పోలవరం ఆర్డినెన్స్ పై 16వ లోక్సభలో తొలి ఆందోళన నమోదయింది. పోలవరం ఆర్డినెన్స్ ను వ్యతిరేకిస్తూ టీఆర్ఎస్, బీజేడీ ఎంపీలు లోక్సభలో నిరసనకు దిగారు. బి మహతాబ్ నేతృత్వంలోని బీజేడీ సభ్యులు ఆందోళనకు దిగారు. వీరికి టీఆర్ఎస్ ఎంపీలు జతకలిశారు. పోలవరం ఆర్డినెన్స్ కు ప్లకార్డులు ప్రదర్శించి నిరసన తెలిపారు. పోలవరం ప్రాజెట్టు వల్ల గిరిజనులు ప్రయోజనాలు దెబ్బతింటాయంటూ నినాదాలు చేశారు. స్పీకర్ సుమిత్రా మహాజన్ నచ్చజెప్పినప్పటికీ వారు వినిపించుకోలేదు. ఆర్డినెన్స్ చర్చకు వచ్చినప్పుడు నిరసన తెలపాలని స్పీకర్ కోరినా సభ్యులు ఆందోళన కొనసాగించారు. రాష్రపతి ప్రసంగ ప్రతులను విసిరేశారు. దీంతో స్పీకర్ రేపటికి వాయిదా వేశారు.