గొలుసు చోరీ
Published Mon, Sep 26 2016 11:40 PM | Last Updated on Mon, Sep 4 2017 3:05 PM
నిజామాబాద్ కైం:
ఉమెన్స్ కళాశాల లెక్చరర్ మెడలో నుంచి చైన్‌ను లాక్కెళ్లారు దుండగులు. మూడో టౌన్ ఎస్సై–2 వెంకట్ కథనం ప్రకారం.. నీలకంఠనగర్‌కు చెందిన అనసూయ కంఠేశ్వర్ ఉమెన్స్ కళాశాలలో లెక్చరర్. రెండు రోజుల క్రితం గిరిరాజ్ కళాశాల ప్రిన్సిపల్‌ను కలిసేందుకు గిరిరాజ్ కళాశాలకు ఆటోలో వచ్చింది. కళాశాల ముందు ఆటో దిగి లోనికి నడుచుకుంటూ వెళ్తుండగా, వెనుక నుంచి బైక్‌పై వచ్చిన ఇద్దరు యువకులు ఓ రాయితో ఆమె కాలిపై విసిరారు. దాంతో ఆమె ఏమైందోనని చూసేకునే లోపు ఆమె మెడలోనున్న మూడు తులాల బంగారు గొలుసును తెంపుకొని పారిపోయారు. బిత్తరపోయిన ఆమె తెరుకుని కేకలు పెట్టేసరికి దొంగలు అక్కడి నుంచి క్షణల్లో మాయం అయిపోయారు. అనంతరం అక్కడి స్థానికులు ఆమె వద్దకు చేరుకోగా వారికి జరిగిన విషయం తెలిపింది. సంఘటన అనంతరం లెక్చరర్ దిగులుపడుతూ ఇంటికి చేరుకుంది. బంధుమిత్రుల సలహా మేరకు బాధితురాలు సోమవారం మూడో టౌన్ ఠాణాలో ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులో ంది.
Advertisement
Advertisement