మెదక్: ఆగి ఉన్న లారీని కారు ఢీకొనడంతో ఇద్దరు మిత్రులు మృతి చెందిన సంఘటన సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో బీదర్ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. జహీరాబాద్ టౌన్ సీఐ రాజు వివరాలు ఇలా ఉన్నాయి. కర్నాటక రాష్ట్రం బీదర్ పట్టణానికి చెందిన మాజీ మంత్రి గురుపాదప్ప నాగమర్పళి తమ్ముడు చంద్రకాంత్ కుమారుడు అవిరాజ్ నాగమర్పళి(27), మన్నెక్కిలి చెందిన వీరుపాటిల్(30) ఇద్దరు స్నేహితులు.
వీరు కాంట్రాక్ట్ పనులు చేస్తుంటారు. మన్నెక్కిలి నుంచి బీదర్‌కు వచ్చిన వీరు పాటిల్‌ను జహీరాబాద్‌లో డ్రాప్ చేసి హైదరాబాద్‌లో ఉంటున్న భార్య వద్దకు వెళ్లేందుకు అవిరాజ్ నాగమర్పళి ఇన్నోవా కారులో బయల్దేరాడు. బీదర్ నుంచి వస్తున్న వీరు జహీరాబాద్ సమీపంలో రైల్వే గేటు దర్గా వద్ద ఆగి ఉన్న లారీని వెనుక నుంచి వేగంగా ఢీకొట్టారు.
ప్రమాదంలో కారులో ఉన్న ఇద్దరికి తీవ్రగాయాలు కావడంతో అక్కడిక్కడే మృతి చెందారు. సంఘటన స్థలానికి జహీరాబాద్ డీఎస్పీ రఘు, సీఐ రాజు సందర్శించారు. మృతదేహాలను జహీరాబాద్ ఏరియా ఆసుపత్రికి తరించారు. లారీ రోడ్డుపై నిలపడ వల్ల ఈ ప్రమాదం జరిగిందని, డ్రైవర్‌పై కేసు నమోదు చేసినట్లు సీఐ చెప్పారు. అవిరాజ్ నాగమర్పళికి భార్య, ఏడాది పాప ఉంది.
Comments
Please login to add a commentAdd a comment