
సాక్షి, విజయనగర్‌కాలనీ(హైదరాబాద్): ఆసిఫ్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో వ్యక్తి గొంతుకోసుకున్న సంఘటన శనివారం వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మెహిదీపట్నం భోజగుట్టలో నివసించే హరి (33) పనీపాటా లేకుండా జులాయిగా తిరుగుతుంటాడు. అతనికి ముగ్గురు భార్యలు. అతని రెండో భార్య సెల్‌ఫోన్ లాక్కోవడంతో గొడవ జరిగింది.
ఫిర్యాదు చేయడానికి ఆసిఫ్‌నగర్ పోలీస్ స్టేషన్‌కు ఇతని మరో భార్యతో వచ్చాడు. ఫిర్యాదు తీసుకోవడం లేటవుతుందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ మద్యం మత్తులో ఉన్న హరి తనతో తెచ్చుకున్న బ్లేడుతో గొంతు దగ్గర కోసుకున్నాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో పోలీసులు అతనిని వైద్యసేవల నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఇతను గతంలో పలుమార్లు ఇదే విధంగా బ్లేడుతో శరీరం కోసుకోవడంతో శరీరమంతా కత్తిగాట్లు ఉన్నాయన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment