నల్లగొండలో గ్యాంగ్ వార్, మాజీ మావోపై కాల్పులు
Published Mon, Aug 25 2014 6:27 PM | Last Updated on Tue, Oct 16 2018 9:08 PM
నల్లగొండ: నల్లగొండ జిల్లాలో మాజీ మావోయిస్టుల మధ్య గ్యాంగ్‌వార్ ఊపందుకుంది. వలిగొండ మండలం దాసిరెడ్డిగూడెంలో మాజీ మావోయిస్టు శంకర్‌పై సోమవారం సాయంత్రం ఆగంతకులు కాల్పులు జరిపారు.
ఈ కాల్పుల్లో గాయపడిన శంకర్ పరిస్థితి విషమంగా మారడంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. శంకర్ బెక్‌పై వెళ్తుండగా ప్రదీప్‌రెడ్డి కాల్పులు జరిపినట్టు ప్రత్యక్ష సాక్ష్యులు వెల్లడించారు. గతంలో నయిమ్ గ్యాంగ్ కాల్పుల్లో మరణించిన కొనపురి రాములుకు ప్రదీప్‌రెడ్డి ప్రధాన అనుచరుడుగా ఉన్నారు.
Advertisement
Advertisement