muralidhara rao
-
అక్కడ పేదలకు ఇళ్లిస్తే..మా భూముల ధరలు పడిపోతాయి
సాక్షి, అమరావతి: రాజధానిలో పేదలకు ఇళ్లు నిర్మించి ఇస్తే తమ భూముల ధరలు అమాంతం పడిపోతాయని అమరావతి కోసం భూములిచ్చిన వ్యక్తుల తరఫు సీనియర్ న్యాయవాది ఉన్నం మురళీధరరావు హైకోర్టుకు నివేదించారు. రాజధాని ప్రాంతంలో పేదలకు 5 శాతం భూములిస్తూ చట్టం చేసేందుకు తాము గతంలో ఎంతమాత్రం అంగీకరించలేదన్నారు. ప్రపంచ స్థాయి రాజధానిని నాశనం చేయాలనే ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడమే కాకుండా ఇళ్లను కూడా నిర్మించి ఇస్తోందన్నారు. ముఖ్యమంత్రికి పేదలపై అంత ప్రేమ ఉంటే రాజధాని ప్రాంతంలో కాకుండా కడపలో ఇళ్ల స్థలాలు ఇచ్చుకోవాలన్నారు. ఎల్రక్టానిక్ సిటీకి కేటాయించిన భూముల్లో పేదల ఇళ్ల నిర్మాణానికి రంగం సిద్ధం చేస్తున్నారని చెప్పారు. రాజధానికి ఆదాయాన్ని సమకూర్చే ఎల్రక్టానిక్ సిటీ ప్రాంతంలో పేదలకు ఇళ్ల స్థలాలిస్తే చుట్టుపక్కల తమ భూముల ధరలు దారుణంగా పడిపోతాయన్నారు. రాజధాని వెలుపల పెద్ద సంఖ్యలో ప్రభుత్వ భూమి అందుబాటులో ఉందని, అక్కడ పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చుకోవచ్చని పునరుద్ఘాటించారు. రాజధాని భూముల విషయంలో సీఆర్డీఏ, రైతులకు మధ్య ఉన్నది వ్యాపార ఒప్పందమన్నారు. రైతుల అనుమతి లేకుండా పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి వీల్లేదన్నారు. పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు అనుమతినిచ్చిన సుప్రీంకోర్టు... పట్టాల మంజూరు హైకోర్టు తుది తీర్పునకు లోబడి ఉంటుందని స్పష్టం చేసిందన్నారు. అందువల్ల పట్టాల మంజూరు వ్యవహారం తేలకుండా ఇళ్ల నిర్మాణం చేపట్టడం తగదన్నారు. ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం హడావుడిగా ఏర్పాట్లు చేస్తోందని, గృహ నిర్మాణాలను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని అభ్యర్థించారు. రాజధాని భూములపై సీఆర్డీఏకు పూర్తిస్థాయి యాజమాన్యపు హక్కులు లేవని, కేవలం షరతులతో కూడిన హక్కులు మాత్రమే ఉన్నాయని పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయవాదుల్లో ఒకరైన దమ్మాలపాటి శ్రీనివాస్ పేర్కొన్నారు. భూ సమీకరణ కింద తీసుకున్న భూములను ఇతరులకు ఇవ్వడానికి వీల్లేదన్నారు. ల్యాండ్ పూలింగ్ స్కీం బాధ్యతలన్నింటినీ పూర్తి చేసిన తరువాతే రాజధాని భూములపై సీఆర్డీఏకు హక్కులు వస్తాయని పిటిషనర్ల తరఫున మరో న్యాయవాది కారుమంచి ఇంద్రనీల్ బాబు వాదించారు. మా నినాదమే.. పేదలందరికీ ఇళ్లు ఈ వాదనలను రాష్ట్ర ప్రభుత్వం, సీఆర్డీఏ, రెవెన్యూ శాఖల తరఫున హాజరైన అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి, కాసా జగన్మోహన్రెడ్డి, పోతిరెడ్డి సుభాష్ తోసిపుచ్చారు. ఏ ప్రభుత్వమైనా ఇళ్ల పట్టాలు ఇచ్చేది ఇళ్లను నిరి్మంచుకోవడానికేనన్నారు. ఇళ్లు నిర్మాణం లేనప్పుడు ఇళ్ల పట్టాలు ఇచ్చి ప్రయోజనం ఏముంటుందన్నారు. ప్రభుత్వ నినాదమే ‘నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు’ అని గుర్తు చేశారు. సుప్రీంకోర్టు సైతం తన ఉత్తర్వుల్లో ఎక్కడా ఇళ్లు నిర్మించవద్దని చెప్పలేదన్నారు. ఈ విషయంలో స్పష్టత కావాలనుకుంటే పిటిషనర్లు సుప్రీంకోర్టుకు వెళ్లవచ్చన్నారు. ఎల్రక్టానిక్ సిటీకి మరో చోట భూమి కేటాయిస్తామన్నారు. రాజధాని ప్రాంతంలో మొత్తం భూమిలో 5 శాతం పేదల ఇళ్ల కోసం కేటాయించాలని సీఆర్డీఏ చట్టం చెబుతోందన్నారు. చట్ట నిబంధనలకు లోబడి చేసే పనిని ఏ కోర్టు కూడా తప్పుబట్టడానికి వీల్లేదన్నారు. రాజధాని కోసం రైతులు మాత్రమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం కూడా 14 వేల ఎకరాలను ఇచ్చిందని రెవిన్యూ శాఖ తరఫు న్యాయవాది సుభాష్ తెలిపారు. అందులో 1,400 ఎకరాలు పేదలకిస్తే పిటిషనర్లు రాద్దాంతం చేస్తున్నారన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తులు జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు, జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్‌రాయ్, జస్టిస్ రవినాథ్ తిల్హరీలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఇళ్ల నిర్మాణంపై తన నిర్ణయాన్ని రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాజధాని ప్రాంతంలో పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించేందుకు వీలుగా చట్ట సవరణ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాన్ని, తదనుగుణంగా జారీ చేసిన జీవోలను సవాలు చేస్తూ పలువురి చేత టీడీపీ పిటిషన్లను దాఖలు చేయించిన విషయం తెలిసిందే. -
అందుకే చైనాతో పదేపదే ఘర్షణలు
సాక్షి, న్యూఢిల్లీ: చైనాతో సరిహద్దు వివాదం ద్వైపాక్షిక చర్చలతోనే పరిష్కారం అవుతుందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు వ్యాఖ్యానించారు. క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనే సత్తా మిలటరీకి ఉందని ఆయన అన్నారు. బుధవారం ఢిల్లీలో మురళీధర్ రావు ’సాక్షి’ తో మాట్లాడుతూ ‘ కాంగ్రెస్ హయాంలో చైనా బలగాలు దేశంలో భూభాగాన్ని ఆక్రమించిన విషయం అందరికీ తెలుసు. గతానికి భిన్నంగా మన మిలటరీ చైనా సైన్యాన్ని గట్టిగా ఎదిరిస్తుంది. దాని కారణంగా చైనాతో పదేపదే ఘర్షణలు జరుగుతున్నాయి. భారీ ఎత్తున చైనా సరిహద్దులో మౌలిక సదుపాయాలు ఏర్పాటు అవుతున్నాయి. (జనరల్ ఆదేశాలతో చైనా దుస్సాహసం) దేశరక్షణ విషయంలో రాజకీయాలకు అతీతంగా అందరూ ఏకతాటిపై నిలబడాలి. వైఎస్సార్ కాంగ్రెస్ సహా అనేక రాజకీయ పార్టీలు చైనా విషయంలో కేంద్రానికి మద్దతు ఇవ్వడం ప్రపంచ దేశాలకు ఒక గట్టి సంకేతాన్ని పంపింది. వాస్తవాధీన రేఖ సరిహద్దు ( (ఎల్ఏసీ) అంశం నిర్థారణ అసాధ్యమైన పనేమీ కాదు. చైనా వస్తువులను బహిష్కరించడం ప్రజల అభిమతం. దేశ స్వావలంబనకు ఇది శుభ పరిణామం. చైనా వస్తువుల బహిష్కరణ అసాధ్యమేమీ కాదు. దీనివల్ల ఆర్థిక వ్యవస్థకు నష్టమేమీ జరగదు’ అని స్పష్టం చేశారు. కాగా గల్వాన్ లోయలో ఈనెల 15న హింసాత్మక ఘటన చెలరేగిన నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. లద్దాఖ్ రీజియన్‌లో వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వెంబడి ఇరు దేశాలు సైనికులను తరలించడంతో సరిహద్దుల్లో ఘర్షణ వాతావరణం కనిపిస్తోంది. (ఆ వార్త అవాస్తవం: చైనా) -
అంబేద్కర్‌ను ఓడించాలని ప్రయత్నిస్తే..
సాక్షి, గుంటూరు : భారత రాజ్యాంగ రూపకర్త బీఆర్ అంబేద్కర్‌ను ఎంపీగా ఓడించాలని అప్పట్లో కాంగ్రెస్ ప్రయత్నిస్తే.. ఆయన్ని గెలిపించటానికి బీజేపీ అండగా నిలిచిందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధరరావు అన్నారు. స్వాతంత్య్రం తర్వాత దళితుల అభ్యున్నతికి బీజేపీ కట్టుబడి ఉంటూ వచ్చిందని తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రిజర్వేషన్ల విషయంలో బీజేపీకి ఎలాంటి వ్యతిరేకత లేదని స్పష్టం చేశారు. దేశ విస్తృత ప్రయోజనాల కోసం పనిచేసే పార్టీ బీజేపీ అన్నారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు.. ప్రాంతాలకు అతీతంగా అంకితభావంతో పనిచేయటం బీజేపీ గొప్పతనంగా పేర్కొన్నారు. అధికారంలో ఉన్నా లేకున్నా దళితులు, గిరిజనుల అభ్యున్నతి కోసం పని చేసే పార్టీ బీజేపీ అన్నారు. రామ జన్మభూమి ఉద్యమం కోసం గ్రామ గ్రామానా శిలాన్యాస్ సేకరణ నుంచి రామ జన్మభూమి ట్రస్టు ఏర్పాటు వరకూ బీజేపీ పాత్ర ఉందన్నారు. రామ జన్మభూమి ట్రస్టులో దళితులు తప్పనిసరిగా ఉండాలని ప్రధాని మోదీ పట్టుబట్టి నియమించారని తెలిపారు. భారత దేశ అభివృద్ధిలో దళితులు లేకుండా ఏమీ జరగదని బీజేపీ గట్టిగా నమ్ముతోందన్నారు. దేశంలో 35 కోట్ల మందికి కనీసం బ్యాంకు అకౌంట్లు కూడా లేకుండా యాభై ఏళ్లు పరిపాలించారని, వారందరికీ జన్ దన్ ఖాతాలు తెరిపించిన చరిత్ర మోదీదేనని చెప్పారు. ఈ 35 కోట్లలో 70 శాతానికిపైగా దళితులు, గిరిజనులే ఉన్నారని తెలిపారు. -
ఎన్నికలు ఎప్పుడైనా 200 సీట్లు ఖాయం!
సాక్షి, బెంగళూరు : రాష్ట్రంలో ఎప్పుడు మధ్యంతర ఎన్నికలు జరిగినా బీజేపీకి 200 సీట్లు రావడం ఖాయమని కర్ణాటక బీజేపీ ఇన్చార్జి మురళీధర్ రావు అన్నారు. చింతామణిలో శనివారం జరిగిన కోలారు ఎంపీ మునిస్వామి అభినందన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయి అభివృద్ధి కుంటుపడిందని విమర్శించారు. రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలను తిరస్కరిస్తే వీరు అక్రమంగా కూటమిగా ఏర్పడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారని మండిపడ్డారు. సీఎం కుమారస్వామి కేంద్ర ప్రభుత్వ నిధులను సద్వినియోగం చేసుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశమంతా తిరిగి బాబు ఓడిపోయారు! కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం అన్నివర్గాల అభ్యున్నతికి పాటుపడుతోందని మురళీధర్ రావు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం చంద్రబాబు.. మోదీని ఓడించడానికి దేశమంతటా తిరిగారు.. కానీ తన అభ్యర్థులనే గెలిపించుకోలేకపోయారని ఎద్దేవా చేశారు. రాబోయే రోజుల్లో ఏపీలో తెలుగుదేశం పార్టీ ఉనికి లేకుండా పోతుందని జోస్యం చెప్పారు. ఇక మాజీ డిప్యూటీ సీఎం అశోక్ మాట్లాడుతూ... చింతామణి మాజీ ఎమ్మెల్యే సుధాకర్ బీజేపీలో చేరితే పార్టీ బలోపేతంతో పాటు తాలుకా అభివృద్ధి జరుగుతుందని అన్నారు. -
‘బలమైన ప్రతిపక్షంగా నిలవాలని భావిస్తున్నాం’
విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుత పరిస్థితులలో మా పార్టీ బలమైన ప్రతిపక్షంగా నిలవాలని భావిస్తున్నామని, ఇప్పటి నుంచి ఆ దిశగా అడుగులేస్తున్నామని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు వ్యాఖ్యానించారు. విజయవాడలో మురళీధర్ రావు విలేకరులతో మాట్లాడుతూ.. పార్టీ సంస్థాగతంగా బలోపేతం చేయాలని అన్ని ప్రాంతాలపై దృష్టి కేంద్రీకరించామని చెప్పారు. దేశ వ్యాప్తంగా బలోపేతం చేసేందుకు చాలా అవకాశాలు ఉన్నాయని అన్నారు. జూలై 6 నుంచి జాతీయ స్థాయిలో కొత్త సభ్యత్వ నమోదు కార్యక్రమం చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. అన్ని రాష్ట్రాల్లో జూలై 30 కల్లా సభ్యత్వ నమోదు పూర్తి చేయాలని అనుకుంటున్నట్లు వెల్లడించారు. ఇప్పుడు ఉన్న దానికన్నా 20 శాతం సభ్యత్వ నమోదు పెంచుకోవాలని చూస్తున్నట్లు చెప్పారు. ఇందుకు తగ్గట్టుగానే టీమ్ ఎంపిక జరుగుతుందని వ్యాఖ్యానించారు. -
‘మమతను చూసి కేసీఆర్ గుణపాఠం నేర్చుకోవాలి’
సాక్షి, హైదరాబాద్: దేశంలోని ప్రతి జిల్లాలో బీజేపీ జెండా ఎగిరిందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు అన్నారు. నిన్న వెలువడిన సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో రాష్ట్రంలో బీజేపీ అనూహ్యంగా నాలుగు ఎంపీ స్థానాలకు గెలుచుకున్న విషయం తెలిసిందే. బీజేపీ అభ్యర్థుల విజయోత్సవ సభను శుక్రవారం హైదరాబాద్‌లోని రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మురళీధర్‌రావు మాట్లాడుతూ.. జీఎస్టీ అమలుపర్చిన ప్రపంచ నాయకుల్లో గెలిచింది కేవలం మోదీనే అని గుర్తుచేశారు. రాజకీయ విశ్లేషకులందరూ బీజేపీపై మానసిక ఒత్తిడి పెట్టారని, మోదీ ముందు కేసీఆర్ పనికిరారని తెలంగాణ ప్రజలు తేల్చారని పేర్కొన్నారు. మోదీని, బీజేపీని విమర్శిస్తే బాగుండదని ఆయన హెచ్చరించారు. మమతను చూసి కేసీఆర్ గుణపాఠం నేర్చుకోవాలని మురళీధర రావు హితవు పలికారు. కేటీఆర్‌కు మాటలు రావడంలేదు.. నరేంద్రమోదీ హఠావో అన్న విపక్షాలకు తెలంగాణ ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. సమావేశంలో లక్షణ్ మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీనే తమకు అంబేద్కర్ అని అన్నారు. తెలంగాణ దాటితే టీఆర్ఎస్ చెల్లని రూపాయని ఆయన ఎద్దేవా చేశారు. ఫలితాలు చూసిన తరువాత కేటీఆర్‌కు మాటలు రావడంలేదని, రైతులు కవితను సాగనంపారని పేర్కొన్నారు. తెలంగాణలో చరిత్ర సృష్టించారని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా తమను అభినందించినట్లు లక్ష్మణ్ తెలిపారు. నియంత పాలన సాగదు: సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి రాష్ట్రంలోని ముఖ్యమైన స్థానాల్లో బీజేపీ గెలిచింది. టీఆర్ఎస్ అహంకార వైఖరిని ప్రజలు వ్యతిరేకించారు. అక్రమ కేసుల ద్వారా ప్రజాసంఘాల నాయకులను కేసీఆర్ బయపెట్టాలని చూస్తున్నారు. కేసీఆర్ మజ్లీస్ పార్టీని నమ్ముకున్నారు. అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం ప్రకారం నియంత పాలన సాగదు. నా విజయానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. బొందుగాళ్లకు స్థానం లేదు: కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ తెలంగాణ బీజేపీ కార్యకర్తలందరికీ శిరస్సువంచి నమస్కరిస్తున్నా. ఏ గ్రామానికి వెళ్లినా టీఆర్ఎస్ అహంకారం గురించే మాట్లాడుతున్నారు. ప్రజలకి కేంద్ర పథకాలు తప్ప రాష్ట్ర పథకాలు ఒక్కటీ కూడా అందడం లేదు. టిఆర్ఎస్కి సెంటిమెంట్ అయిన కరీంనగర్లో ప్రజలు బీజేపీకే పట్టాం కట్టారు. తెలంగాణలో హిందువులకు తప్ప, బొందుగాళ్లకు స్థానం లేదని ప్రజలు తేల్చారు. -
మోదీని ఓడించేందుకు రాహుల్ పాకిస్తాన్‌తో..
హైదరాబాద్: రాబోయే రోజుల్లో కేసీఆర్ అంచనాలు తారుమారు అవుతాయని, రేపు అమిత్ షా పర్యటనలో అన్నింటికీ సమాధానం ఇస్తారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లో మురళీధర్ రావు విలేకరులతో మాట్లాడుతూ.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ఈ ఎన్నికల్లో ఓడిచేందుకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పాకిస్తాన్‌తో కూడా కలుస్తారని విమర్శించారు. టీఆర్ఎస్ను ఓడించాలని కాంగ్రెస్‌కు ఓటేయవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. టీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం ఈ మూడు పార్టీలూ ఒక తాను ముక్కలేనని వ్యాక్యానించారు. కాంగ్రెస్ పార్టీ ఈ నాలుగేళ్లలో ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో ఓటమిపాలైంది..దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా ఓటమి పాలైన కాంగ్రెస్ ఇప్పుడు ఎలా గెలుస్తుందని ప్రశ్నించారు. ఉత్తమ్ చెవులు ఇక్కడ పెట్టి వినాలని ఎద్దేవా చేశారు. రాబోయే అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ గెలువదని జోస్యం చెప్పారు. అధికారంలో లేకపోతే కాంగ్రెస్ మావోయిస్టులతో కలుస్తారా అని ప్రశ్నించారు. అధికార దాహంతో ఎవరితోనైనా కాంగ్రెస్ కలుస్తుందని విమర్శించారు. విరసం నేత వరవరరావును ఎన్ని సార్లు కాంగ్రెస్ పార్టీ అరెస్ట్ చేయించిందో కాంగ్రెస్ గుర్తు చేసుకోవాలని సూచించారు. తెలంగాణాకు మోదీ అన్ని విధాలుగా సాయం చేస్తున్నారు..చేస్తారని తెలిపారు. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చేందుకు టీఆర్ఎస్కు ప్రజలు పట్టం కట్టారు కానీ ఈ నాలుగేళ్లుగా అనేక హామీలు కేసీఆర్ విస్మరించారని అన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కేసీఆర్ పూర్తిగా విఫలమయ్యారు. అసలు ఎందుకు ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నారు..ఇంత ఖర్చు ఎందుకు అనే ప్రధాన ప్రశ్నకు కేసీఆర్ సమాధానం చెప్పడం లేదని వ్యాఖ్యానించారు. మూడెకరాల భూమి,అంబెడ్కర్ విగ్రహం, మాదిగ భవన్ అన్నారు అవి ఎక్కడా ఏర్పాటు చేయలేదని వెల్లడించారు. ఇసుక మాఫియాతో ప్రభుత్వం నడుస్తోందని మండిపడ్డారు. 10 శాతం మంది ఎస్టీలు ఉంటే వారికి 12 శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి మోసపూరిత మాటలను చెప్పారని మండిపడ్డారు. రైతు ఆత్మహత్యలపై లెక్కలు తారుమారు చేస్తున్నారు...కేంద్రం వ్యవసాయంపైన అనేక పథకాలు పెడితే అమలు చేయడం లేదని విమర్శించారు. ఉద్యోగాల విషయంలో ఇప్పటి వరకు టీఆర్ఎస్కు క్లారిటీ లేదని, రెండు లక్షల ఉద్యోగాలు అన్నారు కానీ 37 వేల ఉద్యోగాలే ఇచ్చారని తెలిపారు. -
కర్ణాటకలో బీజేపీదే విజయం!!
కర్ణాటకలో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాకుండా హంగ్ రానుందా? అదే జరిగితే బీజేపీ జేడీఎస్‌తో జట్టు కట్టనుందా? అందుకే దేవెగౌడపై ప్రధాని నరేంద్రమోడీ సానుకూల వ్యాఖ్యలు చేశారా? కాంగ్రెస్‌కు సిద్ధరామయ్య బలమైతే.. బీజేపీకి యడ్యూరప్పే బలహీనంగా మారారా? అసలు బీజేపీ ఎన్ని స్థానాల్లో గెలవబోతోంది? అనే అంశాలపై భారతీయ జనతాపార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి,కర్ణాటక పార్టీ ఇన్చార్జ్, ఎన్నికల ఇన్చార్జ్ మురళీ ధర్‌రావు ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వూ్య సారాంశం. కన్నడ రాజకీయం వేడెక్కినట్లుంది? మీ పార్టీ పరిస్థితి ఎలా ఉంది? ఫలితాలపై మీ అంచనా ఏమిటి? బీజేపీ గ్రాఫ్ చాలా బాగుంది. పార్టీలోని అన్ని మోర్చాలతో పాటు సంస్థాగతంగా, కార్యక్రమాల పరంగా, సభలు, మేనిఫెస్టో అన్నీ బేరీజు వేస్తే కాంగ్రెస్‌ను బీజేపీ వెనకేసింది. రాష్ట్రంలోని 224 నియోజకవర్గాల్లో ఇప్పటికే రెండు పర్యాయాలు యడ్యూరప్ప తిరిగారు. అద్భుతమైన ర్యాలీలు చేశాం. ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. నరేంద్ర మోదీ సభల స్పందన బాగుంది. అమిత్‌షా పర్యటనలు సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేశాయి. 55వేల బూత్‌కమిటీలు వేశాం. కాల్‌సెంటర్ల ద్వారా రోజూ రిపోర్ట్ చేస్తున్నాం. ప్రతీ బూత్‌కమిటీలో 10–15మంది సభ్యులు ఉన్నారు. కాంగ్రెస్ అన్ని రంగాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. సిద్ధరామయ్య తన పాలనలో అన్ని వర్గాలను సంతృప్తి పరచలేకపోయారు. రాహుల్‌గాంధీ ప్రచారపర్వంలో కర్నాటక ప్రజలను ఆకర్షించలేకపోయారు. కచ్చితంగా మేం గెలవబోతున్నాం. కర్ణాటకలో హంగ్ తప్పదా? దేవెగౌడపై మోదీ వ్యాఖ్యలను జేడీఎస్‌ను దగ్గర చేర్చుకునే ప్రయత్నమే అనుకోవచ్చా? జేడీఎస్,కాంగ్రెస్‌లు వారి స్వలాభం కోసం ఇలాంటి ప్రచారానికి తెరలేపారు. కర్ణాటకలో హంగ్ వచ్చే ప్రసక్తే లేదు. ప్రజలు అలాంటి తీర్పు ఇవ్వరు. ఓటమికి భయపడి హంగ్ గురించి మాట్లాడుతున్నారు. బీజేపీకి స్పష్టమైన మెజార్టీ వస్తుంది. వ్యక్తిగత దూషణలకు దిగకుండా పెద్దవారిని గౌరవించాలనేది మాపార్టీ సంస్కృతి. మాజీ ప్రధానికి గౌరవం ఇవ్వాలనే దేవెగౌడపై ఈ తరహా వ్యాఖ్యలు చేశారు. రాజకీయంగా, సిద్ధాంతాల పరంగా, ఎన్నికల పరంగా జేడీఎస్ మాకు ప్రత్యర్థే. ఎన్ని స్థానాల్లో గెలుస్తామని భావిస్తున్నారు? కాంగ్రెస్‌కు సిద్ధరామయ్యే బలం కాగా, బీజేపీకి యడ్యూరప్పే బలహీనంగా మారారు అంటున్నారు. అది పార్టీకి మైనస్ కాదా? 150 సీట్లు మా లక్ష్యం! ఈ నెల 12వ తేదీ వరకూ మేం విజయం కోసం పరుగెడుతూనే ఉంటాం. రోజూ లక్ష్యాలను నిర్దేశించుకుంటున్నాం. 400 సభలు నిర్వహిస్తున్నాం. యడ్యూరప్ప ఒక్కరే 100 సభలు నిర్వహిస్తున్నారు. కర్ణాటకలో బలమైన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే యడ్యూరప్ప ఒక్కరే! బెంగళూరు నుంచి కోలార్ వరకూ ఎక్కడికి వెళ్లినా 15–20 వేలమంది యడ్యూరప్ప సభలకు వస్తారు. గెలవలేననే భయంతోనే సిద్ధరామయ్య రెండుసీట్లలో పోటీ చేస్తున్నారు. చాముండేశ్వరి, బాదామిలో ఓడిపోతున్నారు. బాదామీలో శ్రీరాములు వందశాతం గెలవబోతున్నారు. యడ్యూరప్ప నాయకత్వాన్ని కొందరు కీలక నేతలు తీవ్రంగా వ్యతి రేకిస్తున్నారు? ఇది ప్రతికూలం కాదా? అన్నీ సమసిపోయాయి. యడ్యూరప్ప బలమైన నాయకుడు. ప్రజల కోసం పోరాటం చేసిన వ్యక్తి! సిద్ధాంతం కోసం పని చేశారు. కొన్ని చేదు ఘటనలను నేతలు,కార్యకర్తలు మరిచిపోయారు. యడ్యూరప్ప మా నాయకుడు అని నేతలతో పాటు కార్యకర్తలు భావిస్తున్నారు. అంతర్గతంగా చిన్నచిన్న సమస్యలు సహజం. అసంతృప్తులను బుజ్జగించాం. అంతర్గత వివాదాలను పరిష్కరించుకోవడంలో మా పార్టీకి ఉన్నంత సామర్థ్యం మరేపార్టీకి లేదు. ఎన్నికల తర్వాత శ్రీరాములు కూడా సీఎం అభ్యర్థి కావొచ్చు! అనే ప్రచారం జరుగుతోంది? అందులో వాస్తవం ఏంత? సీఎం సీటు ఖాళీ లేదు. యడ్యూరప్పే మా సీఎం అభ్యర్థి! ఇలాంటి వార్తల్లో వాస్తవం లేదు. అయితే శ్రీరాములు బలమైన గిరిజన నాయకుడు. విశేష ప్రజాధారణ ఉన్న నేత! యడ్యూరప్ప తర్వాత అన్ని సభలు నిర్వహిస్తున్న నాయకుడు. జాతీయస్థాయిలో మాకు కీలక నేత! రాబోయే రోజుల్లో శ్రీరాములు పార్టీకి