హైదరాబాద్ : తెలంగాణలో బీజేపీయే ప్రత్యామ్నాయమని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధరరావు అన్నారు. వచ్చే ఎన్నికల నాటికి అధికారంలోకి రావడమే తమ లక్ష్యమని ఆయన శనివారమిక్కడ వ్యాఖ్యానించారు. తెలంగాణలో బీజేపీ బలోపేతానికి కృషి చేస్తామన్నారు. ఇక టీడీపీ నుంచి ఎవరు వెళ్లిపోయినా తమకు సంబంధం లేదని మురళీధరరావు అన్నారు. టీడీపీ బస్సు యాత్ర ఆ పార్టీ ఇష్టమన్నారు. మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల్లో బీజేపీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆయన జోస్యం చెప్పారు.
తెలంగాణలో బీజేపీయే ప్రత్యామ్నాయం
Published Sat, Oct 11 2014 1:14 PM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM
Advertisement
Advertisement