మెడమీద ముడతలు తగ్గాలంటే...
ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు క్లెన్సింగ్ మిల్క్‌లో ముంచిన కాటన్‌తో మెడను తుడిచి, ఆ తర్వాత టీ స్పూన్ కీరాదోసకాయ రసంలో టీ స్పూన్ ఆపిల్ వెనిగర్ కలిపిన మిశ్రమాన్ని మెడకు పట్టించాలి. ఉదయం చన్నీటితో కడిగేయాలి. ఇలా కనీసం మూడు వారాల పాటు చేస్తే క్రమంగా మెడ మీద నలుపు వదులుతుంది. ఆపిల్ వెనిగర్ చర్మాన్ని టైట్ చేస్తుంది, కీరదోస చర్మాన్ని కోమలంగా మారుస్తుంది.
యాంటీ ఏజింగ్ ఫేషియల్ మాస్క్
పెరిగే వయసును అద్దంలా ప్రతిబింబింపజేసేది చర్మం. అందులోనూ చలికాలంలో మరీ ఎక్కువ ముడతలు పడుతుంది. అందుకే వార్ధక్య లక్షణాలకు చెక్‌పెట్టే హోమ్‌మేడ్ ఫేషియల్ మాస్క్ ఇది.
ఒక నిమ్మకాయను తీసుకుని, గింజలు వేరుచేసి, అందులో ఒక స్పూను మీగడ వేసి గ్రైండ్ చేయాలి. ఈ మిశ్రమాన్ని పలుచటి పొరలా ముఖానికి రాయాలి. ఆరిన తర్వాత తీసేసి ముఖానికి ఫేషియల్ క్రీమ్ రాసి మర్దన చేయాలి. ముడతలు పడిన చర్మానికి ఈ ప్యాక్ బాగా పనిచేస్తుంది.