నయీమ్‌తో సంబంధాలు ఉన్నవారిని శిక్షించండి | Konapuri Kavitha comments on Nayeem | Sakshi
Sakshi News home page

నయీమ్‌తో సంబంధాలు ఉన్నవారిని శిక్షించండి

Published Mon, Mar 27 2017 1:24 AM | Last Updated on Tue, Sep 5 2017 7:09 AM

Konapuri Kavitha comments on Nayeem

కొనపూరి రాములు భార్య కవిత

సాక్షి, యాదాద్రి: గ్యాంగ్‌స్టర్‌ నయీమ్‌తో సంబంధాలు ఉన్న అసాంఘిక శక్తులకు పదవులను ఇస్తే బంగారు తెలంగాణ కాకుండా బద్మాష్‌ తెలంగాణ అవుతుందని కొనపూరి రాములు భార్య కొనపూరి కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం జిల్లా కేంద్రంలో సాంబశివుడు, కొనపూరి రాములు వర్ధంతి సభ జరిగింది.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నయీమ్‌తో చేతులు కలిపి అక్రమ వ్యాపారాలు, భూదందాలు చేసిన వ్యక్తి రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామి కావడం బాధాకరంగా ఉందని ఆమె పరోక్షంగా మంత్రి జగదీశ్‌రెడ్డిని ఉద్దేశిస్తూ ఆరోపణలు చేశారు. బీసీలంతా ఏకమైతే తమకు రాజకీయ ఇబ్బంది ఏర్పడుతుందని కొందరు సభను అడ్డుకోవాలని చూశారన్నారు. నయీమ్‌ను ఎన్‌కౌంటర్‌ చేసి ఎంతో మేలు చేశారన్నారు. ఇప్పటికైనా నయీమ్‌తో సంబంధాలు ఉండి బయట తిరుగుతున్న వారిని శిక్షించాలని లేకుంటే మరికొంత మంది నయీమ్‌లు తయారవుతారన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement