కోనపురి రాములు హత్యను ఖండించిన కేసీఆర్
మావోయిస్టు మాజీ నేత, నల్గొండ జిల్లా టీఆర్ఎస్ పార్టీ ఉపాధ్యక్షుడు కోనపురి రాములు హత్యను టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ తీవ్రంగా ఖండించారు. నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. న్యూడెమెక్రసీ నేత పర్వతాలు కుమారుడి వివాహం నల్గొండలోని ఓ ప్రవేట్ ఫంక్షన్ హల్లో ఆదిరవారం జరిగింది. ఆ విహహానికి టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్తోపాటు రాములు కూడా హాజరైయ్యారు.
ఆ వేడుకల నుంచి కేసీఆర్ వెళ్లిన కొన్ని నిముషాలకే దుండగులు పొదల మాటు నుంచి ఫంక్షన్ హాల్లోకి ప్రవేశించారు. అనంతరం రాములపై అతి దగ్గరగా కాల్పులు జరిపారు. దాంతో ఆయన అక్కడికక్కడే రక్తపు మడుగులో కుప్పకూలిపోయాడు. దుండగులు అక్కడినుంచి పరారైయ్యారు. రాములు వ్యక్తిగత భద్రత సిబ్బంది వెంటనే అప్రమత్తమై కాల్పులు జరిపినప్పటికి అప్పటికే హంతకులు పారిపోయారు.