హైదరాబాద్:పోలవరం ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలుపుతూ పార్లమెంట్‌లో ఆంధ్రప్రదేశ్ పునర్విజన బిల్లులో చేసిన సవరణల ఆమోదానికి సంబంధించి తెలంగాణ వాదులు నిరసనం తెలపడం ఎంతమాత్ర సబబు కాదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధరరావు సూచించారు. తెలంగాణ బిల్లులో ఉన్నట్లుగానే పోలవరంపై నిర్ణయం తీసుకున్నామని ఆయన స్పష్టం చేశారు. పోలవరం ఆర్డినెన్స్ పై కొన్ని పార్టీలు వ్యతిరేకించడంపై శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. ఆ పార్టీలు రెండు నాల్కల ధోరణితో వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు.
తెలంగాణపై కేంద్రం సవతి తల్లి ప్రేమ అంటూ వ్యాఖ్యానించడం రాజకీయ ఆరోపణ మాత్రమేనని ఈ సందర్భంగా తెలిపారు. ఎయిమ్స్ పై నిర్ధిష్ట హామీ రాకపోవడానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రతిపాదన రాకపోవడమేనన్నారు.