చాలామంది ఉన్నారు. పిల్లలకు కట్నా లిచ్చి పెళ్లిళ్లు చేశారు. కొందరైతే బిడ్డ పేరు మీద నాటిన చెట్లనే అల్లుళ్లకు రాసిచ్చారు. దాంతో వరకట్న చావులు లేకుండా పోయాయి. ఇంకా చెప్పు కోవాల్సిన విషయమేమిటంటే... ఆ గ్రామస్థుల ఆలోచనకు ముచ్చటపడి యువకులు ఆ ఊరి అమ్మాయిల్ని కట్నం తీసుకోకుండానే వివాహం చేసు కుంటున్నారు. దాంతో మెల్లగా వరకట్నం అన్న మాట వినబడకుండా పోయింది. ఆడపిల్లలు నవ్వుతూ, తుళ్లుతూ బతుకుతున్నారు. చదువు కుంటున్నారు. పెళ్లి చేసుకుని హాయిగా కాపురాలు చేసుకుంటున్నారు. బహుశా ప్రపంచంలో మరెక్కడా ఆడపిల్లలు ఇంత సంతోషంగా ఉండరేమో. ఆడపిల్లను ఆనందానికి ప్రతిరూపంగా మార్చిన ఘనత ధర్హరా గ్రామస్తులదే. వారిని ఆదర్శంగా తీసుకుంటే ఈ దేశంలో భ్రూణ హత్యలుండవు. వరకట్న చావులుండవు. అసలు ఏ ఆడపిల్ల కళ్ల నుండీ కన్నీళ్లన్నవే జాలువారవేమో! - సమీర నేలపూడి ఒకప్పుడు ధర్హరాలో ఓ దురాచారం ఉండేది. ఆడపిల్లని ముందు మామిడి చెట్టుకిచ్చి పెళ్లి చేసేవారు. తర్వాతే వరుడితో తాళి కట్టించేవారు. కానీ ఇప్పుడా ఆచారం లేదు. మామిడి చెట్టుతో కాదు, మామిడి చెట్ల సాయంతో పిల్లలకు మనువు జరిపిస్తున్నారు. తగిన సంబంధాలు చూసి చేయగలమన్న ధీమా రావడంతో ఆడపిల్లలను చక్కగా చదివిస్తున్నారు కూడా! దాంతో అక్కడ బాలికల అక్షరాస్యతా శాతం కూడా పెరుగుతోంది.