facial mask
-
క్షణాల్లో ఫేస్‌మాస్క్‌ను రెడీ చేసే మెషీన్.. కొరియన్లు చేసేది ఇదే
నిజానికి ఫేస్ మాస్క్‌లతో స్కిన్ కేర్ పొందడం మంచి ప్రయత్నమే. కానీ వాటిని సిద్ధం చేసుకోవడమే కష్టం. ఆ కష్టాన్ని సులభతరం చేస్తుంది ఈ లేటెస్ట్ ఫేస్ మాస్క్ డివైస్. ఇంట్లో తయారు చేసుకునే సాధారణ ఫేస్ మాస్క్ వేసుకుంటే.. అప్లై చేసుకునే సమయంలో ఒక చోట ఎక్కువ, ఒక చోట తక్కువవుతుంది. కొన్నిసార్లు సగం ఆరి.. సగం ఆరక ఇబ్బందవుతుంది. గుజ్జుమెత్తగా లేకుంటే ఉండాల్సిన సమయం కంటే ముందే రాలిపోతుంది. ఇలా ఒక్కటని కాదు.. ఫేస్ మాస్క్ విషయంలో అన్నీ సమస్యలే. అదే ఈ మెషిన్‌తో తయారైన మాస్క్‌ని క్లాత్ మాదిరి పట్టుకుని.. ముఖంపై సమాంతరంగా సులభంగా పరచుకోవచ్చు. పైగా ఈ మెషిన్ని మనం క్లీన్ చెయ్యాల్సిన పనిలేదు. సెల్ఫ్ క్లీనింగ్ మోడ్ ఆన్ చేస్తే పది సెకన్లలో క్లీన్ అయిపోతుంది. దీనికి చార్జింగ్ పెట్టుకుని.. వైర్‌లెస్‌గా వాడుకోవచ్చు. ఎన్ని నీళ్లు పొయ్యాలి.. ఇన్‌గ్రీడియెంట్స్ ఏ మోతాదులో కలపాలి.. అనే సూచనలను వాయిస్ మోడ్‌లో ఇస్తూంటుంది ఈ మేకర్. అవసరం లేదనుకుంటే వాయిస్ రిమైండర్ ఆపేసుకోవచ్చు. ఇది సరిగ్గా రెండు నిమిషాల్లో మాస్క్కి కావాల్సిన పేస్ట్‌ని సిద్ధం చేస్తుంది. ఇందులో కూరగాయలు, పండ్లు, విటమిన్ టాబ్లెట్స్ వంటివి పేస్ట్‌లా చేసుకోవచ్చు. దీని ధర సుమారుగా 6 వేలరూపాయల పైమాటే. మాస్క్ ప్లేట్స్‌ని బట్టి.. అందులో లిక్విడ్ వేయగానే ఆయా షేప్ మాస్క్‌లు సిద్ధమవుతాయి. కళ్లు, ముక్కు, పెదవులకు ఇబ్బంది లేకుండా రూపొందిన ఫేస్ షేప్‌లో ఉండే ప్లేట్‌తో పాటు.. కళ్లు, ముక్కు, పెదవుల ఆకారంలో ఉండే ప్లేట్స్ కూడా డివైస్‌తో పాటు లభిస్తాయి. ఈ సౌకర్యాలన్నింటిని బట్టి ధరల్లో వ్యత్యాసం ఉంటుంది. -
ఇలా చేసి చూడండి..
ముఖాన్ని అందహీనంగా మార్చే.. మచ్చలు, మొటిమలు శాశ్వతంగా తొలగిపోవాలంటే సహజసిద్ధమైన సౌందర్యలేపనాలను అన్నివిధాలా మంచిదంటున్నారు నిపుణులు. అయితే అందుకోసం కాస్త సమయం కేటాయించాల్సి ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం? ఇలా ప్రయత్నించండి. కావల్సినవి: క్లీనప్ : తులసి రసం – 1 టీ స్పూన్, పచ్చిపాలు – 2 టీ స్పూన్లు, స్క్రబ్ : ఓట్స్ – 1 టీ స్పూన్, అరటిపండు గుజ్జు – 3 టీ స్పూన్లు, బియ్యప్పిండి – అర టీ స్పూన్ మాస్క్: క్యారెట్ గుజ్జు – 1 టీ స్పూన్, బాదం పేస్ట్ – 1 టీ స్పూన్, పచ్చిపాలు – ఒకటిన్నర స్పూన్లు తయారీ: ముందుగా ఒక చిన్న బౌల్ తీసుకుని తులసి రసం, పచ్చిపాలు వేసుకుని బాగా కలుపుకుని, మెత్తని క్లాత్‌తో ముఖం, మెడ క్లీనప్ చేసుకోవాలి. ఇప్పుడు ఓట్స్, అరటిపండు గుజ్జు, బియ్యప్పిండి ఒక బౌల్లోకి తీసుకుని బాగా కలుపుకుని, ఇంచుమించు ఐదు నిమిషాల పాటు స్క్రబ్ చేసుకోవాలి. తర్వాత చల్లని నీళ్లతో ముఖాన్ని శుభ్రం చేసుకుని ఆవిరి పట్టించుకోవాలి. ఇప్పుడు క్యారెట్ గుజ్జు, బాదం పేస్ట్, పచ్చిపాలు బాగా కలుపుకుని ముఖానికి పట్టించాలి. ఇరవై లేదా ఇరవై ఐదు నిమిషాల పాటు ఆరనిచ్చి.. తర్వాత గోరువెచ్చని నీళ్లతో ముఖం శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండు సార్లు చెయ్యడం వల్ల ముఖం నిగారింపు సంతరించుకుంటుంది. -
మెడమీద ముడతలు తగ్గాలంటే...
ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు క్లెన్సింగ్ మిల్క్‌లో ముంచిన కాటన్‌తో మెడను తుడిచి, ఆ తర్వాత టీ స్పూన్ కీరాదోసకాయ రసంలో టీ స్పూన్ ఆపిల్ వెనిగర్ కలిపిన మిశ్రమాన్ని మెడకు పట్టించాలి. ఉదయం చన్నీటితో కడిగేయాలి. ఇలా కనీసం మూడు వారాల పాటు చేస్తే క్రమంగా మెడ మీద నలుపు వదులుతుంది. ఆపిల్ వెనిగర్ చర్మాన్ని టైట్ చేస్తుంది, కీరదోస చర్మాన్ని కోమలంగా మారుస్తుంది. యాంటీ ఏజింగ్ ఫేషియల్ మాస్క్ పెరిగే వయసును అద్దంలా ప్రతిబింబింపజేసేది చర్మం. అందులోనూ చలికాలంలో మరీ ఎక్కువ ముడతలు పడుతుంది. అందుకే వార్ధక్య లక్షణాలకు చెక్‌పెట్టే హోమ్మేడ్ ఫేషియల్ మాస్క్ ఇది. ఒక నిమ్మకాయను తీసుకుని, గింజలు వేరుచేసి, అందులో ఒక స్పూను మీగడ వేసి గ్రైండ్ చేయాలి. ఈ మిశ్రమాన్ని పలుచటి పొరలా ముఖానికి రాయాలి. ఆరిన తర్వాత తీసేసి ముఖానికి ఫేషియల్ క్రీమ్ రాసి మర్దన చేయాలి. ముడతలు పడిన చర్మానికి ఈ ప్యాక్ బాగా పనిచేస్తుంది.