కోవిడ్ నేపథ్యంలో దుబ్బాక ఉప ఎన్నిక సందర్భంగా భారత ఎన్నికల సంఘం కొత్త ఎన్నికల నియమావళిని విడుదల చేసింది. జాతీయ ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖతో పాటు రాజకీయ పార్టీల సూచనలు, సలహాలను పరిగణలోకి తీసుకొని కొత్త నిబంధనలను విడుదల చేసింది. ఈ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని లేకపోతే చర్యలు తప్పవని దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నిక రిటర్నింగ్ అధికారి చెన్నయ్య సూచించారు. ఆయన సోమవారం ఎన్నికలు, ప్రచారం తదితర నిబంధనలు, కొత్త మార్గదర్శకాలను సమగ్రంగా ‘సాక్షి’కి వివరించారు.
సాక్షి, దుబ్బాక: ఎన్నికలకు సంబంధించిన కార్యకలాపాల్లో ప్రతివ్యక్తి ముఖానికి మాస్కు ధరించాలి. ఎన్నికల అవసరాలకు ఉపయోగించే హాలు, ప్రాంగణాల వద్ద థర్మల్ స్క్రీనింగ్, శానిటైజర్, సబ్బు, నీరు తప్పక అందుబాటులో ఉంచాలి. సాధ్యమైనంత వరకు సామాజిక దూరం నిబంధనలు అనుసరించడానికి వీలుగా పెద్ద హాల్స్‌ను గుర్తించి వాటిని ఉపయోగించాలి. నామినేషన్ పత్రాల దాఖలు, పరిశీలన, ఎన్నికల గుర్తులు కేటాయింపు వంటి ప్రక్రియలకు సామాజిక దూర నిబంధనలు పాటిస్తూ రిటర్నింగ్ అధికారి తన చాంబర్‌ను విశాలంగా ఉండేలా చూసుకోవాలి. పోలింగ్ సిబ్బంది, భద్రతా సిబ్బందిని తరలించడానికి వీలుగా వాహనాలు సమకూర్చుకోవాలి. ఈవీఎం, వీవీ ప్యాట్‌ల ఎంపిక ప్రక్రియ పెద్ద హాళ్లలోనే నిర్వహించాలి. ఆ సమయంలో చేతులకు గ్లవ్స్ అందుబాటులో ఉంచాలి.
రాజకీయ పార్టీలు, పోటీలో ఉన్న అభ్యర్థులకు..
- రోడ్ షోలలో ఇప్పటి వరకు 10 వాహనాలకు అనుమతి ఉండగా, ప్రస్తుతం 5 వాహనాల కాన్వాయ్‌తోనే రోడ్ షోలు నిర్వహించుకోవాలి.
- సామాజిక దూరం పాటిస్తూ ఎన్నికల ప్రక్రియ నిర్వహణలో ఫేస్ మాస్కులు, శానిటైజర్, పీపీఈ కిట్లు వినియోగించుకోవాలి.
- ఎన్నికల అవసరాల కోసం ఉపయోగించే గది, ప్రాంగణాల వద్ద శానిటైజర్స్, సబ్బులు, నీరు అందుబాటులో ఉంచాలి.
- కోవిడ్ – 19 మార్గదర్శకాలు అననుసరించి సభలు, ర్యాలీలు నిర్వహించుకోవాలి.
- జిల్లా ఎన్నికల అధికారి సూచనల మేరకు బహిరంగ సభలకు అనుమతి తీసుకోవాలి. ఇందుకోసం ముందుగానే అధికారులకు బహిరంగ ప్రదేశం(మైదానం)తో పాటు ప్రాంగణం ప్రవేశం, నిష్క్రమణ పాయింట్లను చూపించాలి. సభకు వచ్చే వారి సంఖ్యను అధికారులకు ముందుగానే తెలియజేయాలి.
- ఎన్నికల కమిషన్ సూచించినట్లుగా సువిధ యాప్‌ను ఉపయోగించి బహిరంగ సభలకు స్థలాల అనుమతి తీసుకోవాలి.
- పోలింగ్ కేంద్రాలకు అభ్యర్థులు సెల్‌ఫోన్లు తీసుకెళ్లరాదు, కేంద్రాల్లో ఫొటోలు తీయరాదు.
నామినేషన్ల సమయంలో ఇలా..
- అభ్యర్థి నామినేషన్ సమరి్పంచే సమయంలో రిటర్నింగ్ కార్యాలయానికి అభ్యర్థి వెంట ఇద్దరికి, రెండు వాహనాలకు మాత్రమే అనుమతి.
- పోటీ చేసే అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తును పూర్తిచేసి ప్రింట్ తీసుకోవచ్చు. నామినేషన్ ఫాం, అఫిడవిట్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి అందించాలి.
- అభ్యర్థులు డిపాజిట్ మొత్తాన్ని సంబంధిత ప్లాట్ ఫాంలో ఆన్‌లైన్ డిపాజిట్ చేయవచ్చు. ట్రెజరీలో కూడా నగదు డిపాజిట్ చేయవచ్చు.
- ఇంటింటి ప్రచారంలో అభ్యర్థితో పాటు ఐదుగురికి మాత్రమే అనుమతి ఉండగా భద్రతా సిబ్బందికి మాత్రం మినహాయింపు ఉంటుంది.
వీళ్లకు పోస్టల్ బ్యాలెట్
ఇప్పటి వరకు ప్రభుత్వ ఉద్యోగులు, ఎన్నికల సిబ్బందికి మాత్రమే ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసే అవకాశం ఉండేది. ఈ ఎన్నికల్లో దివ్యాంగులు, 80 ఏళ్లుపైబడిన వారికి, అత్యవసర రంగంలో ఉన్న సిబ్బంది, కోవిడ్ సోకిన, అనుమానిత, క్వారంటైన్‌లో ఉన్న ఓటర్లు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకోవచ్చు.
నియామకాలు మరిచిన ప్రభుత్వం: రఘునందన్‌రావు
సాక్షి, దౌల్తాబాద్ (దుబ్బాక): కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో యువతకు తీవ్ర అన్యాయం జరుగుతుందని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి రఘునందన్‌రావు పేర్కొన్నారు. ఉద్యమంలో ముందుండి పోరాడిన యువతను నిరుద్యోగులుగా మార్చిన ఘనత టీఆర్‌ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందని ఎద్దేవా చేశారు. ఆరేళ్ల పాలనలో దుబ్బాకకు జరిగిన అభివృద్ధి ఏమీలేదన్నారు. సిద్దపేట, గజ్వేల్‌లలో జరిగిన అభివృద్ధి దుబ్బాకలో ఎందుకు జరగడం లేదని ప్రశ్నించారు. కేంద్ర నిధుల వల్లనే గ్రామాల్లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు.
ప్రజాస్వామ్య దేశంలో ఓటు అడిగే హక్కు ప్రతి పారీ్టకి ఉందని, బీజేపీకి ఓటు వేస్తే పథకాలు ఆగిపోతాయని ప్రచారం చేయడం మంచి పద్ధతి కాదని హితువు పలికారు. ఈ సందర్భంగా ముబరాస్‌పూర్ వార్డు సభ్యుడు కోట శ్రీనివాస్ తో పాటు పలు గ్రామాలకు చెందిన యువత రఘునందన్ సమక్షంలో పారీ్టలో చేరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి కౌకూరి యాదగిరి, మండల అధ్యక్షుడు పోతురాజు కిషన్, మండల కార్యదర్శి లక్ష్మణ్, నాయకులు రాజగోపాల్, భిక్షపతి, రమే‹Ù, స్వామిగౌడ్, కనకరాజు, రాజు, స్వామి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment