దేశవ్యాప్తంగా జరిగిన ఉపఎన్నికల్లో తమకు ప్రతికూల ఫలితాలు వచ్చిమాట వాస్తమేనని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు అంగీకరించారు.
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా జరిగిన ఉపఎన్నికల్లో తమకు ప్రతికూల ఫలితాలు వచ్చిమాట వాస్తమేనని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు అంగీకరించారు. తాము ముందంజలో ఉన్నచోట కూడా గెలుపు దూరమైందని ఆయన మంగళవారమిక్కడ అన్నారు. ఈ గెలుపు ఓటములు స్థానిక పరిస్థితులను బట్టే ఉంటాయన్నమురళీధరరావు అభిప్రాయపడ్డారు. కేంద్ర ప్రభుత్వం మాత్రం చాలా పటిష్టంగానే ఉందని ఆయన తెలిపారు. కాగా తెలంగాణలోని మెదక్ లోక్ సభ ఉప ఎన్నికల్లో బీజేపీ కేవలం మూడో స్థానానికే పరిమితం అయ్యింది.