Konapuri Ramulu
-
నయీమ్‌తో సంబంధాలు ఉన్నవారిని శిక్షించండి
కొనపూరి రాములు భార్య కవిత సాక్షి, యాదాద్రి: గ్యాంగ్‌స్టర్ నయీమ్‌తో సంబంధాలు ఉన్న అసాంఘిక శక్తులకు పదవులను ఇస్తే బంగారు తెలంగాణ కాకుండా బద్మాష్ తెలంగాణ అవుతుందని కొనపూరి రాములు భార్య కొనపూరి కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం జిల్లా కేంద్రంలో సాంబశివుడు, కొనపూరి రాములు వర్ధంతి సభ జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నయీమ్‌తో చేతులు కలిపి అక్రమ వ్యాపారాలు, భూదందాలు చేసిన వ్యక్తి రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామి కావడం బాధాకరంగా ఉందని ఆమె పరోక్షంగా మంత్రి జగదీశ్‌రెడ్డిని ఉద్దేశిస్తూ ఆరోపణలు చేశారు. బీసీలంతా ఏకమైతే తమకు రాజకీయ ఇబ్బంది ఏర్పడుతుందని కొందరు సభను అడ్డుకోవాలని చూశారన్నారు. నయీమ్‌ను ఎన్కౌంటర్ చేసి ఎంతో మేలు చేశారన్నారు. ఇప్పటికైనా నయీమ్‌తో సంబంధాలు ఉండి బయట తిరుగుతున్న వారిని శిక్షించాలని లేకుంటే మరికొంత మంది నయీమ్‌లు తయారవుతారన్నారు. -
'నయీం ముఠా నుంచి రక్షణ కల్పించండి'
హైదరాబాద్: వనస్థలిపురం పోలీస్ స్టేషన్లో మాజీ మావోయిస్టు, గ్యాంగ్‌స్టర్ నయీముద్దీన్ అలియాస్ నయీమ్ ముఠాపై బుధవారం మరో ఫిర్యాదు అందింది. మాజీ మావోయిస్టు కోనపురి రాములు హత్యకు సహకరించలేదని తనపై నయీం ముఠా సభ్యులు దాడి చేశారంటూ ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నయీం ముఠా నుంచి ప్రాణహాని ఉందనీ, తనకు రక్షణ కల్పించాలంటూ రాములు డ్రైవర్ కిరణ్ పోలీసులను ఆశ్రయించాడు. అయితే నయీం ముఠా దాడిలో తాను తృటిలో తప్పించుకున్నానంటూ అతడు పోలీసులకు వివరించాడు. -
నల్లగొండలో గ్యాంగ్ వార్, మాజీ మావోపై కాల్పులు
-
నల్లగొండలో గ్యాంగ్ వార్, మాజీ మావోపై కాల్పులు
నల్లగొండ: నల్లగొండ జిల్లాలో మాజీ మావోయిస్టుల మధ్య గ్యాంగ్‌వార్ ఊపందుకుంది. వలిగొండ మండలం దాసిరెడ్డిగూడెంలో మాజీ మావోయిస్టు శంకర్‌పై సోమవారం సాయంత్రం ఆగంతకులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో గాయపడిన శంకర్ పరిస్థితి విషమంగా మారడంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. శంకర్ బెక్‌పై వెళ్తుండగా ప్రదీప్‌రెడ్డి కాల్పులు జరిపినట్టు ప్రత్యక్ష సాక్ష్యులు వెల్లడించారు. గతంలో నయిమ్ గ్యాంగ్ కాల్పుల్లో మరణించిన కొనపురి రాములుకు ప్రదీప్‌రెడ్డి ప్రధాన అనుచరుడుగా ఉన్నారు. -
నయీం డెరైక్షన్లోనే రాములు హత్య
ఎనిమిది మంది అరెస్ట్, పరారీలో మరో 8 మంది: ఎస్పీ ప్రభాకర్‌రావు వెల్లడి సాక్షి ప్రతినిధి, నల్లగొండ: సంచలనం సృష్టించిన టీఆర్ఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు, మాజీ మావోయిస్టు కొనపురి రాములు హత్య పక్కాప్రణాళికతోనే, మాజీ మావోయిస్టు నయీం కనుసన్నల్లోనే జరిగిందని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఈ కేసులో కేరళలో పోలీసులకు పట్టుబడిన నిందితులను నల్లగొండలో జిల్లా ఎస్పీ ప్రభాకర్‌రావు మీడియాకు చూపించారు.మావోయిస్టు పార్టీలో పనిచేసినప్పుడే నయీం, రాములు మధ్య శతృత్వం ఉందని, ఆ కారణమే రాములు హత్యకు దారితీసిందని ఎస్పీ వివరించారు. నయీం.. తన అనుచరులైన సురేష్, యాదగిరిలతో కలిసి హత్యకు పథకాన్ని రచించారని, లొంగిపోయిన మాజీ నక్సలైట్లను చేరదీశారని అన్నారు. నయీం డెరైక్షన్‌లో 10 మంది నిందితులు రెండు బృందాలుగా విడిపోయి పక్కా వ్యూహంతో ఈనెల 11వ తేదీన జిల్లాకేంద్రంలో ఎంఏ.బేగ్ ఫంక్షన్ హాల్లో రాములు కళ్లల్లో కారంచల్లి, కాల్పులు జరిపి హత్యచేసి పరారయ్యారని చెప్పారు. కేరళలో రాష్ట్రంలోని త్రివేండ్రంలో ఓ లాడ్జిలో తలదాచుకున్న వీరు, అక్కడి పోలీసుల తనిఖీల్లో పట్టుబడ్డారన్నారు. ఈ ఆరుగురు కాక, జిల్లాకేంద్రంలో మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. రాములు సోదరుడు సాంబశివుడి హత్య కేసులోని నిందితులూ ఈ హత్య ఘటనలో ఉన్నారు. కాగా, రాములు హత్య కేసులో పోలీసులు మొత్తం 16మందిని నిందితులుగా చేర్చారు. ఇందులో మొదటి ముద్దాయి నయీం. ఇప్పటివరకు ఎనిమిది మంది నిందితులను పోలీసుల అదుపులో ఉండగా, మరో ఎనిమిది మంది పరారీలో ఉన్నట్లు పోలీసులు ప్రకటించారు. కేరళ పోలీసులకు చిలకరాజు సురేష్ (వనస్థలిపురం-హైదరాబాద్), కుమారస్వామి (కమలాపూర్-కరీంనగర్), రమేష్ (హసన్‌పర్తి - వరంగల్), ఎల్లేష్ (కథలాపూర్), రవి (పెంబర్తి , వరంగల్), సోమయ్య (చౌడూర్ - వరంగల్) ఉన్నారు. అంతకు ముందే నల్లగొండలో గాదరి యాదగిరి, రియాజుద్దీన్ పోలీసులకు పట్టుబడ్డారు. అలాగే, రాములు హత్య కేసులో నిందితులుగా ఉన్న ఎండీ నయీం, క్రాంతి, చిరంజీవి, బాబన్న, శివన్న, గాదరి సంగీత, నిందితులకు ఆశ్రయం ఇచ్చిన న్యాయవాది ఎస్ఆర్ భిక్షపతి, సునీత పరారీలో ఉన్నారని ఎస్పీ ప్రభాకర్‌రావు వివరించారు. నయీంతో సహా ఎవరినీ వదలద్దు పోలీసు అధికారులను నిర్దేశించిన కేసీఆర్? సాక్షి,హైదరాబాద్: రాములు హత్య కేసులో ప్రధాన నిందితుడిగా బావిస్తున్న నయీంతో సహా ఎవరిని వదలొద్దని టీఆర్ఎస్ ఎల్పీ నాయకుడు కేసీఆర్ నిర్దేశించినట్లు తెలిసింది. ఉన్నత పోలీసు అధికారులు కేసీఆర్‌ను కలుసుకుని కొనపురి రాములు హత్య కేసులో నిందితులుగా బావిస్తున్న ఆరుగురిని కేరళలో అరెస్టు చేసిన విషయాన్ని ఆయన దృష్టికి తీసుకు వెళ్లారు. అయితే ప్రధాన నిందితుడు నయీంను ఎందుకు పట్టుకోలేక పోతున్నారని కేసీఆర్ ప్రశ్నించినట్లు తెలుస్తోం ది. ఒక దశలో ఆయన కేసు మందగొండిగా సాగడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈ పరిణామం జరిగిన తరువాత కేసీఆర్ ఈ కేసు పట్ల సీరియస్‌గా ఉన్నారనే విషయాన్ని గ్రహించిన అధికారులు నయీంను పట్టుకునేందుకు ఆరుప్రత్యేక పోలీసు దళాలను రంగంలోకి దింపినట్లు తెలుస్తోంది. -
కొనసూరి రాములు హత్యకేసులో నిందితుల అరెస్ట్
త్రివేండ్రం: మాజీ మావోయిస్టు, టీఆర్ఎస్ నేత సాంబశివుడు సోదరుడు కోనపురి రాములు హత్యకేసులో నిందితులను కేరళ రాష్ట్రంలోని త్రివేండ్రంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాములు హత్యకేసుతో సంబంధమున్న ఆరుగురిని పక్కా సమాచారం ఆధారంగా పోలీసులు అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. నిందితులను త్వరలోనే హైదరాబాద్‌కు పోలీసులు తీసుకురానున్నారు. టీఆర్ఎస్ పార్టీ నల్లగొండ జిల్లా ఉపాధ్యక్షుడుగా సేవలందిస్తున్న మాజీ మావోయిస్టు కొనపురి రాములు మే 11 తేదిన దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఓ వివాహ వేడుకలో పాల్గొన్న రాములును దుండగులు పథకం ప్రకారం హత్య చేశారు. -
మాజీ మావోయిస్టు రాములు హత్య
-
నయీం.. ఏపీ దావూద్
-
నయీం.. ఏపీ దావూద్
పదుల కేసులున్న మాజీ నక్సలైట్ ఇప్పటికీ ‘పట్టుకోలేక’పోతున్న పోలీసులు ఉన్నతాధికారుల అండదండలనే ఆరోపణ కొనపురి రాములు హత్యతో మళ్లీ తెరపైకి సాక్షి, హైదరాబాద్: నయీముద్దీన్ అలియాస్ భువనగిరి నయీం. అతడి పేరు చెప్తే హక్కుల సంఘాల నేతలు సైతం ఉలిక్కిపడతారు. రాజకీయ నాయకులూ హడలెత్తిపోతారు. మాజీ నక్సలైట్లకు, మావోయిస్టులకు కంటిపై కునుకుండదు. ఇప్పటికే 40కి పైగా హత్యలు, బెదిరింపుల కేసులతో పాటు లెక్కలేనన్ని సెటిల్మెంట్లను తన ఖాతాలో వేసుకుని రాష్ట్ర పోలీసులకు మోస్ట్ వాంటెడ్‌గా మారిన మాజీ నక్సలైట్, ప్రస్తుతం కరుడుగట్టిన నేరగాడు నయీం. ఏళ్లుగా పరారీలోనే నేర సామ్రాజ్యాన్ని ఏలుతూ ఒకరకంగా రాష్ట్రం పాలిట దావూద్ ఇబ్రహీంలా మారాడు. ఆదివారం నల్లగొండలో మాజీ మావోయిస్టు, టీఆర్ఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు కొనపురి రాములు దారుణ హత్యతో నయీం పేరు మరోసారి తెరపైకి వచ్చింది. నక్సలైట్ నుంచి కోవర్టుగా నల్లగొండ జిల్లా భువ నగిరికి చెందిన నయీం సమ సమాజ స్థాపన కోసమంటూ మూడు దశాబ్దాల క్రితం పీపుల్స్ వార్‌లో చేరాడు. వార్ అగ్రనేతలు పటేల్ సుధాకర్‌రెడ్డి, శాఖమూరి అప్పారావుల వద్ద శిష్యరికం చేసి వారికి సన్నిహితుడిగా మెలిగాడు. నక్సలైట్‌గా జీవితం ప్రారంభించిన నయీం, ఆ తరవాత నక్సల్స్‌ను అంతం చేయడమే తన జీవితాశయమని ప్రకటించాడు! దీనికి సంబంధించి అనేక చోట్ల ప్రదర్శనలను కూడా నిర్వహించాడు. ఈ పరిణామ క్రమంలోనే పోలీసులు నయీంను చేరదీసి తమ అజ్ఞాత కార్యకలాపాల్లో ఉపయోగించడం ప్రారంభించారు. ఓ దశలో కోవర్టుగా మారి నక్సలైట్ల రహస్యాలను పోలీసులకు చేరవేసేవాడని కూడా చెబుతారు. నయీం ఇచ్చిన సమాచారంతోనే అనేక ఎన్కౌంటర్లలో పీపుల్స్‌వార్, మావోయిస్టు నేతల్ని ఖాకీలు మట్టుపెట్టారంటారు. ఉన్నతాధికారులతో సాన్నిహిత్యం కోవర్టు జీవితం గడిపిన నయీం పోలీసు ఉన్నతాధికారులతో సంబంధాలు ఏర్పాటు చేసుకున్నాడు. వారి చేతిలో ‘ఆయుధం’గా కూడా మారాడు. చట్ట పరిధిలో చేయలేని అనేక పనుల్ని పోలీసులు అతడితో చేయించుకుంటారని వినిడికి. ఇదే అతడి బలంగా మారిందని కూడా కొందరు అధికారులంటారు. నయీంకు కొందరు పోలీసులే సహకరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఈ ‘పోలీసు ఆయుధం’ జాడను సీబీఐ కూడా కనిపెట్టలేకపోయిందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సొహ్రాబుద్దీన్ బూటకపు ఎన్కౌంటర్ కేసులో నయీం కోసం గుజరాత్ పోలీసులతో పాటు సీబీఐ కూడా గాలించింది. కానీ వారెవరికీ అతని జాడయినా తెలియలేదు. రాష్ట్రానికి చెందిన కొందరు ఉన్నతాధికారుల మద్దతేఇందుకు కారణమని తెలుస్తోంది. దారుణ హత్యలకు కేరాఫ్ అడ్రస్ నయీం చేసిన అనేక దారుణ హత్యల్ని ఇప్పటికీ పోలీసులే మర్చిపోలేరు. అజ్ఞాతంలో ఉండగానే భువనగిరిలో బెల్లి లలిత దారుణ హత్యతో నయీం పేరు రాష్ట్రవ్యాప్తంగా మారుమోగింది. గ్రేహౌండ్స్‌కు ఆద్యుడైన ఐపీఎస్ అధికారి కేఎస్ వ్యాస్ హత్య కేసులోనూ ఇతను నిందితుడు. ఈ కేసు 14 ఏళ్ల తరవాత కోర్టులో వీగిపోయింది. పౌర హక్కుల నేతలు పురుషోత్తం, కరుణాకర్లను పట్టపగలే తెగనరికిన కేసుల్లో కూడా నయీం పాత్ర సుస్పష్టం. మరో నేత ఆజం అలీనీ చంపినట్లు ఆరోపణలున్నాయి. మాజీ మావోయిస్టులు గణేశ్, ఈదన్న హత్య వెనకా నయీమే మాస్టర్‌మైండ్ అని పోలీసులు చెప్తుంటారు. ఎల్బీ నగర్‌కు చెందిన రియల్టర్ రాధాకృష్ణ, మాజీ మావోయిస్టు నేత, టీఆర్ఎస్ నాయకుడు కె.సాంబశివుడు, రివల్యూషనరీ పేట్రియాటిక్ టైగర్స్ (ఆర్పీటీ) వ్యవస్థాపకుడు పటోళ్ల గోవర్ధన్‌రెడ్డి... ఇలా అనేక దారుణ హత్యలకు నయీం, అతడి గ్యాంగ్ కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయాయి. అనేక కోర్టుల్లో నయీంపై నాన్‌బెయిలబుల్ వారెంట్లు పెండింగ్‌లో ఉన్నాయి. ఎక్కడా బయటికి రాకుండా నయీం నేరాలు చేయించే స్టైల్, ఆ తరవాత సదరు నిందితులు అరెస్టయ్యే విధానం ఆద్యంతం పక్కాగా ఉంటాయి. అందుకే ఏ కేసులోనూ పోలీసులు నయీంకు వ్యతిరేకంగా పక్కా ఆధారాలు సేకరించలేకపోతున్నారు. సైబరాబాద్, హైదరాబాద్‌లకు చెందిన కొందరు యువకులను, నేరగాళ్లను చేరదీసి నయీం తన సామ్రాజ్యాన్ని విస్తరించాడు. ఈ ముఠా కుట్రల్ని జంట కమిషనరేట్ల పోలీసులు అనేక సార్లు ఛేదించారు. అయితే నేరాలకు పాల్పడేది ఒకరైతే, 48 గంటల్లోనే లొంగిపోయే వారు మరొకరు! అందుకే ఏ కేసులోనూ నయీం వ్యవహారం పూర్తిస్థాయిలో వెలుగులోకి రాదు. సంచలనాత్మక హత్య జరిగిన ప్రతిసారీ అది నయీం పనేనని ప్రకటించే పోలీసులు, అతన్ని పట్టుకోవడంలో మాత్రం ‘విఫలమవుతుంటారు’. -
మాజీ మావోయిస్టు రాములు హత్య
నల్లగొండలో దుండగుల దాడి రాములుపైకి ఆరు రౌండ్ల కాల్పులు, ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి పెళ్లికి హాజరైన రాములు..ఫంక్షన్ హాల్ వద్దే దారుణం నయీం ముఠాపైనే అనుమానాలు.. మృతుడు మాజీ మావోయిస్టు అగ్రనేత సాంబశివుడి సోదరుడు, టీఆర్ఎస్ నల్లగొండ జిల్లా ఉపాధ్యక్షుడు సాక్షి, నల్లగొండ: మాజీ మావోయిస్టు, టీఆర్ఎస్ పార్టీ నల్లగొండ జిల్లా ఉపాధ్యక్షుడు కొనపురి రాములు(40) దారుణ హత్యకు గురయ్యారు. మావోయిస్టు దివంగత అగ్రనేత సాంబశివుడు సోదరుడు కూడా అయిన రాములు.. ఓ వివాహ వేడుకలో పాల్గొనేందుకు ఆదివారం నల్లగొండకు రావడంతో దుండగులు పథకం ప్రకారం హత్య చేశారు. సంచలనం సృష్టించిన ఈ హత్యోదంతం ఉదయం 11.50 నిమిషాలకు జరిగింది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. పట్టణ శివారు రాంనగర్ సమీపంలోని ఎం.ఎ.బేగ్ ఫంక్షన్ హాల్లో జరిగిన సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా నాయకుడు కొలగాని పర్వతాలు కూతురి వివాహానికి రాములు హాజరయ్యారు. వేడుకకు హాజరైన ప్రముఖులతో మాట్లాడుతూ అరగంట పాటు అక్కడే గడిపారు. అనంతరం వధూవరులను ఆశీర్వదించి బయటకు వచ్చారు. ఫంక్షన్ హాల్ ప్రవేశ ద్వారం వద్దే మాటువేసిన గుర్తు తెలియని వ్యక్తులు ఒక్కసారిగా రాములుపై అతి సమీపం నుంచి కాల్పులు జరిపి పారిపోయారు. తీవ్రంగా గాయపడిన రాములును నల్లగొండ ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగానే ప్రాణాలు విడిచారు. 25 నుంచి 30 ఏళ్ల వయసు ఉన్న ఆరుగురు ఆగంతకులు ఈ హత్యలో పాల్గొన్నట్లు తెలుస్తోంది. దాడి సమయంలో రాములుకు సెక్యూరిటీగా ఉన్న ఇద్దరు గన్మన్ల చేతులను నలుగురు గట్టిగా వెనక్కి పట్టుకున్నారు. మరో ఇద్దరు వ్యక్తులు ఆరు రౌండ్లు కాల్పులు జరిపారు. దీంతో రెండు బుల్లెట్లు రాములు తలలోకి, ఛాతీలోకి దూసుకెళ్లాయి. దుండగులు కారంపొడి చల్లడంతో ప్రతిదాడి చేయలేకపోయామని గన్మెన్లు ఆ తర్వాత చెప్పారు. కాల్పులు జరిపిన వెంటనే ఫంక్షన్ హాల్ వెనక వైపున్న గోడ దూకి నార్కట్‌పల్లి-అద్దంకి రహదారిలో దుండగులు పారిపోయారు. ఘటన అనంతరం తేరుకున్న