పోలవరం ఆర్డినెన్స్ పై దద్దరిల్లిన లోక్ సభ
న్యూఢిల్లీ : పోలవరం ఆర్డినెన్స్పై లోక్ సభ మంగళవారం దద్దరల్లింది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన బిల్లుపై లోక్సభలో టీఆర్ఎస్ ఎంపీలు ఆందోళనకు దిగారు. ఏపీ పునర్విభజన బిల్లులో సవరణలు, పోలవరం ముంపు మండలాలపై టీఆర్ఎస్ ఎంపీలు నిరసనకు దిగారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత ఆర్డినెన్స్ తేవడం చట్ట విరుద్ధమని టీఆర్‌ఎస్ ఎంపీ వినోద్ వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్రం అభిప్రాయం తీసుకోకుండా ఆర్డినెన్స్ ఎలా తెస్తారని ఆయన ప్రశ్నించారు.
ఓ దశలో టీఆర్ఎస్ ఎంపీలు స్పీకర్ పోడియం వద్దకు దూసుకు వెళ్లి జై తెలంగాణ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఎంపీలకు ఒడిశా, ఛత్తీస్గఢ్ ఎంపీలు మద్దతు తెలిపారు. దాంతో సభ్యుల నిరసనలు, నినాదాల మధ్య సభ మధ్యాహ్నం మూడున్నర వరకూ వాయిదా పడింది.