Special Activities
-
ట్రంప్ భారత్ టూర్లో రాజభోగాలు
వాషింగ్టన్, న్యూఢిల్లీ : ప్రపంచానికే పెద్దన్న దేశం విడిచి వస్తున్నాడంటే ఆయన రాజభోగాలకు కొరతేం ఉండదు. భద్రత అత్యంత కట్టుదిట్టంగా ఉంటుంది. అందుకే ఆయన ప్రయాణించే విమానం, కారు, హెలికాప్టర్ వేటి ప్రత్యేకతలు వాటికే ఉన్నాయి. ఎలాంటి దాడులనైనా తట్టుకుంటాయి. ఆత్మరక్షణ కోసం ఆయుధాలుగా కూడా మారుతాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ నెల 24, 25న భారత్‌కు వస్తున్న నేపథ్యంలో ఆయన ప్రయాణ సాధనాలు, వాటి ప్రత్యేకతలు... (వైరల్‌గా మారిన మొతేరా స్టేడియం ఫోటోలు) ఎయిర్‌ఫోర్స్ వన్ ► అమెరికా అధ్యక్షుడు ప్రయాణించే ఏ విమాన్నయినా ఎయిర్‌ఫోర్స్ 1 అనే పిలుస్తారు. ► ప్రస్తుతం ట్రంప్ భారత్‌కు వస్తున్న విమానం బోయింగ్ 747–200. ఈ విమానంపై యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అన్న అక్షరాలు, అమెరికా జాతీయ జెండా ఉంటాయి. ► ఈ విమానానికి ఎలాంటి అణుబాంబులనైనా తట్టుకునే సామర్థ్యం ఉంది. దాడి జరిగే అవకాశం ఉందని ఉప్పందితే చాలు మొబైల్ కమాండ్ సెంటర్‌గా మారుతుంది. ► నాలుగు జెట్ ఇంజిన్స్‌తో ఈ విమానం నడుస్తుంది ► గంటకి వెయ్యి కి.మీ కంటే అధిక వేగంతో ప్రయాణిస్తుంది. ► 70 మంది వరకు ప్రయాణించవచ్చు. ► గాల్లోనే ఇంధనాన్ని నింపుకునే సౌకర్యం ఈ విమానానికి ఉండడం ప్రత్యేకత. దీంతో ఎంతసేపైనా ప్రపంచం ఈ చివరి నుంచి ఆ చివరి వరకు చుట్టేయగలదు. ► విమానం లోపల విస్తీర్ణం 4 వేల చదరపు అడుగులు ఉంటుంది. మూడు అంతస్తుల్లో ఈ –విమానాన్ని తయారు చేశారు. వైట్ హౌస్‌లో ఉన్న సదుపాయాలన్నీ ఇందులో ఉంటాయి. ► అధ్యక్ష కార్యాలయం, జిమ్, కాన్ఫరెన్స్ గది, డైనింగ్ రూమ్, అత్యాధునిక సమాచార వ్యవస్థ, సిబ్బంది ఉండేందుకు లాంజ్ సహా సకల సౌకర్యాలు ఉంటాయి. ► ఒకేసారి 100 మందికి వంట చేసే సదుపాయం కూడా ఉంది ► ప్రయాణ సమయంలో ఏవైనా అనారోగ్య సమస్యలు వస్తే అధునాతన వైద్య పరికరాలతో మినీ ఆస్పత్రి, అందుబాటులో వైద్యుడు ఉంటారు. అద్దాలే ఆయుధాలు ది బీస్ట్ అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి ట్రంప్ 22 కి.మీ. మేర రోడ్డు ప్రయాణం చేస్తారు. ఆ సమయంలో ఆయన తన వెంట తెచ్చుకున్న కారులోనే వెళతారు. బీస్ట్ అని పిలిచే ఈ కారుకి ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ► ఒబామా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఈ కారు తొలిసారి వాడకంలోకి వచ్చింది. ► ఈ కారుని కాడలిక్ 1 అని కూడా అంటారు. ప్రపంచంలోనే అత్యంత భద్రతా ఏర్పాట్లున్న కారు ఇదే ► ఇలాంటి బీస్ట్ కార్లు 12 అధ్యక్షుడు వెళ్లే కాన్వాయ్‌లో ఉంటాయి ► 5 అంగుళాల మందం కలిగిన స్టీల్, అల్యూమినియం, టైటానియం, సిరామిక్స్‌తో తయారు చేశారు. ► దాడి జరిగితే కారు కిటికీ అద్దాలే ఆయుధాలుగా మారిపోతాయి. ఈ కారు అద్దాలు అవసరమైతే గుళ్ల వర్షాన్ని కురిపించగలవు ► అమెరికా సీక్రెట్ సర్వీస్‌కు చెందిన వారు మాత్రమే ఈ కారుని నడుపుతారు. అత్యవసర పరిస్థితుల్లో ఎలా తప్పించుకోవాలో, 180 డిగ్రీల్లో కారుని తిప్పడం, ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కోవడం వంటి వాటిలో డ్రైవర్‌కి శిక్షణ ఇస్తారు ► ఈ కారు పక్కనే బాంబు పేలినా లోపల ప్రయాణించే అధ్యక్షుడికి ఏమీ కాదు. ► జీవరసాయన దాడుల నుంచి కూడా తట్టుకొనే సౌకర్యం ఈ కారుకి ఉంది. ► రాత్రిపూట ప్రయాణాల్లో కనిపించే నైట్ విజన్ కెమెరాలు, గ్రనేడ్ లాంచర్స్, ఆక్సిజన్ అందించే ఏర్పాటు, అధ్యక్షుడి గ్రూప్ రక్తం .వంటి సదుపాయాలుంటాయి. ► అధ్యక్షుడు ఎక్కడ ఉన్నా, ఏ దేశంలో ఉన్నా ఆ సీటు కారులో కూర్చొనే ఉపాధ్యక్షుడితో మాట్లాడడానికి వీలుగా శాటిలైట్ ఫోన్ ఉంటుంది. హెలికాప్టర్.. మెరైన్ వన్ అమెరికా అధ్యక్షుడు ఏ దేశానికి వెళ్లినా మెరైన్ వన్ హెలికాఫ్టర్ కూడా వెంట వస్తుంది. ఆయా దేశాల్లో చిన్న చిన్న దూరాలకు, తాను బస చేసే హోటల్‌కి వెళ్లడానికి ఈ హెలికాప్టర్ని వినియోగిస్తారు. ► వీహెచ్–3డీ సీ కింగ్ లేదంటే వీహెచ్–60ఎన్ వైట్ హాక్ హెలికాప్టర్లే అధ్యక్షుడి ప్రయాణానికి వినియోగిస్తారు. ► క్షిపణి దాడుల్ని సైతం ఈ హెలికాప్టర్లు తట్టుకుంటాయి. ఆ హెలికాప్టర్లో అత్యాధునిక సమాచార వ్యవస్థ ఉంటుంది. ► అధ్యక్షుడి భద్రత కోసం ఒకేసారి అయిదువరకు ఒకే రకంగా ఉండే హెలికాప్టర్లు ప్రయాణిస్తాయి. ఒక దాంట్లో అధ్యక్షుడు ఉంటే, మిగిలినవి ఆయనకు రక్షణగా వెళతాయి. ► అధ్యక్షుడు ప్రయాణిస్తున్న మెరైన్ వన్ ఎటు వెళుతోందో ఈ అయిదు హెలికాప్టర్లు ఒకదానికొకటి సమాచారాన్ని అందించుకుంటాయి. -
విమానాశ్రయ అభివృద్ధికి చర్యలు
కోరుకొండ : మధురపూడి విమానాశ్రయం అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని రాజమండ్రి ఎంపీ మాగంటి మురళీమోహన్ అన్నారు. మంగళవారం నిడిగట్ల గ్రామంలో రోడ్డు శంకుస్థాపనలో పాల్గొనడానికి వచ్చిన ఎంపీ మాట్లాడుతూ జూన్ లో ఉదయం, రాత్రి ప్రత్యేక విమానం తిరుగుతుందని అందుకు అన్ని సన్నాహాలు చేస్తున్నామన్నారు. విమానాశ్రయ విస్తరణలో రన్‌వేను మరింత అభివృద్ధి చేస్తామన్నారు. ఒకేసారి మూడు విమానాలు దిగేలా చర్యలు చేపట్టామన్నారు. రాజమండ్రి నుంచి బూరుగుపూడి వరకు రోడ్డుకిరువైపులా వెడల్పు చేయడంతో భూముల రేట్లు పెరుగుతున్నాయన్నారు. విమానాశ్రయ విస్తరణ పనులో భూములు కోల్పోయిన రైతులకు న్యాయం జరిగేలా కృషి చేస్తానన్నారు. రాజమండ్రి ఆనం కళాకేంద్రంలో జరిగే నంది మహోత్సవాలకు ప్రజాదరణ బాగుందన్నారు. విమాన విస్తరణలో పొలాలు, చెట్లుపోయిన రైతులకు చేయూతనిస్తామని రాజానగరం ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ అన్నారు. సమావేశంలో పలువురు నాయకులు పాల్గొన్నారు. ఎంపీ, ఎమ్మెల్యేలకు రైతుల మొర : మార్కెట్ ధర ప్రకారం నష్ట పరిహారం ఇప్పించాలని మధురపూడి విమానాశ్రయ విస్తరణలో భూములు కోల్పోతున్న రైతులు విజ్ఞప్తి చేశారు. ఎంపీ మురళీమోహన్, ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్‌లకు బూరుగుపూడి, మధురపూడి రైతులు వినతిపత్రాలు అంద జేశారు. -
సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పాటుకు ప్రత్యేక చర్యలు
స్థలాన్ని పరిశీలించిన కేంద్ర కమిటీ సభ్యులు బుక్కరాయసముద్రం : జిల్లాలో సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పాటుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు న్యూఢిల్లీ కేంద్ర మంత్రిత్వ శాఖ హెఆర్డీ జాయింట్ సెక్రటరీ, ఐఏఎస్ అధికారి సుఖ్బీర్ సింగ్ తెలిపారు. జిల్లాలో సెంట్రల్ యూనివ ర్సిటీ నిర్మాణం కోసం మండల పరిధిలోని జంతులూరు గ్రామంలో స్థల పరిశీలన కోసం సెంట్రల్ కమిటీ సభ్యులు మంగళవారం పర్యటించారు. కేంద్ర మంత్రిత్వ శాఖ హెచ్ఆర్డీ జాయింట్ సెక్రటరీ ఐఏఎస్ అధికారి సుఖ్బీర్ సింగ్ సాధు నేతృత్వంలో అడ్మినిస్ట్రేషన్ అండ్ ఫైనాన్స్ డిప్యూటీ సెక్రటరీ అజయ్‌కుమార్ ఖండూరీ, రాష్ట్ర హయ్యర్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ సుమిత్రాదారా, హైదరాబాద్ యూనివర్సిటీ వీసీ హరిబాబు ఈ కమిటీలో ఉన్నారు. రాష్ట్ర సమాచార శాఖ, ఐటీ మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి, ప్రభుత్వ విప్ యామినీబాల, ఎమ్మెల్సీ శమంతకమణి, కలెక్టర్ కోన శశిధర్ హాజరయ్యారు. ముందుగా జంతులూరు గ్రామంలోని ఓపన్ ఎయిర్ జైలుకు సంబంధించిన 500 ఎకరాల పొలాన్ని తొలుత ఈ కమిటీ సభ్యులు పరిశీలించారు. ఈ పొలం చుట్టూ ఉన్న వనరులను మంత్రి, ప్రభుత్వ విప్, కలెక్టర్ వారికి వివరించారు. అనంతపురం రైల్వే స్టేషన్ నుంచి ఇక్కడికి 6 కిలోమీటర్ల దూరం ఉందని, అనంతపురం-తాడిపత్రి నాలుగు లైన్ల రహదారి పక్కనే ఈ భూమి ఉందని తెలిపారు. బెంగుళూరు అంతర్జాతీయ విమానాశ్రయానికి 160 కిలోమీటర్ల దూరం, జంతులూరు గ్రామానికి 10 కిలోమీటర్లు దూరంలో నేషనల్ హైవే-44 ఉందని కమిటీ సభ్యులకు వివరించారు. గ్రామ సమీపంలో తుంగభద్ర ఎగువ కాలువ , పీఏబీఆర్, మిడ్ పెన్నార్ డ్యాంలు ఉన్నాయన్నారు. హంద్రీ నీవా సుజల స్రవంతి మొదటి దశ పూర్తి చేసుకుని రెండో దశ నిర్మాణం పూరోగతిలో ఉందని, వీటి ద్వారా నీటి కొరత ఉండదని అన్నారు. జిల్లా కేంద్రం 6 కిలోమీటర్ల దూరంలో యూనివర్సిటీలు, సర్వ జన వైద్యశాల, ప్రభుత్వ వైద్య కళాశాల, జేఎన్టీయూ, ఎస్కే యూనివర్సిటీ, అనేక ప్రయివేటు ఇంజినీరింగ్ కళాశాలలు, డిగ్రీ, జూనియర్ కళాశాలలు అందుబాటులో ఉన్నాయని వారు కమిటీకి వివరించారు. భవిష్యత్తులో అనంతపురంలో విమానాశ్రమం కూడా ఏర్పాటు కానుందని చెప్పారు. సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పాటుకు జంతులూరు అన్ని విధాలా ఎంతో అనుకూలమని వారు తెలిపారు. కమిటీ వెంట ఆర్డీఓ హుసేన్ సాహెబ్, జెడ్పీటీసీ రామలింగారెడ్డి, తహశీల్దార్ సుబ్బలక్ష్మమ్మ, తదితరులు పాల్గొన్నారు. -
క్రైమ్ రేట్ తగ్గించేందుకు చర్యలు
హుజూర్నగర్: మిర్యాలగూడ డివిజన్ పరిధిలోని పోలీస్స్టేషన్లలో క్రైమ్ రేటు తగ్గించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు డీఎస్పీ సందీప్ గోనె తెలిపారు. సోమవారం స్థానిక సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో నమోదైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును విచారించేందుకు వచ్చిన ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గడిచిన ఏడాది కంటే ఈ ఏడాది ఇప్పటి వరకు క్రైమ్ రేటు బాగా తగ్గిందన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో పోలీస్స్టేషన్లలో పేపర్‌లెస్ పరిపాలన పద్ధతి ఈనెల 5 నుంచి ప్రారంభించినట్లు తెలిపారు. ఈ పద్ధతి ద్వారా ఫిర్యాదులు, ఎఫ్ఐఆర్లు, పరిపాలన ఆన్లైన్లోనే కొనసాగుతుందన్నారు. ఇప్పటికే ప్రతిస్టేషన్ నుంచి ఇద్దరు సిబ్బం ది,ఎస్ఐలకు శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. సమావేశంలో సీఐ సురేందర్‌రెడ్డి, ఎస్ఐలు అఖిల్‌జామా, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
మావోయిస్టుల కదలికలు లేవు
నల్లగొండ క్రైం : జిల్లాలో మావోయిస్టుల కదలికలు లేవని హైదరాబాద్ రేంజ్ డీఐజీ గంగాధర్ తెలిపారు. అక్కడక్కడ మావోయిస్టుల పేరు తో వెలుస్తున్న పోస్టర్లు సానుభూతిపరుల పనేనని, ప్రజలు ఆందోళన చెందవద్దన్నా రు. గురువారం జిల్లా పరిశీలనకు వచ్చిన ఆయన ఎస్పీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో నేరాలను అదుపు చేసేందుకు పోలీస్‌శాఖ ప్రత్యేక చర్యలు చేపడుతోందని పేర్కొన్నారు. ఇందులో భాగంగానే నగరాలు, జిల్లా కేంద్రాలు, పట్టణాల్లోని ముఖ్య కూడళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్టు వివరించారు. సీసీ కెమెరాలతో నిందితులను త్వరితగతిన గుర్తించేందుకు వీలుంటుందన్నారు. ఇందు కు ఇటీవల రాష్ట్ర రాజధాని సీసీ కెమెరాలతో ఛేదించిన కేసులను ఉదహరించారు. వీటి తో రోడ్డు ప్రమాదాల తీరును కూడా తెలుసుకునే వెసులుబాటు ఉంటుందన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానాన్ని అవలంబిస్తున్నట్లు తెలిపారు. పోలీసులు ప్రజలతో స్నే హపూర్వకంగా వ్యవహారించాలని సూచి ంచారు. మహిళలపై అత్యాచారాలను నిరోధించేందుకు ‘షి’ కమిటీ నియమించినట్లు తెలిపారు. నివేదిక ఆధారంగా నూతనచట్టం తీసుకొచ్చి కఠినంగా శిక్షిస్తామన్నారు. పోలీస్స్టేషన్లను ఏబీసీడీలుగా విభజించి వాటి నిర్వహణకు నిధులు కేటాయిస్తామన్నారు. సమావేశంలో ఎస్పీ.ప్రభాకర్‌రావు, ఓఎస్డీ రాధాకిషన్‌రావు, డీఎస్పీలు ఉన్నారు. ప్రతి పోలీసు బాధ్యతగా వ్యవహరించాలి ప్రతి పోలీసు బాధ్యతగా వ్యవహరించాలని డీఐజీ పోలీసు అధికారులను ఆదేశించారు. డీఎస్పీలు, సీఐలతో ఆయన సమావేశం నిర్వహించి శాంతిభద్రతలు నేరాల సంఘటనలపై సమీక్ష నిర్వహించారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రైవేటు సంస్థల సహకారం తీసుకోవాలన్నారు. నేర సంఘటనలను నిరోధించేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు.అంతకు ముం దు ఎస్పీ కార్యాలయంలో పోలీసులతో గౌరవ వందనం స్వీకరించారు. సమావేశంలో డీఎస్పీ, సీఐలు పాల్గొన్నారు. విద్యుదుత్పాదక కేంద్రాల సందర్శన నాగార్జునసాగర్ : సాగర్‌లోని విద్యుదుత్పాదక కేంద్రాలను గురువారం సాయంత్రం డీఐజీ గంగాధర్, ఎస్పీ ప్రభాకర్‌రావు సందర్శించారు. రాయలసీమ ప్రాతానికి చెందిన రాజకీయ నాయకులు విద్యుదుత్పాదక కేంద్రాలను బ్లాక్చేస్తావ ఇటీవల హెచ్చరించడంతో ఎగువన ఉన్న శ్రీశైలం,జూరాల ప్రాంతాల్లో సెక్యురిటీని భారీగా పెంచారు. నిఘా విభాగం సమాచారం మేరకు నాగార్జునసాగర్‌లో సెక్యురిటీ అవసరాలను పరిశీలించడానికి డీఐజీ సందర్శించినట్లు సమాచారం. ముందుగా ప్రధాన విద్యుదుత్పాదక కేంద్రాన్ని సంద ర్శించి విద్యుదుత్పాదన వివరాలు, సెక్యురిటీ గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎడమ కాలువపై ఉన్న విద్యుదుత్పాదక కేంద్రంతో పాటు హెడ్‌రెగ్యులేటర్ తదితర ప్రాంతాలను సందర్శించారు. ఈయన వెంట మిర్యాలగూడ డీఎస్పీ సందీప్, హాలియా సీఐ పార్థసారథి, ఎస్ఐ రజనీకర్ దేవరకొండ ఎస్బీ హెడ్‌కానిస్టేబుల్ వెంకట్‌రెడ్డి ఉన్నారు. -
రాత్రి వేళల్లో గస్తీ ముమ్మరం
విజయనగరం క్రైం, న్యూస్‌లైన్ :వేసవి నేపథ్యంలో ఇటీవల కాలంలో చోరీలు ఎక్కువయ్యూయని, దీనిని అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ఎస్పీ తఫ్సీర్ ఇక్బాల్ ప్రకటించారు. రాత్రి వేళల్లో గస్తీ ముమ్మరం చేయనున్నట్లు చెప్పారు. అదే విధంగా రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టామని చెప్పారు. శనివారం జిల్లా పోలీసు కార్యాలయ సమావేశ మందిరంలో విజయనగరం సబ్‌డివిజన్ పరిధిలో నేర సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పోలీస్ అధికారులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ప్రతి సర్కిల్ పరిధిలో నేరాలను నియంత్రించేందుకు, ఇప్పటివరకు జరిగిన చోరీల్లో అపహరణకు గురైన ఆస్తిని రికవరీ చేసేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. దొంగతనాల నివారణకు ప్రత్యేక ప్రణాళిక ద్వారా స్పెషల్ టీంలను నియమించి అనుమానిత వ్యక్తులు, పాతనేరస్తులపై నిఘా ఉంచాలని చెప్పారు. పట్టణ, గ్రామ శివారు ప్రాంతాల్లో దొంగతనాల నివారణకు మొబైల్ టీంలను నియమించాలని, రహస్య గస్తీని ఏర్పాటు చేయాలని తెలిపారు. ప్రజలకు అవగాహన కార్యకమాలను నిర్వహించడం ద్వారా నేరాలను నియంత్రించేందుకు ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. వాహనదారులు డ్రైవింగ్ చేసే సమయంలో రహదారి నిబంధనలు పాటించేటట్లు ప్రజలకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు. వాహనాలు పరిమితమైన వేగంతో వెళ్లేటట్లు చూడాలన్నారు. ముఖ్యమైన కూడళ్లలో వాహన తనిఖీలు, నాకాబందీలు నిర్వహించాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. పట్టణాల్లో ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు ప్రత్యేక ప్రణాళికల ద్వారా చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం గత మాసంలో నమోదైన కేసులు, దర్యాప్తు దశలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సమీక్షించారు. ఈ సమావేశంలో విజయనగరం డీఎస్పీ ఎస్.శ్రీనివాస్, ఒకటో పట్టణ సీఐ కె.రామారావు, రెండో పట్టణ సీఐ పి.ముత్యాలనాయుడు, ట్రాఫిక్ సీఐ ఎ.రవికుమార్, సీఐలు బి.లలిత, ఎ.ఎస్.చక్రవర్తి, లక్ష్మణమూర్తి, ఇ.నర్సింహమూర్తి, వై.వి.శేషు, కుమారస్వామి, వాసుదేవ్ తదితరులు పాల్గొన్నారు. -
శాంతిభద్రతలపై ప్రత్యేక చర్యలు
వేలూరు, న్యూస్‌లైన్:వేలూరు, తిరువ ణ్ణామలై జిల్లా లో శాంతిభద్రతలపై ప్రత్యేక చర్యలు తీసుకుంటామని డీఐజీ తమిళ్‌చంద్రన్ తెలిపారు. వేలూరు డీఐజీగా తమిళ్‌చంద్రన్ శుక్రవారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ వేలూరు,తిరువణ్ణామలై జిల్లా లో మామూళ్లు వసూలు చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. వేలూరులో ట్రాఫిక్ సమస్య ను పోలీసు అధికారులతో చర్చించి వాటిని మార్పుచేసేందుకు కృషి చేస్తానన్నారు. రాత్రి వేళల్లో చోరీలు అధికంగా జరుగుతున్నట్లు, పట్టణంలో కార్పొరేట్, బంగారు దుకాణాల్లో చోరీలు జరిగినప్పటికీ ఇంతవరకు సంబంధించిన వారిని అరెస్ట్ చేయలేదని అటువంటి కేసులను పరిశీలించి వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. వాహన తనిఖీలు, రోడ్డు ప్రమాదాలపై సమీక్షించి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. వేలూ రు జిల్లా సరిహద్దు ప్రాంతాల ద్వారా ఎర్రచందనం, నాటు సారా ఇతర జిల్లాలకు తరలుతున్నట్లు విమర్శలున్నాయని అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఆయనవెంట ఎస్పీ విజయకుమార్, డీ ఎస్పీలు, ఇన్స్పెక్టర్లు, పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.