గన్మెన్లు రాములును ఆస్పత్రికి తరలిస్తుండగానే మార్గమధ్యంలో ఆయన చనిపోయారు. మృతదేహానికి వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం ఆయన భౌతిక కాయాన్ని టీఆర్ఎస్ జిల్లా కార్యాలయానికి తీసుకువచ్చి కొద్దిసేపు ఉంచారు. పోలీసుల అదుపులో గన్మెన్లు రాములుకు సెక్యూరిటీగా ఉన్న ఇద్దరు గన్మెన్లను జిల్లా అదనపు ఎస్పీ అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. సంఘటనకు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు వారిద్దరినీ విచారిస్తున్నట్లు తెలిసింది. మావోయిస్టు మాజీ నేత కొనపురి అయిలయ్య అలియాస్ సాంబశివుడికి, మరో మాజీ నక్సలైట్ నయీంకు మధ్య శతృత్వం ఉంది. సాంబశివుడి హత్యలో నయీం ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. మిగతా నిందితులను అరెస్టు చేసిన పోలీసులు నయీంను మాత్రం అరెస్టు చేయలేకపోయారు. మావోయిస్టుల కదలికలపై అతను పోలీసు ఇన్ఫార్మర్గా పనిచేసిన విషయం బహిరంగ రహస్యమే. సాంబశివుడికి సోదరుడైన రాములు హత్యలో పాల్గొన్నది కూడా నయీం ముఠా సభ్యులేనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రెండుసార్లు కుట్ర భగ్నం మూడేళ్ల కిందట అప్పుడప్పుడే టీఆర్ఎస్ నాయకునిగా ఎదుగుతున్న కొనపురి అయిలయ్య అలియాస్ సాంబశివుడిని దారికాచి హత్య చేశారు. ఈ సంఘటన తర్వాత సాంబశివుని సోదరుడు కొనపురి రాములు హత్యకు పథకం రచించారు. చౌటుప్పల్‌లో ఓసారి, భూదాన్‌పోచంపల్లిలో మరోసారి ఆయన హత్యకు పన్నిన కుట్రలను పోలీసులు భగ్నం చేశారు. నయీం ముఠా నుంచి తనకు ప్రాణ హాని ఉందని రాములు అనేకసార్లు ప్రభుత్వానికి విన్నవించారు. మొదట గన్మెన్లను కేటాయించిన ప్రభుత్వం ఆ తర్వాత వారిని తొలగించడంతో కోర్టు ద్వారా తిరిగి గన్మెన్ల రక్షణ పొందారు. ప్రభుత్వం కేటాయించిన గన్మెన్లతో పాటు, ఏ స్టేషన్ పరిధిలో పర్యటిస్తే, అక్కడి ఎస్ఐకి సమాచారమిచ్చి స్థానిక పోలీసుల రక్షణ కూడా తీసుకుంటున్నారు. ఇంత అప్రమత్తంగా ఉంటున్నా, పక్కా ప్రణాళికతో రాములును వెంటాడినట్లు కనిపిస్తోంది. జిల్లా కేంద్రంలో ఆదివారం న్యూడెమొక్రసీ నాయకుని కూతురు వివాహంతో పాటు, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బండా నరేందర్‌రెడ్డి కూతురు వివాహ వేడుకలు జరిగాయి. ఈ రెండు పెళ్లిళ్లకు రాములు కచ్చితంగా హాజరవుతాడన్న సమాచారంతోనే దుండగులు తెగబడినట్లు విధితమవుతోంది. హత్య జరిగిన వివాహ వేడుక నుంచి రాములు టీఆర్ఎస్ నేత వివాహానికి హాజరు కావాల్సి ఉంది. దానికి టీఆర్ఎస్ అధినేత కే సీఆర్‌తో పాటు, ఆ పార్టీ రాష్ట్ర నాయకులు పలువురు హాజరు కానుండడంతో ఆ వేడుక వద్ద పోలీసు బందోబస్తును పెంచారు. అక్కడ రాములును టార్గెట్ చేయడం సాధ్యం కాదని, మొదటి ఫంక్షన్ హాలునే ఎంచుకున్నట్లు పోలీసు వర్గాలు విశ్లేషించాయి. ఇది పోలీసుల పనే: రాములు కుటుంబ సభ్యులు ‘ఇది ముమ్మాటికీ పోలీసుల పనే. నయీంతో మాకు ఎటువంటి గొడవల్లేవు. నయీం ముఠా పేర నెపం నెట్టివేసే ప్రయత్నం చేస్తున్నారు. రాములు ఎక్కడికి వెళ్లినా కచ్చితంగా ఆ ప్రాంత పోలీసులకు సమాచారం ఇస్తున్నాడు. సమాచారం ఇవ్వలేదని నల్లగొండ పోలీసులు అనడం నిజం కాదు. పోలీసులే ఏదో దాస్తున్నారు. మాకు పోలీసులపైనే అనుమానాలున్నాయ’ని రాములు కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా, రాములును హత్యచేసిన వారిని అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని పార్టీ అధినేత కె.చంద్రశేఖర్‌రావు ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. నయీం ముఠా పనే కావచ్చు రాములు హత్య నయీం ముఠా పనే కావచ్చు. రాములు ఎక్కడకి వెళ్లినా మాకు ముందస్తు సమాచారముండేది. ఎన్నికల్లో ఓటేసేందుకు కూడా బందోబస్తు కల్పించాం. కానీ ఆదివారం నల్లగొండకు వచ్చే సమాచారం మాకివ్వలేదు. సమీపంలోని ఏచూరి ఫంక్షన్ హాల్లో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశాం. రాములు సమాచారం తెలిసుంటే అక్కడా బందోబస్తు ఏర్పాటు చేసేవాళ్లం. సంఘటన స్థలం నుంచి ఒక తుపాకీ, పేలిన తూటాలను స్వాధీనం చేసుకున్నాం. క్లూస్‌టీంతో ఆధారాలు సేకరిస్తున్నాం. అగంతకులను పట్టుకునే ప్రయత్నంలో ఉన్నాం. నయీం కోసం గాలింపు చర్యలు కూడా చేపట్టాం. త్వరలోనే నిందితులను పట్టుకుంటాం. - టి.ప్రభాకర్‌రావు, జిల్లా ఎస్పీ -
''ప్రభుత్వం నుంచి ప్రాణభయం ఉంది''
-
కోనపురి రాములు హత్యను ఖండించిన కేసీఆర్
మావోయిస్టు మాజీ నేత, నల్గొండ జిల్లా టీఆర్ఎస్ పార్టీ ఉపాధ్యక్షుడు కోనపురి రాములు హత్యను టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ తీవ్రంగా ఖండించారు. నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. న్యూడెమెక్రసీ నేత పర్వతాలు కుమారుడి వివాహం నల్గొండలోని ఓ ప్రవేట్ ఫంక్షన్ హల్లో ఆదిరవారం జరిగింది. ఆ విహహానికి టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌తోపాటు రాములు కూడా హాజరైయ్యారు. ఆ వేడుకల నుంచి కేసీఆర్ వెళ్లిన కొన్ని నిముషాలకే దుండగులు పొదల మాటు నుంచి ఫంక్షన్ హాల్లోకి ప్రవేశించారు. అనంతరం రాములపై అతి దగ్గరగా కాల్పులు జరిపారు. దాంతో ఆయన అక్కడికక్కడే రక్తపు మడుగులో కుప్పకూలిపోయాడు. దుండగులు అక్కడినుంచి పరారైయ్యారు. రాములు వ్యక్తిగత భద్రత సిబ్బంది వెంటనే అప్రమత్తమై కాల్పులు జరిపినప్పటికి అప్పటికే హంతకులు పారిపోయారు.