కూనవరం: పోలవరం ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా, ముంపు మండలాలను తెలంగాణలోనే కొనసాగించాలన్న డిమాండుతో ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో బుధవారం ఇక్కడ రిలే నిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి. వీటిని సర్పంచ్ కట్టం సునీత ప్రారంభించారు. మొదటి రోజు దీక్షలో ఉపాధ్యాయులు కె.మోహన్‌రావు, సోందె వెంకట్రావు, ఊకె సూర్యారావు, భూక్యా వీరన్న, అనిగె నాగేశ్వరావు, చిచ్చడి చందు, మల్లం భద్రయ్య, బొడ్డు ఆనంద్, సోందె శిరమయ్య, అనిల్‌కుమార్, కారం దూలయ్య, కుర్సం లక్ష్మణస్వామి కూర్చున్నారు. తొలుత, ఉద్యోగ-ఉపాధ్యాయ జేఏసీ నాయకులు టేకులబోరులోని అంబేద్కర్, అల్లూరి సీతారామరాజు విగ్రహాలకు పూల మాలు వేసి నివాళులర్పించారు.
ఆ తరువాత, దీక్షల ప్రారంభమయ్యాయి. ఈ కార్యమ్రంలో జేఏసీ మండల కన్వీనర్ కరక సత్యనారాయణ, కో-కన్వీనర్ ధర్ముల పుల్లయ్య మాట్లాడుతూ... పోలవరం ప్రాజెక్ట్ డిజైన్ మార్చాలని, ఉద్యోగులను తెలంగాణలోనే కొనసాగించాలని, గిరిజన చట్టాలను అమలుచేయాలని, భద్రాచలాన్ని గిరిజన జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేశా రు. ఆర్డినెన్స్‌ను రద్దు చేయాలన్న డిమాండుతో ఏవీఎస్‌పీ రాష్ట్ర నాయకుడు సున్నం వెంకటరమణ చేపట్టిన మహాపాదయాత్రకు జేఏసీ మద్దతు తెలిపింది. కార్యక్రమంలో టీఎన్‌జీవోస్ అసోసియేషన్ నాయకుడు ఎస్‌ఎన్‌వి.సుబ్బారావు, హెల్త్ సూపర్‌వైజర్ డి.శ్రీనివాసరావు, నాయకులు పండా కృష్ణయ్య, కుర్సం వెంకటేశ్వర్లు, వెంకట్ నారాయణ, పి.కన్నారావు, జి.సమ్మయ్య, ఎం.ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
ప్రదర్శన, రాస్తారోకో
భద్రాచలం టౌన్: పోలవరం ఆర్డినెన్స్‌ను రద్దు చేయాలన్న డిమాండుతో ఏఐఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో బుధవారం పట్టణంలో ప్రదర్శన, జూనియర్ కళాశాల సెంటర్‌లో రాస్తారోకో జరిగింది. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు సాయికుమార్, నాయకులు శివకృష్ణ, నాగరాజు, గోపి, హరీష్, వినోద్ తదితరులు పాల్గొన్నారు.
ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా రిలే దీక్షలు
Published Thu, Jul 3 2014 2:27 AM | Last Updated on Sat, Sep 2 2017 9:42 AM
Advertisement