ఎన్నికల సిబ్బంది
సాక్షి, సిద్దిపేట: రాజకీయంగా తీవ్ర వేడిని పుట్టించి... కాకరేపిన దుబ్బాక ఉప ఎన్నికలో మంగళ వారం ఓటరు తీర్పు నిక్షిప్తం కానుంది. పోలింగ్ సరళి ఎలా ఉం టుంది, ఎంతశాతం ఓటింగ్ జరుగుతుందనేది అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది. పోలింగ్ శాతం ఎంతుంటే ఎవరికి లాభమని పార్టీలు లెక్కలేసుకుంటున్నాయి. కరోనా భయం పూర్తిగా వీడనం దున ఎంతమంది ఓటర్లు పోలింగ్ స్టేషన్లకు వస్తార నేది చూడాలి. 23 మంది బరిలో ఉన్నా.. ప్రధాన రాజకీయ పార్టీలైన టీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్యే పోటీ ఉంది. ఇంటింటి ప్రచారంలో ప్రతీ ఓటరును నేరుగా కలిసి, ఫోన్లు చేసి తమ పార్టీకి ఓటు వేయాలని అభ్య ర్థించారు. రాజ కీయ పార్టీలు ఈ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో పోలింగ్ శాతం గతంలో కన్నా పెరిగే అవ కాశముందని భావిస్తున్నారు. పోటాపోటీగా ఓటర్లను పోలింగ్ బూత్‌లకు తరలించేందుకు పార్టీలు ప్రయత్నిస్తాయి. అయితే కరోనా భయం పూర్తిస్థాయిలో వీడలేదు కాబట్టి పోలింగ్ శాతం తగ్గుతుందా? అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. 2018లో జరిగిన ఎన్నికల్లో నియోజకవర్గంలో మొత్తం 1,90,483 మంది ఓటర్లు ఉండగా 1,63,658 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. 85.92% ఓటింగ్ నమోదైంది. ఈసారి 1,98,807 మంది ఓటర్లు ఉండగా ఏ మేరకు పోలింగ్ నమోదవుతుందో వేచి చూడాలి. మొత్తం ఏడు మండలాల్లోని 148 గ్రామాల్లో 315 పోలింగ్ స్టేషన్లలో ఎన్నికలు జరగనున్నాయి.
ఎవరి లెక్క వారిది...
దుబ్బాక నియోజకవర్గంలో దుబ్బాక, మిరుదొడ్డి, తొగుట, రాయపోలు, దౌల్తాబాద్, నార్సింగి, చేగుంట మండలాల పరిధిలో ఇప్పటివరకు 78,187 మంది రైతులు రైతుబంధు, 52,823 మంది వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, నేత, గీత, బీడీ కార్మికులకు ఆసరా పెన్షన్లు పొందుతున్నారు. 5,599 మందికి కల్యాణలక్ష్మి, 322 మందికి షాదీ ముబారక్ చెక్కులతోపాటు, 30,732 మందికి కేసీఆర్ కిట్స్ అందజేశారు. ఇలా నియోజకవర్గంలో 1,67,663 మందికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు నేరుగా అందాయని, వీరందరి ఓట్లు తమకే పడతాయనే ధీమాతో అధికార టీఆర్‌ఎస్ పార్టీ ఉంది. నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో ఏ కులం వారివి ఎన్ని ఓట్లు ఉన్నాయి అనే అంచనాలు వేశారు. అత్యధికంగా ముదిరాజులు 41,214 మంది, గొల్ల కురుమలు 16,190, గీత కార్మికులు 22,512, మాదిగ 23 వేల మంది, 11 వేల మంది మాల, 13 వేల మంది చేనేత కార్మికులు, 7 వేల మంది రజకులు, 6వేల మంది మున్నూరు కాపులు, 10,012 మంది రెడ్లు ఉన్నారు. ముస్లిం, దూదేకుల, బ్రాహ్మణ, వెలమ, బుడిగ జంగాలు, క్రిస్టియన్ మైనార్టీలు, లంబాడీలు కూడా ఉన్నారు. సామాజికవర్గాల వారీగా ఓటర్లను ఆకట్టుకునేందుకు అన్ని పార్టీల నాయకులు ప్రయత్నాలు చేశారు. కుల సంఘాలకు భవనాలు, ఇతర హామీలిచ్చారు.
యువత ఓట్లు కీలకం
యువత ఎటువైపు ఓటు వేస్తుందో అనేది అంతుపట్టకుండా ఉంది. నియోజకవర్గంలో మొత్తం ఓటర్లలో 25 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవారు 30 వేలకు పైగా ఉన్నారు. వీరిపై ఆశలు పెట్టుకున్న ప్రధాన పార్టీలైన టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీలు బైక్ ర్యాలీలు, యువజన సదస్సులు నిర్వహించాయి. యువతను మచ్చిక చేసుకునేందుకు పలు తాయిలాలు కూడా అందజేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో యువత ఎటువైపు మొగ్గు చూపుతుందనేది విజయావకాశాలను ప్రభావితం చేస్తుందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment