
బీజేపీ జాతీయ కార్యదర్శి మురళీధర్ రావు(పాత చిత్రం)
విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుత పరిస్థితులలో మా పార్టీ బలమైన ప్రతిపక్షంగా నిలవాలని భావిస్తున్నామని, ఇప్పటి నుంచి ఆ దిశగా అడుగులేస్తున్నామని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు వ్యాఖ్యానించారు. విజయవాడలో మురళీధర్ రావు విలేకరులతో మాట్లాడుతూ.. పార్టీ సంస్థాగతంగా బలోపేతం చేయాలని అన్ని ప్రాంతాలపై దృష్టి కేంద్రీకరించామని చెప్పారు. దేశ వ్యాప్తంగా బలోపేతం చేసేందుకు చాలా అవకాశాలు ఉన్నాయని అన్నారు.
జూలై 6 నుంచి జాతీయ స్థాయిలో కొత్త సభ్యత్వ నమోదు కార్యక్రమం చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. అన్ని రాష్ట్రాల్లో జూలై 30 కల్లా సభ్యత్వ నమోదు పూర్తి చేయాలని అనుకుంటున్నట్లు వెల్లడించారు. ఇప్పుడు ఉన్న దానికన్నా 20 శాతం సభ్యత్వ నమోదు పెంచుకోవాలని చూస్తున్నట్లు చెప్పారు. ఇందుకు తగ్గట్టుగానే టీమ్ ఎంపిక జరుగుతుందని వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment