ఈ నెల 16 నుంచి జరుగనున్న శాసనసభ, మండలి సమా వేశాల్లో సామాజిక న్యాయమే ప్రధాన ఎజెండాగా చర్చ జరగాలని అందుకు అనుగుణంగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం విధా నాలను రూపొందించాలని సీపీఎం డిమాండ్ చేసింది.
అసెంబ్లీ, మండలిలో చర్చకోసం సీపీఎం డిమాండ్
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 16 నుంచి జరుగనున్న శాసనసభ, మండలి సమా వేశాల్లో సామాజిక న్యాయమే ప్రధాన ఎజెండాగా చర్చ జరగాలని అందుకు అనుగుణంగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం విధా నాలను రూపొందించాలని సీపీఎం డిమాండ్ చేసింది. అసెంబ్లీ వేదికగా సామాజిక న్యాయం చర్చ కోసం పార్టీల కతీతంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, విప క్షాల సభ్యులు చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. ఈ అంశాలపై సీఎం కేసీఆర్‌ను, విపక్షాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కలసి కోరనున్నట్లు సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య తెలిపారు. మంగళవారం ఎంబీ భవన్ లో జి.నాగయ్య, బి.వెంకట్, టి.సాగర్, జె.వెంకటేశ్‌తో కలసి ఆయన విలేకరుల తో మాట్లాడారు. అసెంబ్లీ సమావేశా లను కనీసం 25 రోజులు నిర్వహించా లన్నారు. సామాజికన్యాయ ఎజెండా బలోపేతానికి చట్టసభల్లో సమన్వయం తో కృషి చేయాలని అన్ని పార్టీల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఉద్దేశించి సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం రాసిన లేఖను విడుదల చేశారు.