బలమైన నేతగా మారతాడు. సేవ చేస్తాడు. కర్నాటకలో ఓడిపోతే దక్షిణాన మీకు మనుగడ ఉండదని అనుకోవచ్చా? దక్షిణభారతదేశానికి ముఖద్వారమైన కర్నాకటలో కచ్చితంగా గెలవబోతున్నాం. మా గెలుపు దక్షిణాది రాష్ట్రాలలో పార్టీ బలోపేతమయ్యేందుకు పూర్తిగా లాభించనుంది. బీజేపీని ఓడించండని టీడీపీ నేతలు ప్రచారం చేస్తున్నారు? తెలుగు ప్రభావిత రాష్ట్రాల్లో ఈ తరహా ప్రచారం ఏ మేరకు ప్రభావం చూపే అవకాశం ఉంది? చంద్రబాబు తన జీవితంలో చేసిన ఘోర తప్పిదం ఇదే! తన పరి మితులు దాటి రాజకీయాలు చేస్తున్నారు. ఇది ఆంధ్ర ప్రజలకు తీవ్ర నష్టాన్ని చేకూర్చుతుంది. తెలుగు ప్రజలు ఏళ్లుగా ఇక్కడ ఉన్నారు. కర్నాటకలో పరిస్థితులు తెలుసుకుని తెలుగు ప్రజలు ఓటేస్తారు. చంద్రబాబు మాట ఎవ్వరూ వినరు. ఏపీలోని పరిస్థితులను ముడిపెట్టి చంద్రబాబు రాజకీయంగా లబ్ది పొందాలనుకుంటున్నారు. అది నెరవేరదు. – సాక్షి ప్రత్యేక ప్రతినిధి, బెంగళూరు -
శశికళకు మద్దతుగా ఎమ్మెల్యేల తీర్మానం
-
శశికళకు మద్దతుగా ఎమ్మెల్యేల తీర్మానం
సాక్షి ప్రతినిధి, చెన్నై: అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా శశికళను ఎన్నుకోవాలని ఏకగ్రీవంగా తీర్మానించినట్లు తమిళనాడు సీఎం పన్నీర్‌సెల్వం శనివారం తెలిపారు. పార్టీ కార్యాలయంలో 135 మంది ఎమ్మెల్యేలతో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు తీర్మానాన్ని ఆమోదించారు. మాజీ మంత్రి వలర్మతి నేతృత్వంలో శశికళకు మద్దతుగా శనివారం మరో తీర్మానాన్ని ఆమోదించారు. శశికళతో నటి విజయశాంతి భేటీ నటి విజయశాంతి శనివారం చెన్నైలోని పోయెస్‌గార్డెన్ లో శశికళను కలుసుకున్నారు. అరగంటసేపు ఇద్దరూ మాట్లాడుకున్నారు. తర్వాత జయలలిత సమాధి వద్దకు వెళ్లి జయకు విజయశాంతి నివాళులర్పించారు. పొత్తుకోసం బీజేపీ చర్చలు: మురళీధరరావు అన్నాడీఎంకేతో పొత్తుకోసం చర్చలు జరుగుతున్నట్లు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధరరావు శుక్రవారం కేరళలో జరిగిన ఒక సభలో వెల్లడించారు. కాగా, అన్నాడీఎంకేను చీల్చే ఆలోచన బీజేపీకి లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు సౌందరరాజన్ స్పష్టంచేశారు. -
కెప్టెన్ కింగ్
డీఎండీకే అధినేత విజయకాంత్ గొడుగు నీడన ఎన్నికల్ని ఎదుర్కొనేందుకు కమలనాథులు సన్నద్ధం అవుతున్నారు.కెప్టెన్‌ను కింగ్ చేయడానికి రెడీ అంటూ ఆ పార్టీ జాతీయ కార్యదర్శి మురళీధరరావు వ్యాఖ్యానించి ఉన్నారు. ఇక ప్రజా కూటమి విజయకాంత్‌ను సీఎం అభ్యర్థిగా ప్రకటించే విషయాన్ని పరిశీలనలో ఉంచింది. సాక్షి, చెన్నై: రాష్ట్రంలో ఎన్నికల రాజకీయం డీఎండీకే అధినేత విజయకాంత్ చుట్టూ సాగుతున్న విషయం తెలిసిందే. ఆయన్ను తమ వైపు తిప్పుకునే యత్నం చేసి డీఎంకే దాదాపుగా విరమించుకుందని చెప్పవచ్చు. బీజేపీ, ప్రజా కూటమి ఇంకా ఆశతో ఎదురు చూస్తున్నాయి. అయితే ఒకరి గొడుగు నీడన తాను నిలబడడం కన్నా, తన గొడుగు నీడన ఇతరులు రావాలన్న కాంక్షతో విజయకాంత్ వ్యూహ రచనల్లో ముని ఉన్నారు. ఇందుకు అద్దం పట్టే విధంగా తాను ‘కింగ్’ కావాలో, లేదా కింగ్ మేకర్ కావాలో కార్యకర్తల అభీష్టానికి వదిలి వేస్తున్నట్టుగా కాంచీపురం మహానాడులో విజయకాంత్ ప్రకటించారు. తన ఎన్నికల మేనిఫెస్టోలో కొంత భాగా న్ని ప్రకటించేశారు. తాను సీఎం కావాలన్న కాంక్ష విజయకాంత్‌లో పెరిగి ఉండడాన్ని బీజేపీ, ప్రజా కూటములు పరిగణనలోకి తీసుకునే పనిలో పడ్డాయి. విజయకాంత్‌తో దోస్తీ కట్టని పక్షంలో ఒంటరిగా మిగులుతామన్న ఆందోళనలో ఉన్న కమలనాథులు ఆయన్ను కింగ్‌గా చూడడానికి సిద్ధం అయ్యారు. విజయకాంత్ సీఎం అభ్యర్థిగా ప్రకటించేం దుకు తగ్గ కూటమికి బీజేపీ సిద్ధం అవుతున్నది. ఇందుకు తగ్గట్టుగా ఆ పార్టీ జాతీయ కార్యదర్శి మురళీధరరావు స్పందిం చడం గమనార్హం. విజయకాంత్‌ను కింగ్‌ను చేయడానికి తాము సిద్ధం అని వ్యాఖ్యానించి ఉండడం ఆలోచించాల్సిందే. విజయకాంత్‌ను కింగ్ గా చూడడానికి బీజేపీ సిద్ధం కావడంతో, ఆయన మద్దతు కోసం తీవ్ర కుస్తీలు పడుతున్న ప్రజా కూటమి పరిశీలనలో పడింది. ప్రజా కూటమిలోని ఎండీఎంకే, వామపక్షాలు, వీసీ కే వర్గాలు విజయకాంత్ వ్యూహాల్ని పరిశీలిస్తూ, అందుకు తగ్గట్టుగా అడుగులు వేయడానికి సిద్ధం అవుతున్నారు. విజయకాంత్‌ను కింగ్ చేయడానికి తామూ సిద్ధం అని, అయితే ఆయన ప్రజా కూటమిలోకి రావాల్సి ఉంటుందని వీసీకే నేత తిరుమావళవన్ వ్యాఖ్యానించడం గమనార్హం. తన వ్యూహాలకు పదును పెట్టి విజయకాంత్ కింగ్‌గా అవతరించే యత్నం చేస్తారా? లేదా, అధికారాన్ని శాసించే దిశగా కింగ్ మేకర్ అయ్యే మార్గాన్ని ఎంచుకుని డీఎంకే వైపు అడుగులు వేస్తారా? అన్నది వేచి చూడాల్సిందే. -
తెలంగాణలో బీజేపీయే ప్రత్యామ్నాయం
హైదరాబాద్ : తెలంగాణలో బీజేపీయే ప్రత్యామ్నాయమని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధరరావు అన్నారు. వచ్చే ఎన్నికల నాటికి అధికారంలోకి రావడమే తమ లక్ష్యమని ఆయన శనివారమిక్కడ వ్యాఖ్యానించారు. తెలంగాణలో బీజేపీ బలోపేతానికి కృషి చేస్తామన్నారు. ఇక టీడీపీ నుంచి ఎవరు వెళ్లిపోయినా తమకు సంబంధం లేదని మురళీధరరావు అన్నారు. టీడీపీ బస్సు యాత్ర ఆ పార్టీ ఇష్టమన్నారు. మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల్లో బీజేపీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆయన జోస్యం చెప్పారు. -
ప్రతికూల ఫలితాలు వాస్తవమే...
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా జరిగిన ఉపఎన్నికల్లో తమకు ప్రతికూల ఫలితాలు వచ్చిమాట వాస్తమేనని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు అంగీకరించారు. తాము ముందంజలో ఉన్నచోట కూడా గెలుపు దూరమైందని ఆయన మంగళవారమిక్కడ అన్నారు. ఈ గెలుపు ఓటములు స్థానిక పరిస్థితులను బట్టే ఉంటాయన్నమురళీధరరావు అభిప్రాయపడ్డారు. కేంద్ర ప్రభుత్వం మాత్రం చాలా పటిష్టంగానే ఉందని ఆయన తెలిపారు. కాగా తెలంగాణలోని మెదక్ లోక్ సభ ఉప ఎన్నికల్లో బీజేపీ కేవలం మూడో స్థానానికే పరిమితం అయ్యింది. -
టి.బిల్లులో ఉన్నట్లుగానే పోలవరంపై నిర్ణయం
హైదరాబాద్:పోలవరం ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలుపుతూ పార్లమెంట్లో ఆంధ్రప్రదేశ్ పునర్విజన బిల్లులో చేసిన సవరణల ఆమోదానికి సంబంధించి తెలంగాణ వాదులు నిరసనం తెలపడం ఎంతమాత్ర సబబు కాదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధరరావు సూచించారు. తెలంగాణ బిల్లులో ఉన్నట్లుగానే పోలవరంపై నిర్ణయం తీసుకున్నామని ఆయన స్పష్టం చేశారు. పోలవరం ఆర్డినెన్స్ పై కొన్ని పార్టీలు వ్యతిరేకించడంపై శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. ఆ పార్టీలు రెండు నాల్కల ధోరణితో వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. తెలంగాణపై కేంద్రం సవతి తల్లి ప్రేమ అంటూ వ్యాఖ్యానించడం రాజకీయ ఆరోపణ మాత్రమేనని ఈ సందర్భంగా తెలిపారు. ఎయిమ్స్ పై నిర్ధిష్ట హామీ రాకపోవడానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రతిపాదన రాకపోవడమేనన్నారు.