మావోయిస్టుల కదలికలు లేవు
నల్లగొండ క్రైం : జిల్లాలో మావోయిస్టుల కదలికలు లేవని హైదరాబాద్ రేంజ్ డీఐజీ గంగాధర్ తెలిపారు. అక్కడక్కడ మావోయిస్టుల పేరు తో వెలుస్తున్న పోస్టర్లు సానుభూతిపరుల పనేనని, ప్రజలు ఆందోళన చెందవద్దన్నా రు. గురువారం జిల్లా పరిశీలనకు వచ్చిన ఆయన ఎస్పీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో నేరాలను అదుపు చేసేందుకు పోలీస్‌శాఖ ప్రత్యేక చర్యలు చేపడుతోందని పేర్కొన్నారు. ఇందులో భాగంగానే నగరాలు, జిల్లా కేంద్రాలు, పట్టణాల్లోని ముఖ్య కూడళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్టు వివరించారు. సీసీ కెమెరాలతో నిందితులను త్వరితగతిన గుర్తించేందుకు వీలుంటుందన్నారు.
ఇందు కు ఇటీవల రాష్ట్ర రాజధాని సీసీ కెమెరాలతో ఛేదించిన కేసులను ఉదహరించారు. వీటి తో రోడ్డు ప్రమాదాల తీరును కూడా తెలుసుకునే వెసులుబాటు ఉంటుందన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానాన్ని అవలంబిస్తున్నట్లు తెలిపారు. పోలీసులు ప్రజలతో స్నే హపూర్వకంగా వ్యవహారించాలని సూచి ంచారు. మహిళలపై అత్యాచారాలను నిరోధించేందుకు ‘షి’ కమిటీ నియమించినట్లు తెలిపారు. నివేదిక ఆధారంగా నూతనచట్టం తీసుకొచ్చి కఠినంగా శిక్షిస్తామన్నారు. పోలీస్‌స్టేషన్లను ఏబీసీడీలుగా విభజించి వాటి నిర్వహణకు నిధులు కేటాయిస్తామన్నారు. సమావేశంలో ఎస్పీ.ప్రభాకర్‌రావు, ఓఎస్‌డీ రాధాకిషన్‌రావు, డీఎస్పీలు ఉన్నారు.
ప్రతి పోలీసు బాధ్యతగా వ్యవహరించాలి
ప్రతి పోలీసు బాధ్యతగా వ్యవహరించాలని డీఐజీ పోలీసు అధికారులను ఆదేశించారు. డీఎస్పీలు, సీఐలతో ఆయన సమావేశం నిర్వహించి శాంతిభద్రతలు నేరాల సంఘటనలపై సమీక్ష నిర్వహించారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రైవేటు సంస్థల సహకారం తీసుకోవాలన్నారు. నేర సంఘటనలను నిరోధించేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు.అంతకు ముం దు ఎస్పీ కార్యాలయంలో పోలీసులతో గౌరవ వందనం స్వీకరించారు. సమావేశంలో డీఎస్పీ, సీఐలు పాల్గొన్నారు.
విద్యుదుత్పాదక కేంద్రాల సందర్శన
నాగార్జునసాగర్ : సాగర్‌లోని విద్యుదుత్పాదక కేంద్రాలను గురువారం సాయంత్రం డీఐజీ గంగాధర్, ఎస్పీ ప్రభాకర్‌రావు సందర్శించారు. రాయలసీమ ప్రాతానికి చెందిన రాజకీయ నాయకులు విద్యుదుత్పాదక కేంద్రాలను బ్లాక్‌చేస్తావ ఇటీవల హెచ్చరించడంతో ఎగువన ఉన్న శ్రీశైలం,జూరాల ప్రాంతాల్లో సెక్యురిటీని భారీగా పెంచారు. నిఘా విభాగం సమాచారం మేరకు నాగార్జునసాగర్‌లో సెక్యురిటీ అవసరాలను పరిశీలించడానికి డీఐజీ సందర్శించినట్లు సమాచారం. ముందుగా ప్రధాన విద్యుదుత్పాదక కేంద్రాన్ని సంద ర్శించి విద్యుదుత్పాదన వివరాలు, సెక్యురిటీ గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎడమ కాలువపై ఉన్న విద్యుదుత్పాదక కేంద్రంతో పాటు హెడ్‌రెగ్యులేటర్ తదితర ప్రాంతాలను సందర్శించారు. ఈయన వెంట మిర్యాలగూడ డీఎస్పీ సందీప్, హాలియా సీఐ పార్థసారథి, ఎస్‌ఐ రజనీకర్ దేవరకొండ ఎస్‌బీ హెడ్‌కానిస్టేబుల్ వెంకట్‌రెడ్డి ఉన్నారు.